Saturday, January 10, 2026

ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి గారు

ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి గారు

జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. 

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ రూపొందించిన ప్రెస్ క్లబ్ జర్నల్ ను మంత్రి పొంగులేటి గారు సచివాలయంలో శనివారం ఆవిష్కరించారు. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రతినెల ప్రెస్ క్లబ్ జర్నలను రూపొందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ జర్నల్లో జర్నలిస్టులకు సంబంధించిన సమకాలిన అంశాలు పొందుపరచడం సంతోషకరమని చెప్పారు. 

ప్రెస్ క్లబ్ నూతన పాలకమండలి ఏర్పడి మూడు నెలలు అయినప్పటికీ జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను రూపొందించామని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్ విజయకుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల మంత్రికి వివరించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రికి వివరించారు. 

జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ జర్నల్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రెస్ క్ల బ్ ఉపాధ్యక్షులు ఏ. రాజేష్ గారు, అరుణ అత్తలూరి గారు, జాయింట్ సెక్రెటరీ చిలుకూరి హరిప్రసాద్ గారు, కోశాధికారి రమేష్ వైట్ల గారు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు శంకర్ శీగ గారు, ఎన్. ఉమాదేవి గారు, రచన ముడుంబై గారు, వనం నాగరాజు గారు, అమిత్ బట్టు గారు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment