*హైకోర్టు కాలనీ హెచ్ఎంటి చెరువులోనీ గుర్రపు డెక్కని తొలగించండి : కార్పొరేటర్ బన్నాల*
*దోమల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించండి జోనల్ కమిషనర్ గారు : కార్పొరేటర్ బన్నాల*
*చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఈరోజు ఉప్పల్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారిని కలిసి హైకోర్టు కాలనీ హెచ్ఎంటి నగర్ చెరువులో గుర్రపు డెక్క తో నిండి పోయిందని దానివల్ల విపరీతమైన దోమల తో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే గుర్రపు డెక్కను తొలగించే అన్ని చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది*
*అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారితో మాట్లాడుతూ గతంలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి గుర్రపు డెక్కను తొలగించుటకు అన్నీ చర్యలు చేపట్టే వారుఅని, కానీ సెప్టెంబర్ మాసం నుండి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కనుమరుగ అయిందని, చెరువుల వైపు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కనీసం రావట్లేదని గతంలో యాంటీ లార్వా ప్రోగ్రాంను ఏర్పాటు చేసేవారని గుర్రపు డెక్కని ప్రతి మూడు నెలలకు ఒకసారి తొలగించేవారని ఇవన్నీ గత ఆరు నెలల నుండి జరగడంలేదని*, *విపరీతమైన దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారని సాయంత్రం 5 దాటితే ప్రజలు వీధుల్లో నిలబడే పరిస్థితి లేదని ,వెంటనే గుర్రపు డెక్క తొలగించుటకు అన్నీ చర్యలు చేపట్టి ప్రజలకు దోమల నుండి ఉపశమనం కల్పించాలని కోరారు*. *జోనల్ కమిషనర్ గారు మాట్లాడుతూ వీలైనంత త్వరలో గుర్రపు డెక్కన్ తొలగించి అన్ని చర్యలు చేపడతానని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది*.
*కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండలరెడ్డి, కోకొండ జగన్, ముద్ధం శ్రీనివాస్ యాదవ్, బాలకృష్ణ గౌడ్ ,ఎండి షఫీ, ఎండి హనీఫ్, శ్యాం, బాలు, సకినాల చందు మొదలగువారు పాల్గొన్నారు*
No comments:
Post a Comment