Thursday, May 19, 2022
ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన ఆరోగ్యవంతమైన భారతదేశానికి జీవనాడిగా మారుతోంది.
Wednesday, May 18, 2022
స్టేజీ పైనుండి పడి ఇంటెలిజెన్స్ అధికారి దుర్మరణం.....!
*స్టేజీ పైనుండి పడి ఇంటెలిజెన్స్ అధికారి దుర్మరణం.....!*
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన కోసం ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు స్టేజీపై నుంచి జారిపడి ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.స్థానిక సీఐ రవీంద్ర ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్‌లోని పాట్నాకు చెందిన కుమార్ అమరేష్(51) కోఠిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఐబీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 20న దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పుస్తక ఆవిష్కరణ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా తనిఖీల్లో భాగంగా బుధవారం ఐబీ అధికారులు శిల్పకళా వేదికకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తున్న కుమార్ అమరేష్ స్టేజీపై నుంచి 12 అడుగుల లోతులో ఉన్న మెయింటెనెన్స్ డెక్ మెట్లపై పడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన అతడిని సమీపంలో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.
కోమాలోకి వెళ్లిన ఆయన పరిస్థితి విషమించడంతో సాయంత్రం 7 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బదిలీపై నాలుగు సంవత్సరాల కిందట హైదరాబాద్‌కు వచ్చిన కుమార్ అమరేష్‌కు కొద్ది నెలల క్రితమే డిప్యూటీ డైరెక్టర్ నుంచి అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
link Media ప్రజల పక్షం🖋️
26న హైదరాబాద్ కు.... ప్రధాని మోదీ
*26న హైదరాబాద్ కు.... ప్రధాని మోదీ*
*ఐఎస్‌బీ వార్షికోత్సవానికి హాజరు*
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 26న రాష్ట్ర పర్యటనకు రానున్నారు.హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రధానికి ఘనస్వాగతం పలకడంతో పాటు సీనియర్ నేతలతో భేటీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. అనుమతి కోసం ప్రధానమంత్రి కార్యాలయాని(పీఎంవో)కి సమాచారం పంపించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో బుధవారం చర్చించారు.
బేగంపేటలో పార్టీ నేతలు ప్రధానమంత్రిని కలిసేలా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈనెల 26న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని ప్రధానితో ప్రారంభింపజేసే కార్యక్రమానికి సన్నాహాలు జరిగాయి. అదేవిధంగా హైదరాబాద్ శివారు జినోంవ్యాలీలో నిర్మాణం పూర్తయిన జాతీయ జంతు వనరుల సౌకర్యం, జీవ వైద్య పరిశోధన సంస్థ (నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్)నూ ప్రధాని ప్రారంభించాలని పీఎంఓకు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. ఈ రెండింటిపై స్పష్టత రావాల్సి ఉంది.
అయితే ఐఎస్‌బీ కార్యక్రమం తర్వాత ప్రధాని చెన్నైకి వెళ్తారని భాజపా వర్గాల సమాచారం. సంజయ్ యాత్ర సందర్భంగా సభలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఇప్పుడు ప్రధాని 26న వస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో ముగ్గురు అగ్రనేతల రాష్ట్ర పర్యటనతో కాషాయదళంలో నూతన ఉత్సాహం నెలకొంది.
link Media ప్రజల పక్షం🖋️
హెచ్‌ఎండీఏ పరిధి ఎసైన్డ్ భూముల్లో వెంచర్లు యాదాద్రి భువనగిరి జిల్లాలో
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైన కసరత్తు
ఎన్‌వోసీలపై సంతకాలు చేసిన కొందరు రైతులు
మోహర్‌నగర్ రెవెన్యూ పరిధిలో ఇంకా రాని స్పష్టత
Courtesy by : eenadu.net Media Twitter
బీబీనగర్, భువనగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఎసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించి రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వ్యవసాయ యోగ్యం కాని ఎసైన్డ్ భూములను లే అవుట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి దశలో యాదాద్రి భువనగిరి జిల్లాలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
రైతులకు సర్వహక్కులు
జాతీయ రహదారులు, పట్టణాలకు సమీపంలో ప్లాట్లు, ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ఎసైన్డ్ భూముల్లో వెంచర్లు వేస్తే ప్రభుత్వం, లబ్ధిదారులు లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాంటి చోట్ల ఎసైన్డ్ భూములను లబ్ధిదారుల అంగీకారంతో భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) చేస్తారు. ఆ భూములను ప్లాట్లుగా విభజించి వెంచర్లుగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎసైన్డ్‌దారులకు కొంత స్థలం ఇచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ స్థలంపై రైతుకు సర్వహక్కులు దక్కుతాయని, అందులో ఇల్లు కట్టుకోవచ్చని, లేదంటే అమ్ముకోవచ్చని సర్కారు చెబుతోంది. కొన్నిచోట్ల రైతుల డిమాండ్‌ను బట్టి కొంత ఎక్కువ స్థలాన్ని ఇవ్వాలని భావిస్తోంది.
