Sunday, July 3, 2022

రాష్ట్రం అధోగతి పాలు

*రాష్ట్రం అధోగతి పాలు*

హైదరాబాద్‌, ): పచ్చి అబద్ధాలు, మోసంతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగుతోందని, ఈ ఏనిమిదేళ్లలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఇందుకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ పేర్కొంది.గత ఎనిమిదేళ్లలో తెలంగాణ కుటుంబ పాలనలో నలిగిందని, ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, కుటుంబ సభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అక్రమ సంపదను కూడబెట్టారని ఆరోపించింది. టీఆర్‌ఎస్‌ వారసత్వ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారానే ప్రజల ఆకాంక్షలు సాకారమవుతాయని, ఆ ప్రత్యామ్నా యాన్ని బీజేపీ అందిస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ డిక్లరేషన్‌ను.. జాతీయ కార్యవర్గం ఎజెండాలో భాగంగా ఆదివారం జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని భావించి వందలాది మంది యువత ప్రాణత్యాగం చేశారని.. కానీ, ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ము చేసిందని, ఒక కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తుండడం, తెలంగాణ తల్లి బందీ కావడం దురదృష్టకరం అని డిక్లరేషన్‌లో బీజేపీ పేర్కొంది.

తెలంగాణ ఉద్యమం కోసం బీజేపీ ఉద్వేగభరితమైన ప్రజా ఉద్యమా నికి నాయకత్వం వహించిందని, 2014లో రాష్ట్ర ఏర్పాటు కు సహకరించిందని తెలిపింది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా జరిగింది ఏమీ లేదని ధ్వజమెత్తింది. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ పరిస్థితి మరింత దిగజారిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని దుయ్యబట్టింది. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014 మేనిఫెస్టోలో అధికార పార్టీ హామీ ఇచ్చిందని, దానిని అమలు చేయడంలో విఫలమైందని డిక్లరేషన్‌లో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాల్లో నేడు 70ు అధ్యాపక పదవులు ఖాళీగా ఉన్నాయని.. పరిశోధన, అభివృద్థి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను విడుదల చేయడం లేదని తెలిపింది. పాఠశాల విద్య పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించింది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొంది.

ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..

తెలంగాణ ఏర్పాటైనప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండేదని.. నేడు అప్పులపాలయిందని, కాళేశ్వరం నిధుల దుర్విని యోగంపై ఆరోపణలు వస్తున్నాయని, రూ.40 వేల కోట్ల నుంచి రూ. 1.30 లక్షల కోట్ల వరకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని బీజేపీ తన డిక్లరేషన్‌లో పేర్కొంది. ఈ ప్రాజె క్టును సాకుగా చూపి, మిగిలిన ప్రాజెక్టులను నిర్లక్ష్యానికి గురిచేశారని, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పాలమూరు- రంగా రెడ్డి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించింది. నెట్టెంపాడు, డిండి తదితర ప్రాజెక్టుల పరిస్థితీ ఇలాగే ఉందని పేర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని, అధికార పార్టీ నాయకులు, వారి భాగస్వాము లు, వారి తోబుట్టువులు దారుణమైన నేరాలకు పాల్పడు తున్నా చర్యలు తీసుకోవట్లేదని మండిపడింది.

ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టిస్తు న్నారని, ఎమ్మెల్యే పిల్లలు కీచకులుగా మారారని ఆరోపించింది. సరైన నిఘా లేకపోవడంతో డ్రగ్స్‌ సంస్కృతి కొనసాగుతోందని.. బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద తెలంగాణలో అత్యధిక కేసులు నమోదయ్యాయని గుర్తుచేసింది. రైతులకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందట్లేదని.. రైతు బంధు పేరుతో ఇతర సబ్సిడీలను ఎత్తివేశారని విమర్శించింది. రాష్ట్ర అభివృద్థికి కేంద్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నప్పటికీ.. అవినీతి కారణంగా రాష్ట్రంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మండిప డింది. కాంగ్రెస్‌ హయాంలో మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 2015లో తాము తిరిగి తెరిపించామని, జాతీయ రహదారులను పొడిగించామని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల 340 కిలోమీటర్ల పొడవునా రూ.8 వేల కోట్లతో రీజనల్‌ రింగ్‌ రోడ్డును నిర్మించాలని నిర్ణయించామని డిక్లరేషన్‌లో పేర్కొంది.

బీజేపీ బలపడుతోంది..

