Sunday, May 31, 2026

పిల్లల ప్రాణాలు గొప్పవా? లేక 179 సంవత్సరాల చరిత్ర గొప్పదా?

*పిల్లల ప్రాణాలు గొప్పవా? లేక 179 సంవత్సరాల చరిత్ర గొప్పదా?*

*అనూరాధ రావు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 30:

179 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నాం,ఇది సంప్రదాయం అని చెప్పుతున్నారు బత్తిన ఫ్యామిలీ.ఇది ఎక్కడ శాస్త్రీయంగా నిరూపించని ప్రసాదం.దీనిలో ఎలాంటి ఔషధ గుణాలు లేవని నిరూపించింది బాలల హక్కుల సంఘం.2013లో- గతంలో దీన్ని చేప మందు అని చేప్పవారు,బాలల హక్కుల సంఘం 2013లో లోకాయుక్త దృష్టికి తీసుకు వచ్చింది.దీనిలో ఎలాంటి మందు / ఔషధం లేదు కేవలం పిండి,పసుపు,నూనె మాత్రమే ఉంది అని లాబరెటరీ పరీక్షల ద్వారా నిరూపించింది.
దీన్ని మందు అనకూడదు ప్రసాదం అనాలి అని జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు తీర్పు ఇచ్చారు.పిల్లలకు WHO సూచించిన మందులనే వాడాలి.పిల్లలపై ప్రయోగాలు చేసే అధికారం ఎవ్వరికి లేదు.ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం.లాలాజలం ద్వారా ఎన్ని రకాల అంటు వ్యాధులు వస్తాయో తెలుసా? ఒకరి నోట్లో పెట్టిన చేయి,ఇంకొకరి నోట్లో పెట్టడం వల్ల అనేక అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.చేపమింగడం చిన్న పిల్లలకు చాలా కష్టం.ఒక్కోసారి శ్వాస ఆగిపోవచ్చు గొంతులో చేప అడ్డుపడి.ప్రతి తల్లి తండ్రి ఆలోచించాల్సిన విషయం.ఇంత వరకు ఆస్తమా తగ్గిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే ఎలాంటి ఇతర ఔషధాలు వాడకుండా, ఒక్క ఫిష్ ప్రసాదం తీసుకుని ఆస్తమా తగ్గిన వారు ఉన్నారా?చేపలోని మెర్క్యురీ, మెటల్స్ చిన్న పిల్లల నాడి వ్యవస్థ పైనా,కిడ్నీ ప్రభావం చూపెడతాయి.పిల్లలకు ఫిష్ ప్రసాదం వేయడం పూర్తిగా  నిషేదించాలి.బత్తిన సోదరులు సైంటిఫిక్గా నిరూపణ చేయ్యాలి.
ప్రభుత్వం మూఢనమ్మకాలను ప్రచారం చేయడం,ప్రోత్సహించడం కరెక్ట్ కాదు.బత్తిన సోదరులు పంపిణీ చేసే ఈ అశాస్త్రీయ ప్రసాదం కోసం ఆరెంజ్మెట్స్ ఆపేయాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్.

No comments:

Post a Comment