Monday, January 19, 2026

_NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వెడల్పు చేయాలి_

NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వెడల్పు పెంపు అవసరం కోసం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని శామీర్ పేట లో వారి నివాసంలో కలిసిన వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు
స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు.

ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఈ వంతెనను సుమారు 45 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు.

ప్రాంతంలో జనాభా వేగంగా పెరగడం, కొత్త కాలనీలు విస్తరించడంతో ప్రస్తుతం ఈ వంతెన ట్రాఫిక్‌ను మోయలేకపోతోంది. ఇది హబ్సిగూడా నుండి ఈసీఐఎల్‌కు, బోడుప్పల్ నుండి ఈసీఐఎల్‌కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు దీనిపై ఆధారపడుతున్నారు.

వంతెన వెడల్పు తక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు అవసరం.

ఈ పనుల కోసం ప్రత్యేక రైల్వే అభివృద్ధి ప్రణాళిక (SRDP) కింద నిధులు ఇప్పటికే విడుదలైనట్లు నా దృష్టికి వచ్చింది.
అందువల్ల, దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి NFC రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపుకు అనుమతి ఇవ్వగలరని మనవి. దీనివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు తగ్గుతాయి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment