Sunday, August 21, 2022

రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.... కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది!

*రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.... కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది!*

మునుగోడు : సీఎం కేసీఆర్‌  సర్కార్‌ని పడగొట్టేందుకు ఇది ఆరంభమని కేంద్రమంత్రి అమిత్‌ షా  అన్నారు.మునుగోడులో బీజేపీ (Bjp) నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఉపఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy)ని గెలిపిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం పడిపోతుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తానని కేసీఆర్‌ చెప్పారని.. కానీ ఇప్పుడు మాట తప్పారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. విమోచన దినోత్సవం నిర్వహిస్తామని అమిత్‌షా తెలిపారు.

''నిరుద్యోగ యువతకు 3 వేలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం హామీ ఏమైంది?. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ చెప్పారు.. కానీ అది జరగలేదు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారు. పేదలకు ఇల్లు ఇస్తామన్నారు?.. ఇచ్చారా?. మోదీ ఇచ్చే టాయిలెట్లను కూడా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారు. దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్‌లో చెప్పారు. ఎంత మంది దళితులకు రూ.10 లక్షలు వచ్చాయి?. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికైనా ఇచ్చారా?. గిరిజనులకు ఎకరం భూమి ఎక్కడైనా ఇచ్చారా?. రాష్ట్రంలో 2014 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదు. గిరిజనులకు ఎకరం భూమి ఎక్కడైనా ఇచ్చారా?. '' అని అమిత్‌ షా ప్రశ్నించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment