ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతాపూర్ డివిజన్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేశారు.
రామంతాపూర్ డివిజన్‌లో లక్ష జనాభా పైగా నివసిస్తుండగా, ప్రస్తుతం ఈ ప్రాంతం ఉప్పల్ పోలీస్ స్టేషన్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో విభజించబడి ఉండటంతో పోలీసు పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే గారు లేఖలో వివరించారు.
విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, జనసాంద్రత అధికంగా ఉండటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రత కోసం రామంతాపూర్ డివిజన్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ అత్యవసరమని పేర్కొన్నారు.
కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో చట్ట అమలు మరింత పటిష్టమై, నేర నియంత్రణ, పర్యవేక్షణ మెరుగుపడి ప్రజలకు భద్రతా భావం పెరుగుతుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తెలిపారు. ఈ అంశంలో పూర్తి సహకారం అందిస్తామని డీజీపీకి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment