*హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం*
*పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు*
బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే, మే 06:
ప్రజావాణికి 4 వారాల పాటు విరామాన్ని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు ప్రకటించారు. వేలాదిగా వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తున్నామని.. మిగిలి ఉన్నవి కూడా క్లియర్ చేసేందుకే 4 వారాలు విరామాన్నిచ్చినట్టు బుధవారం హైడ్రా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి యథావిధిగా హైడ్రా ప్రజావాణి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజావాణితో పాటు.. వివిధ రూపాల్లో వచ్చిన ఫిర్యాదులన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విరామన్ని ప్రకటించినట్టు తెలిపారు. అయితే గతంలో ఇచ్చిన ఫిర్యాదుదారులు అత్యవసరమని భావిస్తే కార్యాలయానికి వచ్చి నేరుగా కలవచ్చన్నారు. అలాగే ముఖ్యమైన సమస్యలున్నా నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.
No comments:
Post a Comment