Wednesday, January 31, 2024

హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి

Hyderabad: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి

హైదరాబాద్ సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kotha Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీచేశారు..

ఒకేసారి 85 మంది సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇందులో హోంగార్డ్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు అందరూ ఉన్నారు. వారిని ఏఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి. బదిలీలతో పంజాగుట్ట పీఎస్ ఖాళీ అవడంతో..ఇతర స్టేషన్‌ల నుంచి 82 మంది కొత్త సిబ్బందిని నియమించారు..

పంజాగుట్ట పోలీసులపై ముందు నుంచీ పలు ఆరోపణలున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలను గత ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పోలీస్ స్టేషన్ నుంచి పలు కీలక విషయాలు బయటకు పొక్కడంపై హైదరాబాద్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

No comments:

Post a Comment