*_ఎస్సీ ఎస్టీ కేసుల కొట్టివేత_*
# స్వాగతించిన అనంచిన్ని వెంకటేశ్వరరావు
# అడ్వకేట్ సంగెం సుధీర్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు
# హైకోర్టు అడ్వకేట్ యల్లంకి పుల్లారావుకు కృతజ్ఞతలు
# ప్రముఖ పాత్రికేయులు రవిప్రకాష్ కు ధన్యవాదాలు
(ఆదిలాబాద్ న్యాయస్థానం నుంచి న్యాయవాద విద్యార్థి శ్రీ విష్ణు శివ పరమాత్మ)
ఆరు సంవత్సరాల క్రితం నాటి నియంత ప్రభుత్వంపై పోరాడుతున్న ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, ఈ దశాబ్ది ఉత్తమ పాత్రికేయ అవార్డు గ్రహీత అనంచిన్ని వెంకటేశ్వరరావుపై సంకసర్ల సువర్ణ అనే మహిళ పెట్టిన రెండు కేసులను ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది.
అసలేం జరిగింది.?:
గత ప్రభుత్వంలోని ఒక బ్యాచ్ తో కుమ్మక్కైన కొందరు అనంచిన్ని వెంకటేశ్వరరావుపై కేసులు పెట్టడంలో తహతహలాడారు. అందుకోసం ఒక మహిళను ఎన్నుకున్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అప్పటికే ఎలాంటి ఆధారాలు లేకుండా రెండు కేసులు పెట్టిన సంకసర్ల సువర్ణచేత సుమారు 50 రోజుల క్రితం వాట్సాప్ లో కులం పేరుతో తిట్టినట్లు కట్టు కథ అల్లారు. అందుకు తోడుగా ఓ ఏడుపు వీడియో కూడా విడదల చేసింది.
రెండో కేసు: ఈ కేసుకు ముందు ఖమ్మంలో వాకింగ్ చేస్తున్న అనంచిన్ని వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఒక్కసారిగా కంగుతిన్న గత ప్రభుత్వం అదే రోజు విడుదల చేసింది.
ఇదీ కుట్ర:
కిడ్నాప్ అనంతరం 4 రోజుల తర్వాత మైలార్ దేవులపల్లిలో పోలీసులు స్వీ మోటో కేసు నమోదు చేయగా.. ఇక్కడ కూడా సంకసర్ల సువర్ణ రంగ ప్రవేశం చేసి అదే రోజు రాత్రి 2వ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సుమారు 40 రోజులు అనంతరం 'నెట్ కాల్' బాగోతానికి తెర లేపింది. అనంచిన్ని వెంకటేశ్వరరావు సెల్ ఫోన్ నెంబర్ కు అసలు నెట్ కాల్ సౌకర్యం లేకపోవడం గమనార్హం.
కోటి రూపాయల కథ - కోర్టులో మరో విధంగా..:
సంకసర్ల సువర్ణ గత ఆరేళ్ళుగా "కోటి రూపాయలు ఇస్తానంటే నేను లొంగలేదని" బొంకుతూ వచ్చింది. తీరా కోర్టులో వాంగ్మూలం ఇస్తూ... 'కోటి రూపాయలకు పరువునష్టం నోటీసు' అంటూ చెప్పడం జరిగింది.
చెల్లితో అక్రమ సంబంధం:
బావమరిది భార్యతో అనంచిన్ని వెంకటేశ్వరరావుకు లింకు పెడుతూ అవాకులు చవాకులు పేలింది. బిడ్డ ఇక్కడ కూడా అడ్డంగా దొరికింది.
బాక్స్:
కోర్టు తీర్పులను స్వాగతించిన అనంచిన్ని వెంకటేశ్వరరావు
ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను తాను స్వాగతిస్తునట్లు అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా కోర్టు వద్ద తనను కలసిన విలేఖరులకు చెప్పారు. ఇక ఇతర కేసుల విషయంలో తన న్యాయవాదులందరూ వేగంగా న్యాయపరమైన పనులు చెపట్టాలని అంతే కాకుండా ఇక నుంచి చిన్న అసంబద్దంగా ఎవరు మాట్లాడినా వెంటనే ఆధారాలతో న్యాయస్థానంలో కేసులు వేయాలని ఆయన కోరారు. 'నాటి ప్రభుత్వానికి ఇది చెప్పు దెబ్బ' అని, ఇక నుంచి అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్, అనంచిన్ని ఫౌండేషన్ లతో కార్యక్రమాలను చేపడతానని, అలాగే పలు ఆర్థిక కార్యక్రమాలను స్వంత ఖర్చులతో చేపడతానని, తనపై పెట్టిన కేసుల వాళ్ళ సంగతి తమ న్యాయవాదులు చూసుకుంటారని ఈ సందర్భంగా చెప్పారు.
బాక్స్:
కృతజ్ఞతలు
తనకు గత ఆరేళ్లుగా న్యాయపరంగా సేవలందించిన అడ్వకేట్ సంగెం సుధీర్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ యల్లంకి పుల్లారావు, సీనియర్ పాత్రికేయులు , అఖిల భారత జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కే.కోటేశ్వర్ రావుకు అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బాక్స్:
ప్రముఖ పాత్రికేయులు రవిప్రకాష్ కు ధన్యవాదాలు
టివి9 వ్యవస్థాపకులు, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, ఆర్టీవి బాధ్యులు రవిప్రకాష్ కు అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన కష్టకాలంలో దేవుడు ఇచ్చిన సోదరుడిలా వెన్నంటి ఉన్నారని, ఆర్థికంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారని, ఆ ఋణం తీర్చుకోలేనిదని ఈ సందర్భంగా అనంచిన్ని వెంకటేశ్వరరావు చెప్పారు.
బాక్స్:
ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ హైదరాబాద్ లలో బాణాసంచాలతో అనంచిన్ని వెంకటేశ్వరరావు అభిమానులు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
బాక్స్:
తనపై కేసులు పెట్టిన వారి వెనుక ఉన్న వెధవలు, సంఘ నాయకుల గురించి స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా చెప్పారు.
No comments:
Post a Comment