Wednesday, January 31, 2024

ఎంపీ... 'ఇజ్జత్‌' తీసుకున్నావు కదరా.!

ఎంపీ... 'ఇజ్జత్‌' తీసుకున్నావు కదరా.!
● బీఆర్‌ఎస్‌ ఎంపీ పార్థసారథి వేలకోట్ల నిర్వాకం
● 'సాయిసింధు ఫౌండేషన్‌' మాటున ఘరానా దోపిడీ 
● హైకోర్టు వద్దన్నా రూ.4 వేల కోట్ల విలువైన భూమి ధారాదత్తం
● ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున..
● రూ.30 లక్షలకే లీజుకు కట్టబెట్టిన గత ప్రభుత్వం
● గత సర్కారు రహస్య జీఓలతో దొంగలాట 

Courtesy / Source by :
(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు మీ, 9440000009)

ఐటీ కారిడార్‌లో అత్యంత ఖరీదైన స్థలం అది..! హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 15 ఎకరాల భూమిని గత సర్కారు తమ ఎంపీకి కారు నిసిగ్గుగా, నిర్లజ్జగా, నిస్సంకోచంగా.. చౌకగా కట్టబెట్టింది. రూ.4 వేల కోట్ల విలువైన భూమిని.. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు ఎన్నికలకు ముందు గోప్యంగా చీకట్లో జారీ చేసిన జీఓ ద్వారా ఈ భూమిని ధారాదత్తం చేసింది.

ఇదేం దిగజారుడు..:
ఈ వ్యవహారంలో గత సర్కారు ఎంతలా దిగజారిందంటే.. హైకోర్టు జీఓను కొట్టివేసినా.. లీజు కేటాయింపులను రద్దు చేస్తూ.. పునఃపరిశీలించాలని ఆదేశించినా పెడచెవిన పెట్టింది. పైగా.. లీజు నిబంధనలకు సంబంధించిన జీఓలకు సవరణలు చేసి, కొత్త జీఓ ద్వారా మళ్లీ పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సంస్థకు భూములను 'వాళ్ళమ్మ మొగుడు'దని కట్టబెట్టింది.

అసలేం జరిగింది..?:
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. బీఆర్‌ఎస్‌ (అప్పట్లో టీఆర్‌ఎస్‌) అధికార పగ్గాలు చేపట్టిన మూణ్నెల్లకే.. అంటే 2014 సెప్టెంబరులో హెటిరో డ్రగ్స్‌ కంపెనీ ఎండీ పార్థసారథి రెడ్డి ఎవరికీ అనుమానం రాకుండా 'సాయిసింధు ఫౌండేషన్‌' పేరుతో ఒక చారిటబుల్‌ ట్రస్ట్‌ను నెలకొల్పారు. ఆ ట్రస్టు పేరుతో తాము క్యాన్సర్‌ జనరల్‌ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ప్రభుత్వానికి విన్నవించారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని హైటెక్స్‌ వెళ్లే మార్గంలోని 'ఇజ్జత్‌ నగర్‌'లో 15.48 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు. 1989లో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి లీజుకు ఇచ్చిన తరహాలోనే.. ఏడాదికి రూ.50 వేల చొప్పున చెల్లించేలా భూమిని కేటాయించాలని కోరారు. అందుకు ప్రతిగా.. తమ ఆస్పత్రిలో కూడా 25% మంది ఇన్‌ పేషెంట్లు, 40% మంది ఔట్‌ పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రతిపాదించారు.

వేలం వేయకుండా...:
అప్పటికే పార్థసారధిరెడ్డి ట్రస్టు అడిగిన స్థలాన్ని వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వనరుల సంస్థ(టీఎస్‌ఐఐసీ) నిర్ణయించింది. దీంతో.. 'ఇజ్జత్‌'నగర్‌కు బదులుగా.. ఆ పక్కనే ఉన్న ఖానామెట్‌లో స్థలం కేటాయించాలని బీఆర్‌ఎస్‌ సర్కారు నిర్ణయించింది.

