https://www.dishadaily.com/telangana/kcr-good-bye-to-cm-post-132834
Saturday, June 11, 2022
సీఎం పదవికి కేసీఆర్ గుడ్ బై?
https://www.dishadaily.com/telangana/kcr-good-bye-to-cm-post-132834
Friday, June 10, 2022
KTR ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు.....!
*KTR ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు.....!*
*బండి సంజయ్‌ను ఆదేశించిన రెండో అదనపు న్యాయస్థానం*
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ను సిటీ సివిల్‌కోర్టు రెండో అదనపు న్యాయస్థానం చీఫ్ జడ్జి ప్రభాకర్‌రావు శుక్రవారం ఆదేశించారు.కేటీఆర్‌ను కించపరిచేలా ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో, పబ్లిక్ లేదా ప్రైవేటు వేదికలు, సామాజిక మాధ్యమాలు, సమావేశాలు, ముఖాముఖిల్లో మాట్లాడటం కాని, ప్రచురించడం కాని చేయొద్దంటూ బండి సంజయ్‌తో పాటు ఆయన అనుచరులను ఆదేశించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశంలో మే 11న ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు చేయగా.. ఆధారాలు చూపించాలని.. 48 గంటల్లో స్పందించకపోతే పరువునష్టం దావా వేస్తానని మంత్రి హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మే 13న మంత్రి కేటీఆర్ తరఫున ఆయన న్యాయవాది బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశంలో దురుద్దేశపూర్వకంగా తన క్లయింట్ పేరు ఆపాదించే ప్రయత్నం చేశారంటూ కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ అంశంపై విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది.
link Media ప్రజల పక్షం🖋️
ఎదురు చెప్పే వాళ్ళను నేను పట్టించుకోను.... నన్ను ఎవరూ అడ్డుకోలేరు.... గవర్నర్ తమిళ సై
*ఎదురు చెప్పే వాళ్ళను నేను పట్టించుకోను.... నన్ను ఎవరూ అడ్డుకోలేరు.... గవర్నర్ తమిళ సై*
హైదరాబాద్: తెలంగాణ మహిళలు ఇబ్బందులు పడుతుంటే తాను చూస్తూ ఊరుకోనని.. వారి కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు.వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ఒక బలమైన శక్తిగా ముందుంటానని చెప్పారు. తమిళిసై ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో భాగంగా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేజ్ మీద ఓ వృద్ధురాలిని కూర్చోబెట్టుకుని మహిళల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా దర్బార్‌కు వచ్చిన మహిళలను ఉద్దేశిస్తూ తమిళిసై తెలుగులో ప్రసంగించడం విశేషం.
''గవర్నర్ ప్రజలను కలుస్తారా? అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజల కోసమే అని గుర్తుంచుకోవాలి. సెక్యూరిటీ వాళ్లు వద్దన్నా కొవిడ్ సమయంలో రోగులను పరమర్శించాను. మహిళలు సమాజంలో ఎక్కువగా బాధింపబడుతున్నారు. ఒక మహిళగా బాధిత మహిళలకు అండగా ఉండి, ఆదరించాలని ఆశిస్తున్నాను. నా తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. మహిళలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాను. ఈ విషయంలో ఎదురు చెప్పే వాళ్లను నేను పట్టించుకోను. నిరసనకారుల గురించి నేను ఆందోళన పడటం లేదు. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలి. ఒక సోదరిలా తెలంగాణ మహిళల వెన్నంటి ఉంటాను. నన్ను ఎవరూ అడ్డుకోలేరు. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తాను. వాటికి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. విధానం ఏదైనా ప్రజల కోసమే పని చేయాలి. వినిపించని మహిళల స్వరం కూడా వినిపించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఇలాంటి మద్దతు చాలా అవసరం. మనం గెలుస్తాం.. మన గెలుపును ఎవరూ ఆపలేరు'' అని మహిళలకు గవర్నర్ భరోసా ఇచ్చారు.
*ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు....*
24 గంటల క్రితమే మహిళలను కలవాలని నిర్ణయం తీసుకున్నాను. మంచి స్పందన వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందుగా మహిళా దర్బార్ నిర్వహించాను. మహిళలకు అండగా ఉండాలనే మహిళా దర్బార్ నిర్వహించాను. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. కొందరు రాజ్‌భవన్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజ్‌భవన్‌కు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉంది. ఇది పొలిటికల్ కార్యాలయం కాదు.. నేను చేయదగిన కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నా. మహిళా దర్బార్‌ను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసమే ఉన్నాయి. రాజ్‌భవన్‌ను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ప్రభుత్వానికి పంపిస్తాను. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నా. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను. ప్రభుత్వం కూడా అలాగే స్పందించాలి. ప్రభుత్వం ప్రొటోకాల్ సరిగా పాటించడం లేదు. అది నన్ను ఆపలేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో పని చేస్తున్నా'' అని గవర్నర్ పేర్కొన్నారు.
link Media ప్రజల పక్షం🖋️
Thursday, June 9, 2022
కోర్టు దిక్కరణ కేసులో నలుగురు పోలీస్ అధికారులకు..... ఊరట.....!
