*మెట్లచిట్టాపూర్ లో కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి*
*జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ (IAS) మరియు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ సానుకూల స్పందన*
బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే, మే 30:
జగిత్యాల జిల్లా,కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం,మెట్పల్లి మండలం,మెట్లచిట్టాపూర్ గ్రామంలో కొద్దిరోజుల క్రితం కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం కోసం,గ్రామానికి చెందిన పలు అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే గారి చొరవతో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ (IAS)ను కలిసిన గీత కార్మిక కుటుంబ సభ్యులు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని అంచనావేసి ఆ నివేదికను ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరుపున సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఈ సందర్బంగా కోరుట్ల ఎమ్ఎల్ఏ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ మెట్లచిట్టాపూర్ గ్రామ అభివృద్ధిలో తాను ఎప్పుడు ముందుంటానని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం కట్టుబడిఉంటానని అన్నారు. నిన్న గ్రామాన్ని సందర్శించి కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం ప్రాంతంను సందర్శించి గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించేలా చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.గ్రామంలో త్రాగునీటి కొరకు మరియు ప్రజా అవసరాల నిమిత్తం బోరు బావులు వేయించడం కోసం,శిథిలావస్థ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణం మరియు అసంపూర్తిగా మిగిలిపోయిన పాఠశాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ కు గ్రామ సర్పంచ్ అరుణ గంగాధర్ విన్నవించగా వారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ద్వారా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
No comments:
Post a Comment