Friday, May 5, 2023

ప్రియాంక చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్....!

*ప్రియాంక చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్....!*

హైదరాబాద్ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ  తెలంగాణలో  పర్యటించబోతున్నారు. ఈ నెల 8న సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే 'యువ సంఘర్షణ' సభలో  ప్రియాంక పాల్గొనబోతున్నారు.ఈ పర్యటనకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  పూర్తి వివరాలు  వెల్లడించారు. ప్రియాంక పర్యటనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రియాంక రిలీజ్ చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. 'గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద యువనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేశారు. అదే స్పూర్తితో హైదరాబాద్ డిక్లరేషన్‌ను సరూర్ నగర్ సభలో విడుదల చేస్తాం. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్‌లో ప్రకటిస్తాం. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో సభలో వివరిస్తాం. ప్రియాంక గాంధీ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వండని కేసీఆర్‌ను అడగడం కాదు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊదరగొడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు పార్టీలకు అతీతంగా మద్దతుగా తరలి రావాలి. విద్యార్థి, నిరుద్యోగులందరూ సభను విజయవంతం చేయాలి. కేసీఆర్ విముక్త తెలంగాణ తీసుకొచ్చేందుకు సహకరించాలి' అని రేవంత్ రెడ్డి కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

కరీనగర్ లోని తెలంగాణా చౌక్ వద్ద హనుమాన్ చాలీసా పారాయణము


*ఈరోజు కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో భాగంగా కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో లో హిందూ ధార్మిక సంస్థ దేశం కోసం ధర్మం కోసం కొట్లడే సంస్థ బజ్రంగ్డల్ నీ నిషేదిస్తము అనీ పేటడం మరియు దేశ ద్రోహి సంస్థ pfi సంస్థ తో పోల్చడాని నిరసిస్తూ వెంటనే హిందూ మనోబావలు కించపరిషినందుకు నిరసనగా వారి వ్యాఖ్యలు వెంటనే వాపస్ తీసుకోవాలని మరియు క్షేమపన చెపలని కోరుతూ మరియు వారి మేనిఫెస్టో నుండి తీసివేయాలి అని కోరుతూ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కరీనగర్ లోని తెలంగాణా చౌక్ వడ హనుమాన్ చాలీసా పారాయణము చేయడం జరగింది మరియు కరీనగర్ లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముటడి చేయడం జరిగింది మరియు ఆ క్రమంలో అరెస్టు ఆయి పిటిసి కి తీసుకోవడం జరగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కరీనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణ రెడ్డి గారు,జిల్లా పార్లమెంట్ కన్వినర్ ప్రవీణ్ రావు గారు,ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గారు, వాసుదేవ్ గారు,బీజేపీ పార్టీ సౌత్ జోన్ అద్యక్షులు ప్రవీణ్ గారు,జిల్లా సోషల్ మీడియా ఇంఛార్జి శ్రీనివాస్,BJYM జిల్లా కార్యదర్శి ( అసెంబ్లీ ఇంఛార్జి))ధీరజ్ గారు,BJYM జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ గారు,జేశ్వంత్ గారు ,BJYM కోటపల్లీ రూరల్ మండల అధ్యక్షులు ప్రశాంత్ గారు, బీజేపీ పార్టీ నాయకులు శివ గారు ,అనిల్ గారు, ఏస్.సీ మూర్ఛ అధ్యక్షులు వేణు గారు మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు ,నాయకులు పాల్గొన్నారు*

Courtesy by : ధీరజ్ 

Wednesday, May 3, 2023

పురపాలక శాఖపైన నేడు మంత్రి కేటీఆర్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం


పురపాలక శాఖపైన నేడు మంత్రి కేటీఆర్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వార్డు పాలన వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలపైన పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు వార్డు పాలన వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, లక్ష్యాలను వివరించారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పరిపాలనను వికేంద్రీకరించి నూతనంగా జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను, ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు నూతన పురపాలికలను, గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటుచేసి ప్రజల ఇంటి ముందుకే పరిపాలన ఫలాలను తీసుకువెళ్లే ప్రయత్నంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలోనూ పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వార్డు పాలన వ్యవస్థ ద్వారా ప్రజలు తమ పనుల కోసం ప్రస్తుతం సర్కిల్ కార్యాలయాలకు లేదా జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా తమకు అత్యంత చేరువగా ఉండే వార్డు పరిధిలోనే తమ పనులను చక్కబెట్టుకోడానికి, తమ ఫిర్యాదులను, ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు వీలు కలుగుతుంది అని తెలిపారు. దీంతో వేగంగా ప్రభుత్వానికి ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశం రావడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వ పాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచడమే ఈ నూతన విధాన లక్ష్యం అన్నారు.

జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న 150 వార్డుల్లో ఈ వార్డు
ఆఫీసులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ వార్డు ఆఫీసులలో సుమారు పది మంది క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండబోతున్నారు. వార్డు పరిపాలన వ్యవస్థకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇంచార్జిగా ఉంటారు. ఈయనకి అనుబంధంగా పారిశుద్ధ్యము, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్వహణ, ఎంటమాలజీ విభాగము, వెటర్నరీ విభాగము, టౌన్ ప్లానింగ్ విభాగం, జలమండలి వంటి తదితర కీలకమైన విభాగాలకు సంబంధించిన సూమారు 8 నుంచి 10 మంది అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. వీరు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుతో పాటు ప్రజలకు ఉన్న ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి వేగంగా పనిచేస్తారు.

Courtesy by : KTR fb 

Monday, May 1, 2023

త్వరలో ఆర్ఆర్ఆర్ రెండో భాగానికి జాతీయ హోదా...!

*త్వరలో ఆర్ఆర్ఆర్ రెండో భాగానికి జాతీయ హోదా...!*

హైదరాబాద్‌: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌.ఆర్‌.ఆర్‌) వ్యవహారంలో మరో కదలిక వచ్చింది. దక్షిణ భాగం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది.ఉత్తర భాగం భూ సేకరణ వ్యయాన్ని దశల వారీగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సుమారు రూ.1,200 కోట్లకుగాను తొలివిడతగా రూ.100 కోట్లు డిపాజిట్‌ చేయటంతో ఒకటొకటిగా అడుగులు పడుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని *చౌటుప్పల్‌*, *ఇబ్రహీంపట్నం*,*ఆమనగల్‌*, *షాద్‌నగర్‌* *చేవెళ్ల*, *శంకరపల్లి*, *కంది* మీదుగా 189 కిలోమీటర్ల దూరం నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. మార్గానికి సంబంధించిన సవివర నివేదికను రూపొందించి గడిచిన ఏడాదిలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కన్సల్టెంట్‌ సంస్థ పంపింది.జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం కూడా తెలిపింది. ఉత్తర భాగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో దక్షిణ భాగానికి జాతీయ రహదారి సంఖ్యను కేటాయించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు జమచేయడంతో దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించి సంఖ్యను కేటాయించే అవకాశాలున్నాయని ఉన్నతాధికారి ఒకరు 'ఈనాడు'తో చెప్పారు. ఆ తరవాత సమగ్ర సర్వే నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.

ఉత్తర భాగం రహదారి నిర్మాణ ప్రక్రియ మొదలయ్యాకే సర్వే వ్యవహారాలు ప్రారంభమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఉత్తర భాగంలో 60 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మే మొదటి వారంలోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల సంస్థ మధ్య త్రిపక్ష ఒప్పందం జరగనుంది. జూన్‌ నెలాఖరులోగా శంకుస్థాపనకు అవకాశాలున్నాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️

పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.1,000 వేతనం పెంపు

*కార్మికులకు... మే, లు*

*పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.1,000 వేతనం పెంపు*
*త్వరలో ఆర్టీసీ* *జీతాలూ పెంచుతామని వెల్లడి*
హైదరాబాద్‌: కార్మిక దినోత్సవం 'మే డే' కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య /బహుళవిధ (మల్టీపర్పస్‌) కార్మికుల వేతనాలను రూ.1,000 చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్‌ వర్క్స్‌తోపాటు రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ.. ఇది వర్తిస్తుందని సీఎం తెలిపారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. మే డే సందర్భంగా కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కష్టించి పనిచేసే ప్రతి ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ''ప్రమాదం కారణంగా కార్మికుల మరణం సంభవిస్తే రూ.6 లక్షలను సంబంధిత కుటుంబానికి చెల్లిస్తున్నాం..2014 నుంచి 2023 వరకూ ఇలా మరణించిన కార్మికులకు సంబంధించిన బాధిత కుటుంబాలకు రూ.223 కోట్లు అందజేశాం. ప్రమాదం కారణంగా వైకల్యానికి గురైతే రూ.5 లక్షల చొప్పున.. రూ.8.9 కోట్లను చెల్లించాం. కార్మిక కుటుంబాలకు 2014 నుంచి 2023 వరకూ 'వివాహ బహుమతి'గా రూ.130 కోట్లు చెల్లించాం. ప్రసూతి ప్రయోజనాల కింద రూ.280 కోట్లు అందజేశాం. సహజ మరణానికి రూ.లక్ష మొత్తాన్ని కార్మికుల కుటుంబాలకు చెల్లిస్తున్నాం. ఇలా 2014 నుంచి ఇప్పటి వరకు రూ.288 కోట్లను అందజేశాం. మరణానంతరం నిర్వహించే అంతిమయాత్ర కార్యక్రమాల కోసం 39,797 మందికి రూ.98 కోట్లను చెల్లించాం'' అని సీఎం తెలిపారు. వేతన పెంపుపై సోమవారం ప్రభుత్వం ఉత్తర్వు(జీవో నం. 39, 40)లను జారీ చేసింది. పెరిగిన వేతనాల కోసం అయ్యే అదనపు వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇతర నగర,పురపాలికలు, గ్రామ పంచాయతీలు తమ బడ్జెట్‌ల నుంచి భరించాలని ఆదేశించింది. పంచాయతీ కార్మికులకు వేతనాల పెంపుపై ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

అనంచిన్ని'కి అవార్డు!

అనంచిన్ని'కి అవార్డు!

★ పరిశోధన పాత్రికేయునికి విశిష్ట పురస్కారం_
★ హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి_

తెలుగు జర్నలిజంలో పరిశోధన పాత్రికేయానికి కొత్త దారులు చూపిన ప్రముఖ పరిశోధన పాత్రికేయునికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉగాది పురస్కారం ప్రకటించింది. మే 2న గుంటూరులో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అతిథులుగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ, ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ యం. వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, మరియు ఆత్మీయ అతిథులుగా డా కేర్ హోమియోపతి మరియు ఆటిజమ్ సెంటర్ అధినేత డా. ఎ. ఎమ్. రెడ్డి,  స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ శామ్యూల్ రెడ్డి, యూ బ్లడ్ ఫౌండర్ యలమంచిలి జగదీష్ బాబు, రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం తదితరులు హాజరవుతున్నారు.

*_బాక్స్_*
‌అక్షరం రాయడం పైకి కనిపించేంత చిన్న విషయం కాదు. అక్షరం అంటే ఒక ఆలోచన. ఆవేశం. చైతన్యం. యజ్ఞం.  ఆలంబన. ఆత్మ పరిశీలన.‌ మనసులో నుంచి వచ్చే ఆలోచనలను ఒడిసిపట్టి, అక్షరాలుగా కూర్చి, పేర్చి పాఠకులకు అందించడంలో పడే ప్రయాస అంతా ఇంతా కాదు. అలాంటి అక్షర ప్రయాణాన్నే జీవిత పరమావధిగా మార్చుకొని, మలచుకొని సాగడం సాహసమే అవుతుంది. అందులోనూ పరిశోధనాత్మక జర్నలిజం అనేది భిన్నమైనదే కాదు... విభిన్నమైనది. విచిత్రమైనది. అక్షర విప్లవానికి నాంది పలికేది. ప్రతి అక్షరం ప్రయాసతో కూడుకున్నదే అయినా పరిశోధనాత్మక జర్నలిజం అక్షరాలు నిరంతర పురిటి నొప్పుల నుంచి వచ్చే కొత్త తరం ఆవిష్కరణలు. అలాంటి ఆవిష్కరణలు అలవోకగా అందించే, సందించే ఏకైక జర్నలిస్టు అనంచిన్ని వెంకటేశ్వర రావు. అలుపెరగని అక్షర ప్రయాణంలో సత్కారాలెన్నో చూశాడు. ఆటు పోట్ల తో రాటు దేలాడు. అవమానించాలనుకున్న వారికి బుద్ధి చెప్పాడు. ఆయన అక్షరాలను భరించలేని పాలకులు అనంచిన్ని అక్షరాలను చీకట్లోకి తోసేశారు. సుమారు ఎనభై రోజులు ఖైదు చేశారు. అయినా అనంచిన్ని అక్షరం వెరవలేదు. మరింత పదును పెంచుకొని వేటలో ఒక అడుగు వెనక్కి పడిన పులిగా బెబ్బులిలా ముందుకు దూకింది. నేటి సమాజానికి దిక్సూచిగా, రేపటి తరానికి దివిటీగా నిరంతరం వెలుగు పంచేదే అనంచిన్ని... ఆ పదమే సంక్షేమ జర్నలిజానికి పెన్నిది.

