Thursday, September 1, 2022

అరుదైన దృశ్యం.... గణేశుడికి ఒకేసారి 31వేల మహిళల.... స్వరార్చన.....!

*అరుదైన దృశ్యం.... గణేశుడికి ఒకేసారి 31వేల మహిళల.... స్వరార్చన.....!*

పుణె: ఒకేసారి 31వేల మంది మహిళలు.. వినాయక మండపం ఎదుట కూర్చుని గణనాథుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ అరుదైన దృశ్యం మహారాష్ట్రలో ఆవిష్కృతమైంది.పుణెలోని ప్రఖ్యాత దగ్దుషేత్‌ హల్వాయి గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం రుషి పంచమిని పురస్కరించుకుని 31 వేల మంది మహిళలు వినాయక మండపం ఎదుట కూర్చుని గణపతికి ప్రీతికరమైన అథర్వణ శీర్ష స్తోత్రాన్ని పఠించారు. సంప్రదాయ వేషధారణలో వచ్చిన మహిళలతో ఆ ప్రాంగణమంతా కళకళలాడింది. ఈ ఆనవాయితీ 35 ఏళ్ల నుంచి కొనసాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. కొవిడ్‌ సంక్షోభం వల్ల గత రెండేళ్లు.. కార్యక్రమాన్ని నిర్వహించలేదని, ఈసారి అద్భుతంగా జరిగిందని తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడి పై...1.25లక్షల అప్పు.... నిర్మలా సీతారామన్

*తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడి పై...1.25లక్షల అప్పు.... నిర్మలా సీతారామన్*

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మార్చుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్రం ఒకపేరు పెడితే..రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందని విమర్శించారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

''కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.20లక్షల కోట్లకు పెంచారు. ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్టుగా పెంచుతున్నారు. 'మన ఊరు-మన బడి' కేంద్ర పథకం అయితే దాన్ని రాష్ట్ర స్కీమ్‌గా క్లెయిమ్‌ చేసుకుంటున్నారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయనే ఆయుష్మాన్‌ భారత్‌లో చేరడం లేదు. తెలంగాణలో ప్రతి 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారు. ఫసల్‌ బీమాయోజన ఎందుకు ఇవ్వడం లేదు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. రూ.లక్ష రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు. రైతు బీమా కౌలు రైతులకు ఎందుకివ్వరు? పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు తప్ప వాటిని నెరవేర్చడం లేదు. మిగులు బడ్జెట్‌ కాస్తా లోటు బడ్జెట్‌ అయ్యింది. బడ్జెట్‌ అప్రూవల్‌ కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడంలేదు. బడ్జెట్‌లో చాలా అప్పులు చూపించడం లేదు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది. తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని తెలంగాణ దాటిపోయింది. దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి మీరు సమాధానం చెప్పండి. లిక్కర్‌ స్కామ్‌లో ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలి'' అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

విదేశాలకు వెళ్లేందుకు... శస్త్ర చికిత్స ద్వారా వేలిముద్రలు మార్చేస్తున్నారు... సీపీ

*విదేశాలకు వెళ్లేందుకు... శస్త్ర చికిత్స ద్వారా వేలిముద్రలు మార్చేస్తున్నారు... సీపీ*

హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లేందుకు వీలుగా వేలిముద్రల్ని మార్చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితుల్ని మల్కాజ్‌గిరి పోలీసులు పట్టుకున్నారని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లా వాసి నాగమునీశ్వర్‌రెడ్డిని ఈకేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు వెల్లడించారు. నాగమునీశ్వర్‌రెడ్డి తిరుపతిలో రేడియాలజీ కోర్సు చేశాడని వివరించారు. వీసా గడువు పూర్తయిన వారిని కువైట్‌ నుంచి వెనక్కి పంపుతున్నారని, అలా వచ్చిన వారిలో కొందరు శ్రీలంక వెళ్లి ఫింగర్ ప్రింట్‌ సర్జరీ చేయించుకున్నట్టు గుర్తించామని సీపీ తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన ఫింగర్‌ ప్రింట్‌ ఏడాది పాటు ఉంటుందని, వీరంతా నకిలీ ఫింగర్ ప్రింట్‌ ద్వారా విదేశాలకు వెళ్లేందుకు మళ్లీ కుట్ర చేస్తున్నారని వివరించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Wednesday, August 31, 2022

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ

https://youtu.be/mhx2P5uU5Zc   *#పర్యావరణపరిరక్షణ లో భాగంగా #HMDA & #హైదరాబాద్ జిందాబాద్ & #ప్రజాసంకల్పం(NGO) ఆధ్వర్యంలో #GHMC ఉప్పల్ సర్కిల్ #రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ చౌరస్తా లో మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి #రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధి #ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మక్బుల్ జానీ సర్ గారు మరియు #GHMC ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ACP అధికారి వెంకట రమణ సర్ గారు మరియు హైకోర్టు న్యాయవాది ఆనంద సర్ గారు  పాల్గొన్నారు*


