Wednesday, May 6, 2026

కొత్త డీజీపీకి బొకే అందిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకులు

*కొత్త డీజీపీకి బొకే అందిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకులు*

*నూతన డీజీపీని కలిసిన ఓయూ విద్యార్ధి నాయకుడు: జి యుగంధర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,మే 06:

తెలంగాణ రాష్ట్ర పోలీస్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ను ఓయూ స్టూడెంట్ లీడర్ జి యుగంధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖను సామర్ధ్యవంతంగా ముందుకు నడిపించాలని కోరారు. ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన సేవలు అం దించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సమస్యల  పరిష్కారంలో పోలీసుల సహకారం అవసరమని క్యాంపస్ లలో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు.నూతన డిజిపి సీవీ ఆనంద్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ స్టూడెంట్ నాయకులు  రమేష్, వెంకట్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment