Monday, August 22, 2022

జీవో 111 అమలుపై 15 ఏండ్లు అయినా కౌంటర్ దాఖలు చేయరా....?

*జీవో 111 అమలుపై 15 ఏండ్లు అయినా కౌంటర్ దాఖలు చేయరా....?*

*హైకోర్టు ఆదేశాలను లైట్‌గా తీసుకుంటున్నారు...*

*రాష్ట్ర ప్రభుత్వానికి చివరి అవకాశంగా 2 వారాల గడువు: హైకోర్టు*

*హైదరాబాద్‌....*
ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను పరిరక్షించే ఉద్దేశంతో జారీచేసిన 111 జీవో ను పటిష్ఠంగా అమలు చేసే అంశంపై 15 ఏండ్లుగా ప్రభు త్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ స్పందన తెలియజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ .. తమ ఆదేశాలను ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటున్నదని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి రూ. 25వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. జీవో 111ను కఠినంగా అమలుచేయాలని కోరుతూ పలు ఎన్జీవోలకు చెందిన డాక్టర్‌ ఎస్‌.జీవానందరెడ్డి, ఒమిమ్‌ మానెక్‌ షా డెబెరా 2007లో వేర్వేరు గా పిటిషన్లు దాఖలు చేశారు. ఈపిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ఽధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే జంట జలాశయాల పరిరక్షణను ప్రమాదంలో పడేసేలా ప్రభుత్వం ఇటీవల జీవో 69ను జారీచేసిందని తెలిపారు. జీవో 111లోని ఆంక్షలను జీవో 69 ద్వారా ఎత్తేసి, కొత్త ఆంక్షలు విధిస్తామని ప్రభుత్వం పేర్కొన్నదని తెలిపా రు. జీవో 111లోని ఆంక్షలను సడలించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు జారీచేశాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవో 111 ఆంక్షలను ఎత్తేసేందుకు జీవో 69 జారీచేసిందని తెలిపారు. జీవో 69ను సైతం తాము మధ్యంతర పిటిషన్‌ ద్వారా సవాల్‌ చేశామని పేర్కొన్నారు. కొత్త ఆంక్షలు ఎలా ఉంటాయి?, అలాగే నిపుణుల కమిటీ ఏర్పాటుకు సం బంధించిన వివరాలను హైకోర్టు ఎదుట ఉంచే విధంగా ఆదేశాలు జారీచేయాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ పిటిషన్‌లలో కౌంటర్‌ ఇంకా ఎప్పుడు దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించింది. ''ఇప్పటికే 15 ఏండ్లు గడిచిపోయాయి. కౌంటర్‌ దాఖలు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ప్రభుత్వ స్పందన తెలియజేయడానికి చివరి అవకాశం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు''

అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ న్యాయవాదుల వ్యవహారశైలి బాధాకరమని... హైకోర్టు ఆదేశాల ప్రాము ఖ్యం ఎలాంటిదో వారు అర్థంచేసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు చివరి అవకాశం ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తి చేయడంతో చిట్టచివరి అవకాశంగా రెండు వారాలపాటు గ డువు మంజూరు చేసింది. విచారణను సెప్టెంబర్‌ 14కు వాయిదావేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment