Saturday, August 3, 2024

షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ.!

*గబ్బర్ సింగ్ "తరహాలో బాదుడు.!*

*షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి వీరంగం.!*

*షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ.!*

 *దెబ్బలు తట్టుకోలేక  దాహం వేస్తే నీళ్లు తాపీ మరీ కోటింగ్..!*

*బూటు కాళ్లతో కడుపులో తన్నారని ఆవేదన.!*

*దొంగతనం చేసిందనే అనుమానంతో  దళిత మహిళపై దారుణం.!*

*నేరం ఒప్పుకోవాలంటూ కన్నతల్లి ముందే కుమారుడికి చిత్రహింసలు.!*

*బంగారం దొంగతనం ఆరోపణలో అనుమానితులపై పోలీసుల జులుం.!*

 బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్ధాక్షిణ్యంగా ఓ దళిత మహిళను మగ పోలీసులు  చిత్రహింసలకు  గురి చేశారు  నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి కొడుకులను దారుణంగా కొట్టారు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్చ పోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదుదారుడితో  బాధితురాలి  తలకు కాళ్లకు జండ్ బామ్ వ్రాయించారు   ఫిర్యాదుదారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది
సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు  పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై  గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది  సునీత భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్  తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు తల్లి కొడుకులను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. డిఐ రాంరెడ్డి సునీతను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు పేర్కొంది పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన రాత్రి తనను బట్టలు విప్పించి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ  చీర విప్పించి చెడ్డి తొడిగించి మరి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదారు. దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకు అయిన జగదీశ్వర్ ను  కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్   తో కొట్టినట్టు బాధితులు పేర్కొన్నారు. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా సునితను ఇంటికి పంపించారు. అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి  కారులోనే ఇంటికి పంపించడం గమనార్హం. 

బంగారం దొరికింది..

నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని  ఆరోపణలు  ఎదురుకుంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం  దొరికిందని, ఈ దొంగతనం చేసింది సునీతనేనని ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరాచకం సృష్టించారు అయితే మొత్తం 26 ఆరు తులాల బంగారం రెండు లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారాని అందులో నుండి ఒక తులం బంగారం నాలుగు  వేల  రూపాయలు  రికవరీ చేసినట్టు చెబుతున్నారు పోలీసులు 

అదుపులోకి  తీసుకొని  కేసు నమోదు చేశాం...

డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి..

జరిగిన దారుణ ఘటనపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని ఆమె పై  విచారణ కొనసాగిస్తున్నామని విచారణలో భాగంగా స్టేషన్ కు  తీసుకు వచ్చామని అన్నారు అయితే  బంగారం ఆమె తీసుకుందని గ్యారెంటీ లేదని అది విచారణలో తేలుతుందన్నారు నాన్ బెయిలబుల్  సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు రిమాండ్  ఎందుకు చేయలేదనే  విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి  పోలీసులు కొట్టిన దెబ్బలతో బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకనే  రిమాండ్ చేయ్యలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..

Courtesy / Source by :
https://epaper.janamsakshi.org/view/4771/main-edition/1

ఫిల్మ్ ఫేర్ అవార్డు... #బలగం

https://x.com/Praja_Snklpm/status/1819932069243289737?t=xhpanWimU9268l5YN5OUfQ&s=08     

_*Congratulations! Team #బలగం ✊*_

*తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్ర...#Balagam*

*The Filmfare Award for Best Director - Telugu goes to #VenuYeldandi for #Balagam #69thSOBHAFilmfareAwardsSouth2024*

*@VenuYeldandi9 🤝*

*Bplkm✍️*

Friday, August 2, 2024

*సమగ్ర శిక్షా ఉద్యోగి ఆవేధన*

*సమగ్ర శిక్షా ఉద్యోగి ఆవేధన*

గౌరవ  ముఖ్య మంత్రి  గారూ ఆలోచన  చేయండి.
         🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

*👉మా కల్ల ముందే కాలం మారిపోహింది,ఇరుల ప్రపంచం మరిపొతువుంది కానీ  మా ప్రపంచం లో మార్పు లెదు.*

*👉మా కలలు కళ్ళలుగా... మా ఆశలు -ఆడి ఆశలు గా,మా ఆశయాలు అవమానాలుగా  మారుతున్నాయి.*

*👉మీకోసం మేమున్నాం అంటూ నమ్మబలికే నాయకులు?ఓటు అవసరాలకు, వాడుకొని గొప్పగా మాటలు ఇచ్చి తరువాత మీరెవరు? ఏమి చేస్తారు? మీకు ఎందుకు భద్రత కావాలి అంటున్నారు.* ఇదేనా  గొప్ప న్యాయం.

*👉మా సమగ్ర శిక్షా ఉద్యోగుల పుట్టెడు బానిస పనులు చేసుకొని, మీ సేవలు మరువలేము మీకు కచ్చితంగా న్యాయం జరగాలి అని మాతో మాట్లాడి తీరా ప్రభుత్వం వద్ద ఏ? వారు కాంట్రాక్టు ఉద్యోగులు వారి గురించి పెద్దగా ఆలోచన వద్దు  అంటూ CM& మంత్రుల గార్లు, అధికారులు వద్ద అంటున్నారు... ఇదేం న్యాయం.*


*👉నేడు గొప్పగా మాట్లాడిన CM. A. రేవంత్ రెడ్డి గారు,  కాలి కడుపు తో వున్న సమగ్ర శిక్షా  ఉద్యోగులను వాళ్ళను   గుర్తించని CM &ప్రభుత్వం* ఆలోచించాలి.

*👉సమగ్ర శిక్షా ఉద్యోగులకు స్వయానా ముఖ్య మంత్రి A. రేవంత్  గారూ ఇచ్చిన హామీ ని కనీసం మీటింగ్ లో ఒక్క మాటలో కూడా గుర్తుచేసుకొని పరిస్థితి*

*👉దయచేసి గౌరవ CM గారూ, నాయకులు, MLA'S &MLC'S& ఉపాధ్యాయ నాయకులు మనసారా ఆలోచించాలి.*

 *తెలంగాణ రాష్ట్రము లోని సమగ్ర శిక్షా ఉద్యోగుల గురించి ఆలోచించాలి.*

Source :సమగ్ర శిక్షా ఉద్యోగి 

నలభై వేల రూపాయలు #లంచం తో SI

G.Venkanna, Sub-Inspector (SHO) of Parvathagiri Police Station, warangal commissionerate was caught by #ACB officials for accepting  the amount of  ₹40,000 #bribe through P. Sadanandam, ARPC (Driver) to issue Notices and Station bail in a criminal case for 3 accused Persons.
#AntiCorruptionBureau #Justice  #Telangana
@CVAnandIPS
ఒక కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు నోటీసులు ఇవ్వడానికి & స్టేషన్ బెయిల్ మంజూరు చేయటం కోసం వరంగల్ కమీషనరేట్ లోని పర్వతగిరి పోలీస్ స్టేషన్-ఎస్.ఐ. (ఎస్.ఎచ్.ఒ)- జి. వెంకన్న తన డ్రైవర్ అయిన, "పి. సదానందం" (ఏఆర్ కానిస్టేబుల్ ) ద్వారా
"నలభై వేల రూపాయలు" #లంచం తీసుకుంటుండగా #అనిశా అధికారులకు పట్టుబడినారు.
#అవినీతినిరోధకాశాఖ  #న్యాయం
#తెలంగాణ

Courtesy / Source by : 

https://x.com/TelanganaACB/status/1819306061259821540?t=hgo8hsW0rLXoJVAHFfdS-g&s=19

Thursday, August 1, 2024

ట్రాన్స్పారెన్సీగా జరగాలన్న సీఎం అదేశాలు భేఖాతర్.

https://x.com/Praja_Snklpm/status/1819051849489551796?t=b5BeiNRaZ7StxRKZ75qxyA&s=08           

*ఆదాయం సమకూర్చే శాఖలో బదిలీల అవినీతి.*

*ట్రాన్స్పారెన్సీగా జరగాలన్న సీఎం అదేశాలు భేఖాతర్.*

*ఎస్ ఆర్ ఓ, డీఆర్ఓల వద్ద 30 కోట్లు వసూలు చేసిన ఘనుడు.*

*అప్పుడు, ఇప్పుడు అన్ని తానై నడిపించిన స్థిత ప్రజ్నా.*

*తియ్యటి మాటలతో అధికారులను బుట్టలో వేసుకుని దందా.*

*జీరో సర్వీస్ పేరుతో జీవో నెంబర్ 80కి పాతర.*

*హాడవుడి సమయంలో బదిలీల ఆర్డర్స్ ఓకే చేసిన మంత్రి.*

*భారీగా వసూలు చేస్తున్న ఎస్ఆర్ఓ లనుదూరంగా వేయలని సూచన -పట్టించుకోకుండానే బదిలీలు.*

