ప్రతి నియోజకవర్గానికి ఒక ఒక జర్నలిస్టుకు కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వాలి
సత్యం గౌడ్ డిమాండ్
ప్రతి సమస్యని మొదటగా గుర్తించేది జర్నలిస్టులే తీర్చేది జర్నలిస్టులే
జర్నలిస్టుల సూచనలతోనే అధికారులు, ప్రజాప్రతినిధులు విధులు నిర్వహిస్తున్నారు
హైదరాబాద్: రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి జర్నలిస్టులకు అన్ని నియోజకవర్గాల్లో ఒక డివిజన్ కు కార్పొరేటర్ గా సముచిత అవకాశాలు కల్పించాలి అని భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యంగౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియాకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, అభివృద్ధి చేయడంలో ఒక జర్నలిస్టుకు తెలిసినట్టు మరి ఎవరికి తెలియదని,
ప్రాంతీయ సమస్యలను ప్రభుత్వాల ముందుకు తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిని రాజకీయంగా ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని సత్యంగౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో ప్రజలతో నిత్యం మమేకమై ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించగల సామర్థ్యం కలిగి ఉన్నారని,యూనిఫామ్ లేకుండా,జీతాలు లేకున్నా నిస్వార్ధంగా ప్రజాసేవ చేసే జర్నలిస్ట్ లకు రాజకీయ అవకాశాలు కల్పిస్తే ప్రజలకు మరిన్ని సేవాలందించగలరని,
ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన అవకాశాలు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జర్నలిస్టులకు అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలు ఆదిశగా ఆలోచించాలని, దీనివల్ల రాజకీయాల్లో అభివృద్ధి, పారదర్శకత పెరుగుతాయని జర్నలిస్ట్ సంఘాలు అభిప్రాయం వ్యక్తo చేస్తున్నాయని సత్యంగౌడ్ అన్నారు.
ఈ అంశంపై రాజకీయ పార్టీల అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో, జర్నలిస్టులకు వాస్తవంగా ఎలాంటి అవకాశాలు కల్పిస్తారో వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ డిమాండ్ మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటుందనే చెప్పాలి.
No comments:
Post a Comment