*జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం తీసుకురావొచ్చు కదా - ఆకునూరి మురళి,IAS రిటైర్డ్*
*ట్విట్టర్ వేదికగా సూచనలు చేసిన ఆకునూరి మురళి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 29:
మీ వైపు(ముస్లీములు) నుండి ఇట్లాంటి ప్రతిపాదన రావడం మంచి పరిణామం.మరి అధికార పార్టీ బీజేపీ ఇలాంటి చట్టం (జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం) తీసుకురావొచ్చు కదా.ఇలాంటిదే మైక్ లో రోజు నమాజ్ (Azaan) ను కూడా ఆపేస్తే బెటర్.దీని వలన అందరికి disturbance ముసలి వాళ్లకు,రోగులకు,చంటి పిల్లలకు చాలా disturbance. హిందువులు కూడా గుడులలో రకరకాల పండగలప్పుడు వేడుకల పేరు మీద అర్ధరాత్రి వరకు మైకుల ద్వారా పాటలు పెట్టడం కూడా అందరికి disturbance. అక్కడక్కడా చర్చీలు కూడా మైకులు మొదలు పెట్టిండ్రు. ఇవ్వన్నీ కూడా ఆపేస్తే ఒక మంచి సమాజం ను నిర్మించినట్టు అవుతుంది.మూడు మతాల పెద్దలు కూర్చొని ఈ విషయాల మీద మాట్లాడుకొని ప్రభుత్వాలకు ప్రతిపాదనలు ఇస్తే సమాజం లో మంచి సామరస్య వాతావరణం నెలకొల్పవచ్చు.లేకపోతే రాజకీయ స్వార్ధపరులు మతాలను తమ తమ రాజకీయాలకు వాడుకోడం ఇలాగే నడుస్తుంది .దాని ద్వారా సమాజం నాశనం కావడానికి దారి తీస్తుంది.
No comments:
Post a Comment