*కోర్టు దిక్కరణ కేసులో నలుగురు పోలీస్ అధికారులకు..... ఊరట.....!*
హైదరాబాద్: కేసుల దర్యాప్తులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించినందున నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైదరాబాద్ జాయింట్ సీపీ (అప్పటి వెస్ట్‌జోన్ డీసీపీ) ఎ.ఆర్.శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ ఎస్.రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సీహెచ్.నరేష్‌లు సీజే ధర్మాసనం ఎదుట అప్పీల్ చేశారు. సింగిల్ జడ్జి విధించిన జైలుశిక్షపై సీజే ధర్మాసనం స్టే ఇచ్చింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
link Media ప్రజల పక్షం🖋️
Wednesday, June 8, 2022
చరిత్ర సృష్టించిన.... మాలావత్ పూర్ణ....మౌంట్ డేనాలి ఎక్కి ప్రపంచ రికార్డ్
*చరిత్ర సృష్టించిన.... మాలావత్ పూర్ణ....మౌంట్ డేనాలి ఎక్కి ప్రపంచ రికార్డ్*
*ఉత్తర అమెరికాలోని డెనాలి శిఖరారోహణతో 7-సమ్మిట్ చాలెంజ్ పూర్తి*
*ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియాగా గుర్తింపు*
నిజామాబాద్: మాలావత్ పూర్ణఅరుదైన ఘనత సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది.ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వత శిఖరం (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7-సమ్మిట్ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన 'యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియా'గా రికార్డు సృష్టించింది. పూర్ణ మే 18న ఇండియా నుంచి బయల్దేరి, మే 19న అలస్కాలోని ఎంకరేజ్ నగరానికి చేరుకుంది. ఈ పర్వతారోహణలో పూర్ణతోపాటు మనదేశం నుంచి మరో నలుగురు సభ్యులున్నారు.
మే 23న బేస్ క్యాంప్‌కు చేరుకున్నవారు శిఖర అధిరోహణ ప్రారంభించి, ఈనెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్ శేఖర్ బాబు ధ్రువీకరించారు. శిఖరం నుంచి కిందికి వస్తూ పూర్ణ శాటిలైట్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఈ యాత్రకు స్పాన్సర్ చేసిన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణమూర్తి, తన గురువు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్(వీఆర్‌ఎస్), సహకరించిన హైదరాబాద్ బీఎస్‌బీ ఫౌండేషన్ చైర్మన్ భూక్యా శోభన్‌బాబులకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది.
పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన 'ట్రాన్సెండ్ అడ్వెంచర్స్' సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7-సమ్మిట్స్ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది. దెనాలి పర్వతారోహణలో పూర్ణతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్ బజాజ్, ఆయన కుమార్తె దియా బజాజ్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్ వర్మ కూడా ఉన్నారు.
*దక్షిణభారత దేశం నుంచి తొలి యువతి..*
కాగా, ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పూర్ణ 2014లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 'ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు'గా చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కార్టెన్జ్ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, తాజాగా ఉత్తర అమెరికాలోని దెనాలి శిఖరాలను అధిరోహించింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ 7-సమ్మిట్ ఘనతను సాధించిన మొదటి యువతి పూర్ణ కావడం విశేషం.
*పూర్ణ అధిరోహించిన పర్వతాలు:*
1 ఎవరెస్టు (ఆసియా)
2. మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా)
3. మౌంట్ ఎల్‌బ్రస్ (యూరప్)
4. మౌంట్ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా)
5. మౌంట్ కార్టెన్జ్ (ఓషియానియా)
6. మౌంట్ విన్‌సన్ (అంటార్కిటికా)
7. మౌంట్ డెనాలి (ఉత్తర అమెరికా)
link Media ప్రజల పక్షం🖋️
బస్ చార్జీలు భారీగా.... పెంపు....?
*బస్ చార్జీలు భారీగా.... పెంపు....?*
హైదరాబాద్: సాధారణ ప్రయాణికులే లక్ష్యంగా డీజిల్ సెస్, టిక్కెట్ ధరల రౌండాఫ్ నెపంతో ఇప్పటికే నగరంలో చార్జీల మోత మోగిస్తున్న ఆర్టీసీ..తాజాగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది.
బస్‌పాస్ చార్జీలను భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఉన్న చార్జీలను ఇంచుమించు రెట్టింపు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.
నగరంలో సాధారణ నెలవారీ బస్‌పాస్‌లతో (జీబీటీ)పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు, సాధారణ క్వార్టర్లీ పాస్‌లు, గ్రేటర్ హైదరాబాద్ క్వార్టర్లీ పాస్‌లను ఎక్కువ మంది విద్యార్థులు వినియోగిస్తున్నారు. అలాగే ఇంటి నుంచి కాలేజీ వరకు వెళ్లి వచ్చేందుకు రూట్ పాస్‌లకు కూడా డిమాండ్ బాగా ఉంటుంది. ఇలా వివిధ రకాల పాస్‌లను వినియోగిస్తున్న విద్యార్థుల సంఖ్య 5 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా.
ఈ విద్యార్థులు బస్‌పాస్‌ల కోసం ప్రతి నెలా ఆర్టీసీకి ప్రస్తుతం రూ.8.5 కోట్ల వరకు చెల్లిస్తుండగా తాజా పెంపుతో మరో రూ.5 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ప్రస్తుతం సాధారణ నెల వారీ పాస్ రూ.165 ఉండగా, తాజాగా రూ.300 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే క్వార్టర్లీ పాస్ రూ.495 నుంచి రూ.650 వరకు పెరగవచ్చునని అంచనా. ఏ బస్‌పాస్‌పైన ఎంత వరకు చార్జీలు పెరిగాయనే అంశాన్ని బుధవారం అర్ధరాత్రి వరకు కూడా ఆర్టీసీ స్పష్టం చేయకపోవడం గమనార్హం.
link Media ప్రజల పక్షం🖋️
కోవిడ్ టెస్టులు పెంచాలి.... తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశం.....
*కోవిడ్ టెస్టులు పెంచాలి.... తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశం.....*
హైదరాబాద్: కరోనా ఫోర్త్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కొవిడ్ టెస్టులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం కోవిడ్ 19పై హైకోర్టులో విచారణ జరిగింది.కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని ధర్మాసనం సూచించింది. కోవిడ్‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కోవిడ్ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ... తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.
link Media ప్రజల పక్షం🖋️