ఎకరాకు 600 గజాలు
ఎకరా విస్తీర్ణం 4,840 చదరపు అడుగులు ఉంటుంది. ఇందులో 50 శాతం వరకు రోడ్లు, పార్కు ఇతర సౌకర్యాలకు పోతుంది. మిగిలిన 2,420 చదరపు గజాల్లో ఎసైన్డ్ హక్కు కోల్పోయిన రైతులకు గరిష్ఠంగా 600 చదరపు గజాలు ఇచ్చినా 1,820 చదరపు గజాలపై ప్రభుత్వానికి హక్కులు సంక్రమిస్తాయి. ఆ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయిస్తే ఖజానాకు ఆదాయం వస్తుంది.
1000 గజాలు కావాలి
ఇటీవల ఆయా మండలాల్లో తహసీల్దార్ల ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏకు భూములు ఇవ్వడంపై ఎసైన్డ్‌దారుల అభిప్రాయాలు సేకరించారు. అనంతారంలో 28.16 ఎకరాలు, రహీంఖాన్‌గూడలో 62, ఎస్.లింగోటంలోని 30 ఎకరాలకు సంబంధించి రైతులు నిరభ్యంతర పత్రాల(ఎన్‌వోసీ)పై సంతకాలు చేసినట్లు సమాచారం. మోహర్‌నగర్ రెవెన్యూ పరిధిలోని భూములపై ఇంకా స్పష్టత రాలేదని విశ్వసనీయ సమాచారం. తాము ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని, కనీసం ఎకరాకు 800-1000 గజాల (హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన) స్థలం ఇవ్వాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
ఎసైన్డ్ భూములను గుర్తించాం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో మాదిరిగానే వ్యవసాయ యోగ్యం కాని ఎసైన్డ్ భూములను అభివృద్ధి చేసి లేఅవుట్లుగా మార్చి అందులో కొంత స్థలాన్ని లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్ మండలాల్లోని హెచ్‌ఎండీఏ పరిధిలో భూములను గుర్తించే ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వానికి నివేదించాం. మార్గదర్శకాలు రావాల్సి ఉంది.
-శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్, యాదాద్రి భువనగిరి
Tuesday, May 17, 2022
85yr old Vanajeevi Ramaiah, also known as Chetla Ramaiah met with an accident today
సీఎం జగన్ కు థ్యాంక్స్...... నమ్మకాన్ని నిలబెట్టుకుంటా... R కృష్ణయ్య.....!
*సీఎం జగన్ కు థ్యాంక్స్...... నమ్మకాన్ని నిలబెట్టుకుంటా... R కృష్ణయ్య.....!*
తాడేపల్లి: బీసీల మీద సీఎం జగన్ చూపుతున్న ప్రేమను.. మరే సీఎం చూపలేదన్నారు ఆర్ కృష్ణయ్య. రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య స్పందించారు.
మొదట్నుంచీ సీఎం జగన్.. బీసీలంటే బ్యాక్ బోన్ అంటూనే ఉన్నారు. అన్నట్టుగానే బీసీలకి అధిక ప్రాదాన్యత ఇస్తూ వస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి రాజ్యసభ పదవులు కొనే పరిస్థితి వైఎస్సార్‌సీపీలో ఉండదన్న కృష్ణయ్య.. అదే ఉంటే తనలాంటోడు రాజ్యసభకు వెళ్తాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీలోనే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని, సీఎం జగన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆర్ కృష్ణయ్య తెలిపారు.
రాజ్యసభ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకుగానూ ఆర్ కృష్ణయ్య.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభకు పంపుతున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ణతలు తెలియజేసేందుకు వచ్చానని అన్నారు. దశాబ్దాలుగా బీసీ ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం తాను పోరాడుతున్నానని, ఆ అంకిత భావాన్ని గుర్తించి సేవ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారని, బీసీలకు సీఎం జగన్ ఇస్తోన్న ప్రాధాన్యతను చూసి దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు.
తన సేవలను వైస్సార్‌సీపీలో ఉన్న నేతలంతా మనస్పూర్తిగా అంగీకరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. పార్టీ కండువా కప్పుకోపోయినా.. తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లేనని, అలాగే బీసీల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు
link Media ప్రజల పక్షం🖋️
తెలంగాణ హైకోర్ట్ నూతన సీజేగా...... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!
*తెలంగాణ హైకోర్ట్ నూతన సీజేగా...... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!*
దిల్లీ: ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, గువాహటి రాష్ట్రాల హైకోర్టుకు కొత్త సీజేలను నియమించనున్నారు.తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది.
జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు.
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమ్జద్ ఎ.సయీద్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం.ఛాయాను గువాహటి హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్.షిండేను రాజస్థాన్ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.
link Media ప్రజల పక్షం