*కడపర్తి గ్రామ మహిళ ఆవేదన – నకిరేకల్ సి.ఐ పై కక్షపూరిత చర్యల ఆరోపణలు*
*తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉందా ?*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 22:
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన బెల్లి బద్రమ్మ,భర్త సాయమల్లు కుటుంబ సభ్యులు తమపై నకిరేకల్ సి.ఐ హరిబాబు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర డి.జి.పి, నల్గొండ ఎస్.పీ, డి.ఎస్.పీ అధికారులకు ఫిర్యాదు చేశారు.బద్రమ్మ తెలిపిన వివరాల ప్రకారం,తమ పట్టా భూమిలో ఇప్పటికే మూడు పీట్ల దారి ఇచ్చినప్పటికీ,మరింత దారి ఇవ్వాలని బెల్లి వెంకన్న మరియు వారి కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వివాదంలో ప్రత్యర్థులతో కుమ్మక్కైన నకిరేకల్ సి.ఐ హరిబాబు తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు నెంబర్ 121/2026 నమోదు చేయించారని ఆరోపించారు. అలాగే తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోగా, ఫిర్యాదు రసీదు కూడా ఇవ్వలేదని తెలిపారు.ఈ విషయమై 15-04-2026న రిజిస్టర్ పోస్టు ద్వారా నల్గొండ జిల్లా ఎస్.పీ గారికి ఫిర్యాదు చేసినందుకు కక్ష పెట్టుకొని,తనను ఒక మహిళనని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా తన భర్త సాయమల్లును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, “మీపై ఫిర్యాదు వచ్చింది” అంటూ ఒక రోజు మొత్తం స్టేషన్‌లో కూర్చోబెట్టి, ఫోన్ స్వాధీనం చేసుకొని మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే తొలగించి, తాము ఇచ్చిన ఫిర్యాదుపై చట్టపరమైన కేసు నమోదు చేయాలని,విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన నకిరేకల్ సి.ఐ హరిబాబు మీద శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని బెల్లి బద్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు.
No comments:
Post a Comment