Monday, January 26, 2026

ప్రైవేట్ వ్యక్తలు గుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం!



*_ఇందిరమ్మ రాజ్యంలో "రాజ్యాంగేతర శక్తులు!"_*

👉మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా పవర్ ఫుల్! 
👉ఫైలు ఏదైనా, పైరవీలు ఏమైనా అన్నీ వారి కనుసన్నల్లోనే! 
👉ప్రైవేట్ వ్యక్తలు గుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం! 

*టెండర్లు, దందాలు రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి!*

*షాడో హోం రేవంత్ రైట్ హ్యాండ్ వేం నరేందర్ రెడ్డి!*

*షాడో రెవెన్యూ రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి!*

*షాడో సినిమాటోగ్రఫి రేవంత్ నమ్మినబంటు రోహిన్ రెడ్డి!*

*షాడో మున్సిపల్ రేవంత్ అనుచరుడు ఫయీం ఖురేషీ!*

*కొడంగల్ షాడో ఎమ్మెల్యే రేవంత్ అన్న తిరుపతి రెడ్డి!*

*విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు రేవంత్ తమ్ముడు కృష్ణారెడ్డి!*

*ఫైరవీలు దందాలు రేవంత్ చిన్ననాటి దోస్త్ అనిల్ రెడ్డి!*

*సచివాలయంలో షాడో సీఎంగా ఓ మహిళా అంటూ కథనాలు!*

ప్రజాపాలనా, ఇందిరమ్మ రాజ్యంతో పేరుతో రాజ్యాంగేతరుల చేతుల్లో తెలంగాణ ప్రభుత్వ పాలన!
ప్రతిపక్షాలు ఆధారాలు బయటపెడుతున్నా మారని ప్రభుత్వ పెద్దల తీరు

*‘వాళ్లు చట్టసభకు వెళ్లలేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదు. ప్రభుత్వంలో ఎలాంటి చిన్న పదవులు కూడా లేవు. కానీ, వాళ్ల మాటే శాసనం.* వాళ్ల కన్ను పడందే టెండర్ దక్కదు. వాళ్ల అనుమతి లేనిదే ఫైలు కదలదు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ‘రాజ్యాంగేతర శక్తులు’ తెలంగాణ పరిపాలనా యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అమృత టెండర్ల నుంచి సినిమా టికెట్ల సెటిల్మెంట్ల వరకు,  హైడ్రా కూల్చివేతల నుంచి భూముల కేటాయింపుల వరకు. అంతా ఈ ‘షాడో’ శక్తుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Courtesy / Source by :
https://x.com/shankar_journo/status/2015960656676323799?t=T4axAws-IaWfzrgffY5EEQ&s=08

No comments:

Post a Comment