Saturday, January 10, 2026

*_బోల్తా కొడుతున్న రేవంత్ సర్కార్_*

*_బోల్తా కొడుతున్న రేవంత్ సర్కార్_*

_# కాంగ్రెస్ పార్టీని అణగదొక్కిన జర్నలిస్ట్ సంఘాలకే రెడ్ కార్పెట్_ 
_# తెలంగాణలో జర్నలిస్టు సంఘాలు చాలా ఉన్న పిలిచింది మూడు సంఘాలు ఎందుకో.?_*
_# గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంఘాలని నమ్ముకొని ప్రభుత్వాన్ని కోల్పోయింది.. తాజాగా రేవంత్ సర్కార్ అదే దారిలో .._*

_# మీ ఎవరికీ బానిసలం కాదు. గులాంగిరీ చేయమని చెపుతున్న తెలంగాణా రాష్ట్ర జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (టి.ఎస్.జేఏసీ)

_# అన్ని సంఘాలని పిలవాలన్న అవగాహనాలేని ఐ & పి.ఆర్ శాఖ_

*_గత ప్రభుత్వంలో అక్కడేషన్ కార్డు జారీలో భారీగా అవకతవకలు జరగడానికి అప్పటి ప్రభుత్వానికి ('సంకలు నాకారు అంటే బాగుండదు' అని) ఊడిగం చేసిన జర్నలిస్టు సంఘాలే అన్న విషయం అందరికీ తెలుసు..!అధికారం ఎక్కడుంటే అక్కడనే ఆ సంఘాలు తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళ స్వలాభం కోసం పాటుపడడం గత 3 దశాబ్దాలుగా సర్వసాధారణాంగా జరుగుతున్న ప్రక్రియ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అక్రిడేషన్ కార్డుల వ్యవహారం నడుస్తున్న సమయంలో ప్రభుత్వం *_జేఏసీగా ఉన్న అన్ని సంఘాలను పిలవకుండా_* కేవలం మూడు సంఘాలను పిలిచి మాట్లాడడంపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘాలని ఏ ప్రతిపాదికన సమాచార శాఖ పిలిచిందో వాళ్లకే తెలియాలి. ప్రభుత్వానికి తొత్తుగా ఉన్నందుకు పిలిచారా..? లేక గత ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు పిలిచారా.? సభ్యులు ఎక్కువగా ఉన్నారని పిలిచారా.? లేక 'ఊసరవెల్లి'లా రంగులు మార్చే యూనియన్లు ఉన్నాయని పిలిచారా.? మరి సమాచార శాఖకి తెలియాలి. గత కెసిఆర్ ప్రభుత్వ వ్యతిరేకాలను ఎండగట్టి జైలు పాలైన అనేకమంది జర్నలిస్టులను యూనియన్లను పక్కన పెట్టేసి 'అప్పుడు జోల పాట పాడిన యూనియన్ల'ను రేవంత్ సర్కార్ దగ్గర తీయడం ఏమిటో.?

*_నియంతను ఎదిరించి జైళ్ళకు వెళ్ళిన జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి.?_*

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే... గత ప్రభుత్వం హయంలో జైలుకు వెళ్లిన పాత్రికేయులకు ఏదో ఒరుగుతుందని అందరూ భావించారు. అది జరగలేదు సరి కదా.! నియంత పాలనలో గుడ్డలు ఉతికిన వారికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. తప్పులు సరిదిద్దుకో రేవంత్ రెడ్డి సార్.

*_ప్రెస్ అకాడమీ చైర్మన్ పూర్తిగా విఫలం_* 
ఇదో పెద్ద దౌర్భాగ్యం. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటినుండి నేటి వరకు ఆయన జర్నలిస్టులకు చేసింది పూర్తిగా శూన్యం. మంచి చేయడం దేవుడెరుగు.! చెడు చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన పార్టీ పత్రిక కోసం ఎంతకైనా దిగజారుతాడు‌. కొన్ని యూనియన్లనే ఆయన దత్తత తీసుకున్నట్టుగా వాటిని అన్నిటికీ ముందుకు పెట్టడం విడ్డూరంగా మారింది. గత కెసిఆర్ ప్రభుత్వంలో ఆ యూనియన్లను వ్యతిరేకించిన శ్రీనివాస్ రెడ్డి ఈరోజు వాటిని సంకలు పెట్టుకొని తిరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కనీస జర్నలిస్టు విలువలు కూడా తెలియని ఈయన ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉండడం తెలంగాణ జర్నలిస్టుల దౌర్భాగ్యంగానే చెప్పుకోవచ్చు.! ఒక్క జీవోని కూడా సక్రమంగా రిలీజ్ చేయించలేని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉండి కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఇక జర్నలిస్టుల సాధకబాధలు కష్టాలు ఆయనకు పట్టే ఆయన సంబంధించిన పత్రికలకు ఎన్ పానెల్ చేసుకోవడం స్వలాభం కోసం యాడ్స్ వేయించుకోవడం తప్ప చిన్న పత్రికల బాగుకోసం ఒక్కరోజు కూడా ఆయన పాటుపడ్డ దాఖలాలు లేవు. ఇలాంటి అనర్హుడిని ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నిలబెట్టిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

ఇట్లు 
✍🏻
*_(బైస సంగీత),_* 
*_(మమత)_*
_(తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వినర్)_

Media News Links ⬇️
https://www.facebook.com/share/1FxxVpzo5F/
                 *****
https://www.instagram.com/reel/DTVGSk7EmkL/?igsh=eXg0NWRrN210aWk4
             *****
https://x.com/Praja_Snklpm/status/2009961476468158868?t=TRFmbFJtdvoOCHNU4sIbkw&s=19

No comments:

Post a Comment