*ఆ డీఆర్ అనుకున్న వారందరికి హై డిమాండ్ పోస్టులే.*

*బదిలీల్లో భారీగా చేతులు మారిన వైనం పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్. కామ్ స్పెషల్ స్టోరీ.*

Courtesy / Source by :
*By : దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.9848070809.*
 
*రెండేళ్ల సర్వీస్ పూర్తికాని వారిని బదిలీ చేయవద్దని జీవో నెంబర్ 80 చెప్పుతుంది. జీరో సర్వీస్ పేరుతో 144 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ రిజిస్ట్రర్ శాఖ ఐజీ జ్యోతి బుద్ద ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక సర్య్యూలర్ తో అదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, రిజిస్ట్రర్ శాఖలో బదిలీలు విచ్చల విడిగా చేసుకునేందుకు అవకాశం కల్పించారు.* 

https://www.landsandrecords.com/news-details.php?nid=96
*పూర్తి వివరాలు👆*

*@TelanganaCMO @CPRO_TGCM*
*@IPRTelangana @CVAnandIPS*    

https://x.com/Praja_Snklpm/status/1819051849489551796?t=KXoz9ftBLH-kGpWnDzMRbA&s=19
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/cUAkiYeA4nm2wZwu/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C-IqC52ykoA/?igsh=bTBjYnh4MzIybDNp 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_httpslnkdingf2f8qvx-%E0%B0%86%E0%B0%A6%E0%B0%AF-activity-7224825089660174336-JrgH?utm_source=share&utm_medium=member_android

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ACB అధికారులు

#ACB Officials caught "M. Santhosh - Jr. Asst & Ch. Arun Kumar - Dharani Operator (Out Soucing)" at O/o Ameenpur Tahsildar Office, Sangareddy Dist. for demanding and accepting the #bribe amount of Rs. 30000/- "for forwarding succesion file to the Tahasildar".
@CVAnandIPS

ఒక వ్యక్తి యొక్క వారసత్వ ఆస్తికి సంబంధించిన ఫైల్ ను తహసీల్దార్ గారికి పంపించేందుకు "ముప్పై వేల రూపాయలు" #లంచం  తీసుకుంటుండగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న "మన్నె సంతోష్ - జూనియర్ అసిస్టెంట్ & చాకలి అరుణ్ కుమార్ - ధరణి ఆపరేటర్ లను వలపన్ని పట్టుకున్న #అనిశా అధికారులు.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1819002692217557103?t=V_WMLnbNWFhMvLbGDBNdBw&s=19

ఉస్మానియా యూనివర్సిటీ.. బోధనేతర సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి... ఆనంచిన్ని వెంకటేశ్వరావు


*ప్రెస్ నోట్*

_*ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ.. బోధనేతర సిబ్బంది న్యాయమైన డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి: ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరావు*_

ఉస్మానియా యూనివర్సిటీలో 'గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నా తమను (జీ.ఓ.ఎమ్ ఎస్.నెం.16 ద్వారా) రెగ్యులరైజ్ చేయాలని, ఎన్నో సంవత్సరాలనుండి న్యాయంగా పోరాటం చేస్తూ యూనివర్సిటీ అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, ఈ అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికను ఇచ్చి తమ జీవితాలతో ఆడుకుంటున్నారు' అని ఈరోజు ఆగష్టు 1,2024 న OU ఆర్ట్స్ కాలేజీ వద్ద తమ ఆవేదనను వాస్తవ వివరాలను ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత అనంచిన్ని వెంకటేశ్వరావుగారికి తెలిపి తమ ఈ న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేయాలని నాన్ టీచింగ్ కాంటాక్ట్ ఉద్యోగుల ప్రతినిధులు చేతన్, డాక్టర్ వీరేశం, అరుణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి బాపట్ల కృష్ణమోహన్, ప్రజాసంకల్పం ప్రతినిధి మండల బిక్షపతి పాల్గొన్నారు.

బాపట్ల కృష్ణమోహన్