అత్యున్నత ప్రాధాన్యత' పేరుతో..:
ఖానామెట్‌ సర్వేనంబరు 41/14/2లో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏకు 'అత్యున్నత ప్రాధాన్యత' కింద ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అప్పట్లో శేరిలింగంపల్లి తహసీల్దార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆ భూమి విలువైనదని.. మార్కెట్‌ ధర ప్రకారం ఎకరాకు రూ.33.7 కోట్ల చొప్పున రూ.505.5 కోట్ల విలువ ఉంటుందని పేర్కొంటూ ప్రభుత్వానికి 'నోట్‌' పంపించారు. అప్పటి రాజేంద్రనగర్‌ ఆర్డీఓ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మమ్మల్నేం చేస్తారు...?
('ఆకులు పీకలేరు' అని రాస్తే బాగుండదని..):
నాటి కేసీఆర్‌ సర్కారు వెనక్కి తగ్గలేదు. సాయిసింధు ఫౌండేషన్‌ ట్రస్టుకు ఆ భూముల లీజులకు సంబంధించిన ఉత్తర్వు జీఓ 571 ప్రకారం కేటాయించాలని నిర్ణయించింది. ఆ ఉత్తర్వును 2015లో సవరిస్తూ.. జీఓ 218ను విడుదల చేసింది. ఆ సవరణల్లో సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు భూమిని లీజుకు ఇస్తే.. సంబంధిత భూమి విలువలో 10శాతాన్ని ఏడాది లీజుగా చెల్లించాలనే విషయాన్ని చేర్చింది. అంటే.. ప్రభుత్వ భూమి విలువ రూ.505.5 కోట్లు కాగా.. అందులో 10%.. అంటే.. రూ.50కోట్ల చొప్పున లీజును చెల్లించాలి. 60 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా.. ఐదేళ్లకోసారి లీజు విలువను 10% చొప్పున పెంచుతూ వెళ్లాలని స్పష్టం చేసింది. 

ఆ జీఓను కూడా ప్రభుత్వం తుంగలోకి తొక్కుతూ..:
ఏడాదికి ఎకరాకు రూ.1.47 లక్షల చొప్పున చెల్లించేలా పార్థసారథిరెడ్డి ట్రస్టుకు లీజుకు ఆ భూమిని కట్టబెడుతూ 2018 మార్చి 22న జీఓ 59ని విడుదల చేసింది.

హైకోర్టు ఆదేశాలా..మాకేం లెక్క..:
జీఓ 59 ప్రకారం సాయిసింధు ఫౌండేషన్‌ ట్రస్టుకు భూకేటాయింపుపై 2018లోనే డాక్టర్‌ ఊర్మిళ పింగ్లే, మరొకరు హైకోర్టులో సవాలు చేశారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న హైకోర్టు.. చవక లీజుపై ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. 2023 జూన్‌ 5న తుదితీర్పునిస్తూ.. జీఓ 59ని రద్దు చేసింది. భూకేటాయింపు పాలసీకి సంబంధించిన జీఓ 218ను పునఃసమీక్షించి, నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘‘ప్రజల ఆస్తులకు, వనరులకు ప్రభుత్వాలు ట్రస్టీగానే వ్యవహరించాలి. ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేప్పుడు.. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి’’ అంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు.

జీఓల మాటున కుమ్మేయటమే..!:
పార్థసారథిరెడ్డి ట్రస్టుకు లీజును కట్టబెట్టేందుకే మొగ్గుచూపింది. మరోమారు లీజు నిబంధనలను సవరించింది. ఆ మేరకు 2023 ఆగస్టు 11న జీఓ 99 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో.. ‘‘సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు భూములను తక్కువ ధరకు ఇచ్చే విచక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది’’ అనే పదాన్ని చేర్చింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే.. అంటే.. 2023 సెప్టెంబరు 25న జీఓ 140 ద్వారా సాయిసింధు ఫౌండేషన్‌కు విలువైన భూమిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఏడాదికి రూ.50 కోట్ల మేర లీజు చెల్లించాలని, ప్రతి ఐదేళ్లకోసారి లీజుమొత్తాన్ని 10% మేర పెంచాలని సర్కారు జారీ చేసిన నిబంధనలు చెబుతున్నా.. ‘విచక్షణ అధికారం’ పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు ఏడాదికి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున.. 15.4 ఎకరాలకు రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇస్తున్నట్లు జీఓ140లో స్పష్టం చేసింది. గతంలో ఈ వ్యవహారం రచ్చగా మారి, హైకోర్టుదాకా వెళ్లడంతో కాస్త జాగ్రత్తపడ్డ బీఆర్‌ఎస్‌ సర్కారు.. ఈ జీవోను గోప్యంగా పెట్టడం గమనార్హం..! నిజానికి ఆ భూముల విలువ 2023 కల్లా ఎనిమిదింతలు పెరిగాయి. ఖానామెట్‌లో ఎకరా మార్కెట్‌ విలువ రూ.300 కోట్ల దాకా ఉంది. ఈ లెక్కన రూ.4 వేల కోట్ల విలువైన భూములను ఏడాదికి రూ.30 లక్షలు చెల్లించేలా.. 60 ఏళ్లకు బీఆర్‌ఎస్‌ సర్కారు పార్థసారధిరెడ్డి ట్రస్టుకు ధారాదత్తం చేసింది.