*https://youtu.be/_hWFkWnZf-4*  *పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలి.... అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 🙏.... Bplkm🪶*



ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి కి తొలి పూజ చేసిన గవర్నర్ తమిళిసై

ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి కి తొలి పూజ చేసిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరానికి ప్రత్యేకత తీసుకొచ్చిన 'ఖైరతాబాద్‌ గణేశ్‌' వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ చేశారు. ఈ ఏడాది 'పంచముఖ మహాలక్ష్మి గణపతి'గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరానికి ప్రత్యేకత తీసుకొచ్చిన 'ఖైరతాబాద్‌ గణేశ్‌' వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ చేశారు. ఈ ఏడాది 'పంచముఖ మహాలక్ష్మి గణపతి'గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.
ఈసారి 50 అడుగులతో ఏర్పాటు చేసిన బడా గణేశ్‌ను మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు. వినాయకుడితో పాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, త్రిశక్తిగా పిలుచుకునే మహాగాయత్రిదేవీ కొలువుదీరారు. ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తు్న్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Tuesday, August 30, 2022

మంత్రి KTR కు కరోనా పాజిటివ్.... ట్విట్టర్ ద్వారా వెల్లడి...!

*మంత్రి KTR కు కరోనా పాజిటివ్.... ట్విట్టర్ ద్వారా వెల్లడి...!*

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి కరోనా బారినపడ్డారు.ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు కేటీఆర్‌. లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని తెలిపారాయన. స్వల్ప లక్షణాలతోనే ఆయన కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ దయచేసి పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని ఆయన అభ్యర్థించారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

కేజ్రీవాల్ పై.... అన్నా హజారే ఫైర్

*అధికారమనే మత్తులో*
*మునిగిపోయారు.... కేజ్రీవాల్ పై.... అన్నా హజారే ఫైర్*

దిల్లీ: ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికార మత్తులో ఉన్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే  ఘాటు వ్యాఖ్యలు చేశారు.దిల్లీ మద్యం పాలసీ పై విమర్శలు ఎక్కుపెడుతూ తాజాగా ఆయన కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు. 'మద్యం మాదిరే.. అధికారం కూడా మత్తు కలిగిస్తుంది. మీరూ ఆ మత్తులో మునిగిపోయినట్లు కనిపిస్తోంది' అంటూ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం.. ఏ ఇతర పార్టీలకు భిన్నంగా లేదని వ్యాఖ్యానించారు. ఇది చాలా బాధకరమన్నారు. 'టీం అన్నా' ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉంటే.. ఇప్పుడు ఇటువంటి తప్పుడు ఎక్సైజ్‌ విధానాలు ఎక్కడా వచ్చేవి కాదన్నారు.

'మీరు సీఎం అయిన తర్వాత మొదటిసారి రాస్తున్న లేఖ ఇది. ఎందుకంటే.. దిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీపై ఇటీవల వెలువడిన వార్తాకథనాలపై కలత చెందా. గతంలో మీ 'స్వరాజ్' పుస్తకంలో మద్యం విధానాలపై ఆదర్శప్రాయ విషయాలు పొందుపరిచారు. దానికి నాతో ఉపోద్ఘాతం రాయించారు. స్థానికుల ఆమోదం లేకుండా మద్యం దుకాణాలు తెరవకూడదని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆదర్శాలను మరిచిపోయారు. మీ మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందని తెలుస్తోంది. బలమైన లోక్‌పాల్, లోకాయుక్తాలను తీసుకురావడాన్ని పక్కనబెట్టి.. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకమైన మద్యం పాలసీని తీసుకువచ్చారు' అని విమర్శించారు.

మద్యం పాలసీలో మహారాష్ట్రతోపాటు తన గ్రామమైన రాలేగావ్‌ సిద్ధిలను ఆదర్శంగా పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వంపైనా ఇలాంటే ఆశలే పెట్టుకున్నట్లు.. కానీ, ఇలా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఇతర పార్టీల మాదిరే దిల్లీలోనూ జనాలు.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారమన్న వలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఒక పెద్ద ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీకి ఇది తగదు' అని లేఖలో రాసుకొచ్చారు. అన్నా హజారే ఆధ్వర్యంలో 2011-12 సమయంలో దేశంలో పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. అందులో కేజ్రీవాల్‌ సైతం పాల్గొన్నారు. అయితే.. అన్నాహజారే పలు సందర్భాల్లో ఆప్‌పై విమర్శలు గుప్పించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం