Monday, January 29, 2024

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెస్ ఛార్జీలు, పెండింగ్ స్కాలర్ షిప్స్,ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి.. SFI

ప్రచురణార్ధం/ప్రసారర్ధం:
తేదీ: 29-01-2024,
*మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా*

విషయం:-  *రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెస్ ఛార్జీలు, పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్, విడుదల చేయాలని, విద్య రంగా సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ మందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది*

*మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు*

ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.కార్తీక్, రాథోడ్ సంతోష్  మాట్లాడుతూ......*
తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం కాలంగా వసతి గృహాలు, గురుకులాలు, కెజిబివిలు ,ఆశ్రమ పాఠశాలు, కళాశాల హాస్టల్స్ సంబంధించిన మెస్ బిల్లులు సమారు 6,300 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని  విడుదల చేయలేదు హెచ్చరించారు.గత ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో  విడుదల చేయాలని కోరిన ఫలితం లేకుండా పోయింది. అలాగే గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు కూడా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. వార్డెన్లు అప్పులు తీసుకుని వచ్చి హస్టల్స్ నడుపుతున్నారు. దీనివల్ల పేద విద్యార్థులు చదువుకుంటున్న వసతిగృహాలకు నాణ్యమైన భోజనం, వసతి కల్పించకపోవడం సిగ్గుచేటు అన్నారు. అలాగే గత ఆరు సంవత్సరాల నుండి రాష్ట్రంలో 7800కోట్ల స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల కాకపోవడం వల్ల పేద బడుగు బలహీన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక సార్లు ఉద్యమాలు చేసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 14 లక్షల మంది విద్యార్థులు తమ ఫీజులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. చేశారు.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతామని గత ప్రభుత్వం అనేక సార్లు హామీ ఇచ్చి విద్యార్థులను మోసం చేసింది.ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వసతి కళాశాలలో కల్పించాలని కోరుతున్నాము. మేడ్చల్ జిల్లాలో కొన్ని మండలాల్లో స్విఫ్ట్ వైస్ గా నడుస్తున్న జూనియర్, డిగ్రీ కళాశాలలను  రెగ్యులర్గా నడిపేటట్టు చూడాలి. జూనియర్ కళాశాల లేని మండలాలకు నూతన జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలి. మేడ్చల్ నియోజవర్గాల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత బిల్డింగ్ లేకుండానే మూడు రూములలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపడం సిగ్గుచేటు అన్నారు.వెంటనే సొంత భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో గుర్తింపు లేకుండా నడుపుతున్న ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లని ప్రవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ గుర్తింపు లేకుండా కూడా చలామణి అవుతున్నాయి. ఈ సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ పూర్తికాకముందే ఇంటర్మీడియట్ ప్రవేట్, కార్పొరేట్ విద్యా సంస్థ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మా కళాశాలలో అడ్మిషన్ తీసుకోండి అని ఒత్తడీలు పెడుతున్నారు. అలాంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా ము. మేడ్చల్ జిల్లాలో ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ టీచర్స్ వర్కర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్య రంగ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాన్ని రూప పొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.
 ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సుమంత్, వంశీ, మనీకండు,జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్, జిల్లా కమిటీ సభ్యులు శ్యామ్ రావు, కార్తీక్,అవినాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అనుదీప్, శివసాయి,మనీష్,అజయ్,గిరిధర్,రాకేష్, భూపతి తదితరులు పాల్గొన్నారు.

ధన్యవాదములతో....

రాథోడ్ సంతోష్
ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి
9618604620

No comments:

Post a Comment