చివరిగా...:
ఏదో ఒకరోజున చావటం ఖాయం. పాడెక్కటం ఖాయం.  అప్పుడు ఒక్క రూపాయి కూడా వెంటరాదని తెలిసినా... ఏందిరా మీ బతుకులు.. చెడ.!

హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి

Hyderabad: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి

హైదరాబాద్ సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kotha Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీచేశారు..

ఒకేసారి 85 మంది సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇందులో హోంగార్డ్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు అందరూ ఉన్నారు. వారిని ఏఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి. బదిలీలతో పంజాగుట్ట పీఎస్ ఖాళీ అవడంతో..ఇతర స్టేషన్‌ల నుంచి 82 మంది కొత్త సిబ్బందిని నియమించారు..

పంజాగుట్ట పోలీసులపై ముందు నుంచీ పలు ఆరోపణలున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలను గత ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పోలీస్ స్టేషన్ నుంచి పలు కీలక విషయాలు బయటకు పొక్కడంపై హైదరాబాద్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

Telangana Government Calendar Released

Hon'ble Chief Minister Sri @Revanth_Anumula released the #Telangana Government Calendar at Dr. B. R. Ambedkar Telangana State Secretariat today. Minister for Roads & Buildings Sri @KomatireddyKVR, @TelanganaCS Smt. Santhi Kumari, Principal Secretary Home Sri Jitender, Commissioner Printing & Stationary Sri Anjani Kumar were present on this occasion.

https://twitter.com/TelanganaCMO/status/1752327853364986123?t=Xl5gl8e__mbPSqWCUjqu4w&s=19


Monday, January 29, 2024

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెస్ ఛార్జీలు, పెండింగ్ స్కాలర్ షిప్స్,ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి.. SFI

ప్రచురణార్ధం/ప్రసారర్ధం:
తేదీ: 29-01-2024,
*మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా*

విషయం:-  *రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెస్ ఛార్జీలు, పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్, విడుదల చేయాలని, విద్య రంగా సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ మందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది*

*మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు*

ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.కార్తీక్, రాథోడ్ సంతోష్  మాట్లాడుతూ......*
తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం కాలంగా వసతి గృహాలు, గురుకులాలు, కెజిబివిలు ,ఆశ్రమ పాఠశాలు, కళాశాల హాస్టల్స్ సంబంధించిన మెస్ బిల్లులు సమారు 6,300 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని  విడుదల చేయలేదు హెచ్చరించారు.గత ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో  విడుదల చేయాలని కోరిన ఫలితం లేకుండా పోయింది. అలాగే గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు కూడా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. వార్డెన్లు అప్పులు తీసుకుని వచ్చి హస్టల్స్ నడుపుతున్నారు. దీనివల్ల పేద విద్యార్థులు చదువుకుంటున్న వసతిగృహాలకు నాణ్యమైన భోజనం, వసతి కల్పించకపోవడం సిగ్గుచేటు అన్నారు. అలాగే గత ఆరు సంవత్సరాల నుండి రాష్ట్రంలో 7800కోట్ల స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల కాకపోవడం వల్ల పేద బడుగు బలహీన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక సార్లు ఉద్యమాలు చేసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 14 లక్షల మంది విద్యార్థులు తమ ఫీజులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. చేశారు.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతామని గత ప్రభుత్వం అనేక సార్లు హామీ ఇచ్చి విద్యార్థులను మోసం చేసింది.ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వసతి కళాశాలలో కల్పించాలని కోరుతున్నాము. మేడ్చల్ జిల్లాలో కొన్ని మండలాల్లో స్విఫ్ట్ వైస్ గా నడుస్తున్న జూనియర్, డిగ్రీ కళాశాలలను  రెగ్యులర్గా నడిపేటట్టు చూడాలి. జూనియర్ కళాశాల లేని మండలాలకు నూతన జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలి. మేడ్చల్ నియోజవర్గాల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత బిల్డింగ్ లేకుండానే మూడు రూములలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపడం సిగ్గుచేటు అన్నారు.వెంటనే సొంత భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో గుర్తింపు లేకుండా నడుపుతున్న ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లని ప్రవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ గుర్తింపు లేకుండా కూడా చలామణి అవుతున్నాయి. ఈ సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ పూర్తికాకముందే ఇంటర్మీడియట్ ప్రవేట్, కార్పొరేట్ విద్యా సంస్థ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మా కళాశాలలో అడ్మిషన్ తీసుకోండి అని ఒత్తడీలు పెడుతున్నారు. అలాంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా ము. మేడ్చల్ జిల్లాలో ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ టీచర్స్ వర్కర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్య రంగ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాన్ని రూప పొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.
 ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సుమంత్, వంశీ, మనీకండు,జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్, జిల్లా కమిటీ సభ్యులు శ్యామ్ రావు, కార్తీక్,అవినాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అనుదీప్, శివసాయి,మనీష్,అజయ్,గిరిధర్,రాకేష్, భూపతి తదితరులు పాల్గొన్నారు.

ధన్యవాదములతో....

రాథోడ్ సంతోష్
ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి
9618604620

Saturday, January 27, 2024

_జనం 'ఛీ' కొట్టి నా..:_

*_ఒక్క ట్వీట్‌లోనే బోలెడంత ఫ్రస్ట్రేషన్..!_*
_* కేటీయార్ పూనకాలు లోడింగ్.!_
_* మదిలో 11 ఎకరాల తన్నలాట_
_* కేటీఆర్‌కు ఎందుకంత ఉరుకులాట..?_
_* నేతలపై కేసులు.!_

*_(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_*

కేటీయార్ చేసిన ఒక ట్వీట్‌లో ఎన్నో భావాలు. అసలు ఒక ట్వీట్‌లో ఇన్నిరకాల ఉద్వేగాల్ని ప్రదర్శించవచ్చునని సకల నెటిజనం హాశ్చర్యపోయే ట్వీట్ ఇది. కేటీయార్ నిజంగా గ్రేట్.!

*_జనం 'ఛీ' కొట్టి నా..:_*
ఎంత ఖర్చుపెట్టినా, ఎంత మభ్యపెట్టినా జనం 'ఛీ' కొట్టి ఒకవైపు అధికారం పోయిన మంట. జైలులో వేసినా, ఎంత తొక్కాలని చూసినా అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దృశ్యం పదే పదే మదిలో మెదులుతూ ఒకటే 'దుగ్ధ'. తరుముకొస్తున్న కాళేశ్వరం విజిలెన్స్ కేసుతో ఎక్కడ బండారాలన్నీ బట్టబయలవుతాయోనని ఒకవైపు భయం. 500 కోట్ల రెరా బాలకృష్ణుడు ఏం బయట పెడతాడోనని మరోవైపు సందేహం. ధరణి పాపాలన్నీ పుట్ట పగిలినట్టు పగులుతాయేమోనని ఇంకోవైపు ఆందోళన.

*_ఆయనేం బయటపెడతాడో..?_*
నిరుద్యోగుల ఆశల్ని కూల్చిన టీఎస్పీఎస్సీ ఘోరాల చిట్టా తెర మీదకు వచ్చి ఆ మాజీ ఐపీఎస్ మహేందర్‌రెడ్డి ఎవరిని ఫిక్స్ చేస్తాడోనని ఇదో ఫ్రస్ట్రేషన్. ఇంటర్ బోర్డులో 'గ్లోబరినా అరాచకాలు, కాలిపోయిన విద్యార్థుల బతుకుల కారకులు బయటపడితే ఎలా..?' అనే ప్రశ్నార్థకం.? స్మితలు, అరవిందులు సరెండర్ అయిపోతే ఇంకేం బాగోతాలు రట్టవుతాయేమోనని అసహనం.!

