Friday, June 3, 2022

జూబ్లీహిల్స్‌లో దారుణం... పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం

 జూబ్లీహిల్స్‌లో దారుణం... పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం

Hyderabad News: జూబ్లీహిల్స్‌లో దారుణం... పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం

Courtesy by : ఈనాడు మీడియా ట్విట్టర్ 

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కొందరు కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1గంట నుంచి 6గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్‌ నుంచి బాలిక బయటకు వచ్చింది. 

అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8మంది యువకులు బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు, మరో ప్రజాప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక .. ప్రజాప్రతినిధి  కుమారుడు, అతని స్నేహితులు నలుగురితో కలిసి ఇన్నోవా కారు బయల్దేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు .. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక ఫోన్‌ చేయడంతో తండ్రి   వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. ఐదుగురు కారులో తనపై దాడికి పాల్పడ్డారని చెప్పడంతో ఆమె తండ్రి  జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇన్నోవా కారులో 16, 17 ఏళ్ల బాలురు ఉన్నారని, వారిలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, టాస్క్‌ పోర్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయంపై సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెంజి కారును పోలీసులు సీజ్‌ చేశారు.


R. కృష్ణయ్య పై రాయదుర్గం పీఎస్ లో..... కేసు నమోదు

*R. కృష్ణయ్య పై రాయదుర్గం పీఎస్ లో..... కేసు నమోదు*

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్యపై కేసు నమోదైంది. తన భూమిని ఆక్రమించుకునేందుకు రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.కోర్టు ఆదేశాల మేరకు రాయదుర్గం పోలీసులు ఆర్.కృష్ణయ్యపై 506, 447, 427, 506, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్.కృష్ణయ్యతో 40 ఏళ్లుగా స్నేహం ఉందని, తన భూమిని కబ్జా చేసి చంపాలని చూశారని రవీందర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

ఆర్య సమాజ్‌ జారీ వివాహ ధ్రువీకరణ పత్రాలు చెల్లవని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

*ఆర్య సమాజ్ పెళ్లిళ్లపై.....సుప్రీంకోర్టు కీలక తీర్పు.....!*

దిల్లీ: ఆర్య సమాజ్‌ లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్య సమాజ్‌ జారీ వివాహ ధ్రువీకరణ పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది.అలాంటి సర్టిఫికేట్లు ఇవ్వడం ఆర్య సమాజ్‌ పని కాదని తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమపెళ్లిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Thursday, June 2, 2022

జాతీయ జెండాను అగౌరపరిచిన కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే

*జాతీయ జెండాను అగౌరపరిచిన కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే*

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అగౌరపరిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ - గాజులరామారం జంట సర్కిళ్ల కార్యాలయాల వద్ద షూ వేసుకుని ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే వివేకానంద... అంబేద్కర్ ఫోటో వద్ద ఎమ్మెల్యే షూ వేసుకుని పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జెండాను అగౌరపరిచిన కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కాగా... ప్రగతి భవన్‌లో అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పులు లేకుండా జాతీయ జెండాను గౌరవించి పాతాకావిష్కరణ చేశారు. దీంతో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం అలా... ఎమ్మెల్యేలు ఇలా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసిరారు..

 link Media ప్రజల పక్షం 

టార్గెట్​ తెలంగాణ.. రంగంలోకి దిగిన మోడీ

టార్గెట్​ తెలంగాణ.. రంగంలోకి దిగిన మోడీ

Courtesy by Disha Web  2 June 2022 5:00 AM దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో టార్గెట్​తెలంగాణగా పావులు కదుపుతోంది. ఈ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా ప్రణాళిక చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇన్నేండ్లలో ఎన్నడూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించిన దాఖలాలు లేవు. అలాంటిది ఈసారి ఢిల్లీలో అధికారికంగా ఘనంగా ఆవిర్భావ ఏర్పాట్లు నిర్వహిస్తోంది. తెలంగాణపై జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిగా దృష్టిసారిస్తుందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా ఇలాంటి జాతీయ స్థాయి సమావేశాలు ఆయా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లేదా త్వరలో అధికారంలోకి వస్తామనుకున్న రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. దీని ద్వారా బీజేపీ నాయకత్వం తెలంగాణ గడ్డ త్వరలో తమదేననే స్పష్టమైన ఇండికేషన్​ఇచ్చేందుకే ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Also Read - పంజాబ్ ప్రభుత్వం యూటర్న్! జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్​వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలంతా తరలిరానున్నారు. 300 మంది డెలిగేట్లతో పాటు మొత్తం దాదాపు వెయ్యి మంది వరకు ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ప్రధాని మోడీ రెండ్రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఈ రెండ్రోజుల్లో తెలంగాణ రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రెండ్రోజులు రాజ్​భవన్‌లో బస చేస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఏకంగా ప్రధాని రెండ్రోజులు ఇక్కడే మకాం వేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా సమావేశ నిర్వహణ వేదిక మాత్రం ఖరారు కావాల్సి ఉంది. Also Read - అతడో కుట్ర సిద్ధాంత కర్త.. కేజ్రీవాల్‌పై స్మృతి ఇరాణి హాట్ కామెంట్స్.. రాష్ట్రంలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ హైకమాండ్​మొత్తం హైదరాబాద్‌కు తరలిరానుంది. తెలంగాణలో తాము అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలు అటు ప్రజలకు, ఇటు శ్రేణులకు ఇవ్వనుంది. తెలంగాణలో బీజేపీ అవసరం ఉందనే విషయాన్ని నొక్కి చెప్పనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందకు ప్రత్యేక కార్యాచరణ, అమలు చేయాల్సిన వ్యూహాలపై క్లారిటీ ఇవ్వనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా వచ్చారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వచ్చారు. అఫీషియల్​ప్రోగ్రాం అయినా మోడీ అనుకున్న షెడ్యూల్‌కు 35 నిమిషాల ముందుగానే నగరానికి చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన వల్ల జరగుతున్న నష్టాలను ప్రజలకు, శ్రేణులకు వివరించారు. ప్రధాని సైతం తాను అనుకున్న షెడ్యూల్‌కు ముందే వచ్చి కేసీఆర్​పై చేసిన విమర్శలతో రాజకీయంగా మరింత హీట్​పెంచారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బలంగా నమ్మడం వల్లే ప్రధాని సైతం అఫీషియల్​కార్యక్రమానికి వచ్చి రాజకీయ విమర్శలు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్​నింపారు. Also Read - Raja Singh: ఆ టెంపుల్‌ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తా.. ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయింది. క్రమంగా తెలంగాణ సర్కార్​పై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే జేపీ నడ్డా, అమిత్​షా, ప్రధాని మోడీ వచ్చి రాష్ట్రంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ విమర్శలు చేశారు. శ్రేణులు, నాయకులు, కార్యకర్తల్లో ఫుల్​జోష్​నింపారు. ఈ సమావేశాలతో ఈ జోష్​లెవల్స్​వేరే లెవల్​లో ఉంటాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తమ పార్టీకి ఈ సమావేశాలు ఫుల్​మైలేజీ ఇస్తాయని బలంగా నమ్ముతోంది. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపును అడ్డుకునేవారు ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేస్తోంది. హుజురాబాద్​లాంటి గెలుపును రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు కొనసాగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తే బాగుటుందనే చర్చ బీజేపీలో సాగుతోంది. సమావేశం కోసం స్థల పరిశీలనలో రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది. ఇప్పటికే హెచ్ఐసీసీతో పాటు నోవాటెల్, తాజ్​కృష్ణ హోటళ్లను సందర్శించారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలు వస్తున్న నేపథ్యంలో ఆతిథ్యంలో ఏమాత్రం రాజీ పడొద్దని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, దాదాపు 300 మంది డెలిగేట్స్, జాతీయ స్థాయి నేతలు వస్తున్న నేపథ్యంలో వారి బస ఏర్పాట్లపై రాష్ట్ర నాయకత్వం దృష్టిసారిస్తోంది. ప్రముఖ హోటల్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల బసను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బుధవారం బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బీఎల్​సంతోశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి హెచ్​ఐసీసీ, తాజ్​కృష్ణ, నోవాటెల్​వంటి పలు హోటళ్లను పరిశీలించారు. అనంతరం విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, నల్లు ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి జాతీయ కార్యవర్గ సమావేశానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బండి పాదయాత్రకు బ్రేక్ జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో కొనసాగనున్న నేపథ్యంలో బండి సంజయ్​మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్​పడనుంది. రెండు విడుతలు పూర్తి చేసిన బండి ఈనెల 23 నుంచి 20 రోజుల పాటు అంటే జూలై 12వ తేదీ వరకు యాదాద్రి నుంచి వరంగల్ వరకు మూడో విడుత పాదయాత్ర చేపట్టాలని తొలుత నిర్ణయించుకున్నారు. జూలై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలున్న నేపథ్యంలో మూడో విడుత పాదయాత్ర రద్దు చేసుకోనున్నారు. ఈ యాత్ర ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలను 2004 లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. ఈసారి నిర్వహించే సమావేశాలనికి హైదరాబాద్​రెండోసారి వేదిక కానుంది.

https://www.dishadaily.com/political/the-bjp-high-commands-vision-is-here-on-telangana-131143

Wednesday, June 1, 2022

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై!

*తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై!*

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఆరు దశాబ్దాలకు పైగా సాగిన అవిశ్రాంత పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత చేసిన త్యాగాలతో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఉత్సాహంతో, గర్వంతో చేసుకునే వేడుక అన్నారు. రాష్ట్ర అస్థిత్వ పరిరక్షణ, వనరులు, అవకాశాల్లో న్యాయమైన వాటాను విధాన నిర్ణేతలు, నాయకులు, కష్టపడి పనిచేసే ప్రజలు గుర్తించారని అనుకుంటున్నట్టు తెలిపారు.

రాష్ట్ర సాధన తర్వాత ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి, పురోగతి దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందని చెప్పారు. అలుపెరుగని స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి కొనసాగుతూ ఓ శక్తిగా ఎదుగుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా గవర్నర్‌ నివాళులర్పించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మోడీ.. అమిత్ షా!!

*మూడు రోజుల పాటు హైదరాబాద్ లో..... ఉండనున్న  మోడీ....అమిత్ షా*

న్యూఢిల్లీ, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. జులై 3 వ వారంలో 15వ తేదీ తర్వాత ఈ సమావేశాలు ఉండవచ్చని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కూడా పాల్గొంటారు. మూడు రోజుల పాటు మోదీ, షా హైదరాబాద్‌లోనే మకాం వేస్తారని తెలిసింది. 300 నుంచి 500 మంది వరకూ బీజేపీ సీనియర్ నేతలు ఈ సమావేశాలకు హాజరౌతారని భావిస్తున్నారు. హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ సమావేశాలు జరగవచ్చని భావిస్తున్నారు. తాజ్‌కృష్ణాను కూడా బీజేపీ నాయకులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీజేపీ నేతలు తరుణ్‌చుగ్, బీఎల్ సంతోష్ సమావేశాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని తెలిసింది.

link Media ప్రజల పక్షం🖋️