Sunday, January 18, 2026

*_బోల్తా పడిన గిల్ట్ ఆఫ్ ఇండియా(EGI)_*

*_బోల్తా పడిన గిల్ట్ ఆఫ్ ఇండియా(EGI)_*
_# ట్రాప్ లో పడటానికి ఎవడైనా ఒకటే.!_
_# పడేసిటోడి తెలివితేటలే ముఖ్యం_ 

ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(EGI)

ఎన్టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఎలాంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదు.. దీనిపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసిన వెంటనే జర్నలిస్టులపై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు

అర్ధరాత్రి ఇంటిపై దాడులు చేసి జర్నలిస్టులను అరెస్ట్ చేసి, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు లాకప్‌లో ఉంచారు

అపకీర్తి జరిగిందని భావించిన గుర్తుతెలియని మహిళా అధికారిణి కాకుండా, తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు

ఈ ఘటనలో ఎన్టీవీ జర్నలిస్టులపై తొందర తొందరగా చర్యలు తీసుకొని, మీడియాను అపకీర్తి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం

అరెస్టులు చేసే కంటే ముందుగా, పోలీసులు న్యాయ ప్రక్రియను అనుసరించి, సమగ్ర దర్యాప్తు జరపాల్సింది

తెలంగాణలో మీడియా స్వేచ్ఛగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేసేలా ప్రభుత్వం చూడాలి

అలాగే మీడియాతో వ్యవహరించేటప్పుడు న్యాయ ప్రక్రియను పాటించి, సంయమనం వహించాలని అధికారులను కోరుతున్నాం – ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా

No comments:

Post a Comment