*_రూ.1000 కోట్ల విలువైన 11 ఎకరాల పంచాయితీ_*
నామమాత్రపు ధరకు 1000 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిపై కోర్టులో విచారణపైనే కాదు. ఇరువైపులా బీజేపీ, కాంగ్రెస్ కొరడాలు పట్టుకుని తరుముతుంటే ఇక పార్టీ భవిష్యత్తు ఏమిటనే అనిశ్చితి.! సందిగ్ధత..! ఇలా చెబుతూ పోతే... ఎన్నో, ఎన్నెన్నో.! అన్నింటికీ ఈ రేవంతుడే కారణం అన్నట్టుగా.. సహించలేక, ఆగలేక, భరించలేక వ్యక్తిగత దాడి. అక్షరాలా ఇది పూర్ ట్వీట్. చీప్ టేస్ట్..!

*_వేపమండల ట్విట్లు_*
'కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలా మాను వినురా సుమతీ' అనే పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని ఓ ట్వీట్ చేశాడు కేటీయార్. పేరు పెట్టకపోయినా అది రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తుందనేది అందరికీ తెలుసు. దావోస్‌లో రేవంత్ భాషను వెక్కిరిస్తారు. తన ఆహార్యాన్ని వెక్కిరిస్తారు. రేవంత్ ప్రతి అడుగునూ లక్ష్యం చేసుకుంటారు. రెండు నెలలకే ఎందుకింత శివాలు, పూనకాలు, ఊగిపోవడాలు.. ఈ ట్వీట్ల వేపమండలు..

*_అహంకారం కాదు.. వినయం ఉండాలి:_*
పేపర్ల లీకేజీలతో నిరుద్యోగుల కొంపలు కాలిస్తే, మహిళా గవర్నర్‌ను నానారకాలుగా అవమానిస్తే..! అదే గవర్నర్ ఎమ్మెల్సీల భర్తీ ఫైల్ కూడా తిప్పికొడితే..! ఇదే రేవంత్ వెళ్లి సింపుల్‌గా టీఎస్పీఎస్సీ, ఎమ్మెల్సీల ఫైళ్లను క్లియర్ చేయించుకోవడం చూస్తుంటేనే కేటీఆర్‌కు మండిపోతున్నట్టుంది. '420 హామీలు' అని ఎంత వెక్కిరించినా, పోయేముందు ఏడు లక్షల అప్పులతో చిప్ప చేతికిచ్చినా ఒక్కొక్క హామీని అమలు చేస్తుంటే ఎక్కడో మండుతూ.. మాడిపోతున్నట్టుంది. కదా..! కేటీఆర్

*_ఆ మాడు వాసనే..:_*
కాలుతున్న ఆ వాసనే ఇప్పుడు ట్వీట్లలో వ్యాపిస్తోంది. అంత ఫ్రస్ట్రేషన్ అవసరమా..?

*_కేటీఆర్‌కు ఎందుకంత ఉరుకులాట..?_*
త్వరలో మన ప్రభుత్వం వస్తుందంటూ ఈ ప్రభుత్వాన్ని కూల్చేసే కొత్త కుట్రల సంకేతాల్ని జనంలోకి వదలడం అవసరమా..? కాంగ్రెస్ ప్రజావ్యతిరేకంగా పరిపాలిస్తే ఇదే జనం తమ తీర్పు చెబుతారుగా రాబోయే ఎన్నికల్లో… కేటీఆర్‌కు ఎందుకంత ఉరుకులాట..? పోనీ, ఇదే కాంగ్రెస్ ఇదే ట్వీట్‌కు ఇలా కౌంటర్ చేస్తే..?