*_ఏకైక యోధుడు_*
తన తాత ఈదేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంభానికి నవ్వుతూ వేలాడాడు. తండ్రి రజాకార్లతో పోరాడి కాళ్ళ నరాలు తెగకోసే దాకా పోరాడాడు. వాళ్ళ వంశ వారసత్వంలో పుట్టిన అనంచిన్ని వెంకటేశ్వరరావు ఓ నిశ్శబ్ద విప్లవ శాంతి.. కలం కెరటం. ఆపే దమ్మున్నోడు పుట్టలేదు. ఇక పుట్టడు. తనదైన పరిశోధనలతో వేలాది కుంభకోణాలను అలవోకగా రాశాడు. డబ్బుకు, కేసులకు, జైళ్ళకు, కిడ్నాపులకు, చావులకి భయపడని ఏకైక యోధుడు.

*_చెస్ క్రీడతో ప్రస్థానం.._*
1987లో రాష్ట్ర చెస్ జూనియర్ ఛాంపియన్ గా ప్రస్థానం మొదలెట్టిన అనంచిన్ని వెంకటేశ్వరరావును ఖమ్మం ఈనాడు క్రీడా ప్రతినిధి రాజపుత్ అర్జున్ సింగ్  'చదరంగంలో దృవతారలు వీరే' అంటూ వెలుగులోకి తెచ్చాడు. అది నిజం చేశాడు. తెలంగాణ తొలి ప్రధాన కార్యదర్శిగా కేవలం పది నెలల్లో 383 టోర్నమెంట్స్ నిర్హహించటం నమ్మశక్యం కాని ఓ అద్భుతం. 

*_ఆరోపణల మధ్య ఆశాకిరణం_*
తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు తపించే వ్యక్తి. ఎదిగే వ్యక్తిపై గత 38 ఏళ్ళుగా ఎన్నో ఆరోపణలు..అయినా చలించకుండా నవ్వుతూ ముందుకు సాగుతున్న అరుదైన వ్యక్తిత్వం. ఇది భావి తరాలకు ఆదర్శం. ఇది అజాత శత్రువు గురించి చరిత్రలో ఓ పేజీ మాత్రమే..!

సెక్రటేరియట్ కు వెళ్లకుండా రేవంత్ ను అడ్డుకున్న పోలీసులు!

*సెక్రటేరియట్ కు వెళ్లకుండా రేవంత్ ను అడ్డుకున్న పోలీసులు!*

హైదరాబాద్‌: ఓఆర్ఆర్ (ORR) లీజులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని హెచ్ఎండీఏ ( HMDA) కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు కొత్త సచివాలయానికి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని  పోలీసులు అడ్డుకున్నారు.నగరంలోని టెలిఫోన్‌ భవన్‌ దగ్గర రేవంత్ కారును ఆపివేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సెక్రటేరియేట్‌కు ఎందుకు వెళ్లనివ్వడంలేదని రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అపాయింట్‌మెంట్ లేదంటూ పోలీసులు సమాధానమివ్వడంపై రేవంత్ మండిపడ్డారు. ఒక ఎంపీగా తనకు అనుమతి ఏంటని నిలదీశారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. సెక్రటేరియేట్ వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని, తాను రోడ్డుపై బైఠాయిస్తానని హెచ్చరించారు. కాగా

కాగా రేవంత్ నూతన సచివాలయానికి వస్తారనే సమాచారంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సచివాలయం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. విజిటర్స్ గేటును పోలీసులు మూసివేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️