*_‘‘అవును, కేటీయార్, నువ్వు చెప్పింది అక్షరసత్యం… తెలంగాణ రాగానే కనకపు సింహాసనమున ప్రజలు కుర్చీలో కూర్చోబెట్టారు, కానీ వెనుకటి గుణం మానలేదు..! ప్రజలు మొన్న ఛీకొట్టి తరిమినా సరే అదే వెనుకటి గుణం..’’ అని తిప్పికొడితే..?_* అసలే రేవంత్ కొంత డిఫరెంట్.. మెత్తమెత్తటి జానారెడ్డి కాదు..! ఈంట్‌కా జవాబ్ పత్తర్‌సే దేనేవాలా..! సో, కాస్త ఆగండి బ్రదర్… రేవంత్ మార్క్ తవ్వకాలు ఇంకా జన్వాడ గెస్ట్ హౌజ్ దాకా రానేలేదు కదా..!!

*_వీళ్లే కదా..!:_*
మోడీని ఎడాపెడా తిడుతూ.. ఇప్పుడు ముఖ్యమంత్రిని తిడుతూ.. గవర్నర్‌ను అవమానిస్తూ.. గతంలో కేసీయార్ మీద పల్లెత్తు మాట మాట్లాడితే మాత్రం, ఒక ముఖ్యమంత్రిని 'అన్నేసి మాటలనొచ్చా' అని సన్నాయి నొక్కులు నొక్కింది…!! హలో సారూ… రేవంత్ శునకం అంటున్నావు సరే, జనం కోరినట్టే కాపలా కుక్కలా ఉంటానన్నది ఎవరు..? ఆ కుక్క ఎవరు.? పేరేంటి.?

https://telanganawatch.in/article.php?data=a-lot-of-frustration-in-one-tweet

Friday, January 26, 2024

*పురస్కారం అందుకున్న గంటలోనే... హఠాన్మరణం*

*పురస్కారం అందుకున్న గంటలోనే... హఠాన్మరణం*

*గుండెపోటుతో ఆదిలాబాద్‌ బల్దియా మేనేజరు దివాకర్‌ మృతి*

ఆదిలాబాద్‌ : పురస్కారం అందుకున్న ఆనందంలో ఉండగానే ఆయన ఆయువు తీరింది. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూరు పట్టణానికి చెందిన దివాకర్‌(56) ఆదిలాబాద్‌ బల్దియాలో మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు.ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటికి వెళ్లాక గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టినప్పటి నుంచే వైకల్యం కారణంగా వీల్‌ఛైర్‌కే పరిమితమైన ఆయనకు 2004లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పదేళ్లకు పైగా ఆదిలాబాద్‌ బల్దియాలోనే విధులు నిర్వహించడంతో అక్కడే స్థిరపడ్డారు. భార్య నాగలక్ష్మి, కుమారులు సాయి (సాప్ట్‌వేర్‌), గిరిధర్‌ (ఆర్మీ ఉద్యోగి). పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌, కమిషనర్‌ ఎ.శైలజ, బల్దియా అధికారులు, సిబ్బంది భౌతిక కాయానికి నివాళులర్పించారు.

*V.S. జీవన్*

Thursday, January 25, 2024

TSPSC చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.... గవర్నర్ ఆమోదం

*TSPSC చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.... గవర్నర్ ఆమోదం*

హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం నిర్ణయం తీసుకున్నారు.అలాగే టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా రిటైరర్డ్‌ ఐఏఎస్‌ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్‌ ఉల్లా ఖాన్‌, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పోస్టింగ్‌ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్‌ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్‌ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు.ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపురంలో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్‌ పోలీస్‌ సర్వీస్‌ అధికారి. ఏఎప్పీగా మొదలైన ఆయన కెరీర్‌ డీజీపీగా పదవీ విరమణ పొందారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ తర్వాత 2017 నవంబర్‌ 12న ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితుడయ్యారు. 2018 ఏప్రిల్‌10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్‌లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. మూడేళ్లకు పైగా తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందుకే 2020లో ఏప్రిల్‌ 8న దేశంలోని టాప్‌ 25 ఐపీఎస్‌ అధికారులతో జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. 

మహేందర్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైనా.. ఈ ఏడాది డిసెంబర్‌ వరకే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే.. కమిషన్‌ నిబంధనల ప్రకారం.. 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

*V.S. జీవన్*