2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము నాలుగు సీట్లు గెలిచామని.. తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించామని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లను గెలుచుకుందని.. తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ భవితవ్యాన్ని ఖరారు చేసిందని బీజేపీ తన డిక్లరేషన్‌లో పేర్కొంది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరుల్లో కని పిస్తున్న నిరుత్సాహన్ని చూస్తే రాష్ట్రంలో బీజేపీ బల పడుతోందన్న విషయం స్పష్టమవుతోందని తెలిపింది. అనంతరం ఈ డిక్లరేషన్‌పై పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వ నియంతృత్వ పోకడలతో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్‌ ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థాగతంగా బీజేపీ బలోపేతానికి ఈటల కొన్ని సూచనలు చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.

link Media ప్రజల పక్షం🖋️ 

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ....!

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ....!

హైదరాబాద్‌: బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.సభా వేదికపైకి చేరుకోగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మోదీ భుజం​ తట్టి అభినందించారు. బీజేపీ శ్రేణులతో పరేడ్‌ గ్రౌండ్స్‌ కిక్కిరిసిపోయింది.

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోంది. మీరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. హైదరాబాద్‌కు ప్రతిభకు పట్టం కడుతుంది. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది
*తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తి...*
తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ. భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జోగులాంబ అమ్మవారు, వరంగల్‌ భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాకతీయులు వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పది. ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. తెలంగాణలో కలలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయి. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది.

*బలహీన వర్గాల కోసం బీజేపీ*
బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోంది. సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ కోసం పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాం. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశాం.

*కరోనా సమయంలో తెలంగాణకు ఎంతో చేశాం*
2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరింది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా పనిచేశాం. ఉచిత రేషన్‌, ఉచిత వ్యాక్సిన్‌ అందించాం. తెలంగాణ ప్రజల్లో బీజేపీ నమ్మకం పెరుగుతోంది.

హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. బయోమెడికల్‌ సైన్సెస్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలుగులో టెక్నాలజీ, మెడికల్‌ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి.

link Media ప్రజల పక్షం🖋️ 

Saturday, July 2, 2022

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న..... యోగి ఆదిత్యనాథ్

*భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న..... యోగి ఆదిత్యనాథ్*

హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దర్శించుకున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన యోగి..
పాతబస్తీకి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యూపీ సీఎం స్వయంగా హారతిచ్చారు.

తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు యోగి ఆదిత్యనాథ్‌ వెంట ఉన్నారు. యూపీ సీఎం పర్యటన నేపథ్యంలో చార్మినార్‌ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పలు చోట్ల కేంద్ర బలగాలను కూడా మోహరించారు.

link Media ప్రజల పక్షం🖋️

బీజేపీ రూ.20 లక్షలు.... TRS కు 3లక్షలు....ఫ్లెక్సీలకు ఈవీడీఎం

*బీజేపీ రూ.20 లక్షలు.... TRS కు 3లక్షలు....*

*ఫ్లెక్సీలకు జరిమానాలు విధించిన ఈవీడీఎం*

హైదరాబాద్‌: జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో భాజపా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు మద్దతు తెలుపుతూ తెరాస నేతలు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లు ఏర్పాటు చేశారు.వీటిపై శనివారం సాయంత్రం వరకూ భాజపా నేతలకు రూ.20 లక్షలు, తెరాస నాయకులకు రూ.3 లక్షల మేర జరిమానాలు విధించినట్లు జీహెచ్‌ఎంసీకి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) డైరెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు. నగరవ్యాప్తంగా మెట్రో రైలు స్తంభాలపై రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్‌ పరిధి చైతన్యపురి ప్రాంతంలో ఆయా ఫ్లెక్సీలపై.. సికింద్రాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న విజయ సంకల్ప సభ ఫ్లెక్సీలను భాజపా నేతలు అతికించడం గమనార్హం.

link Media ప్రజల పక్షం🖋️ 

విశ్వబ్రాహ్మణుల ను కించపరిచేలా మాట్లాడలేదు, : మంత్రి కేటీఆర్

*విశ్వబ్రాహ్మణుల ను  కించపరిచేలా మాట్లాడలేదు, : మంత్రి కేటీఆర్*

హైదరాబాద్ : విశ్వబ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్న వార్తలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారుమొన్న జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన సందర్భంగా.. విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలే కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కులాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదు అని తేల్చిచెప్పారు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఉద్దేశించి అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటని ఉపసంహరించుకుంటున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

మోదీ మరో 20 ఏళ్లపాటు పాలన అందించాలి.... కార్యవర్గ భేటీలో నేతల అభిప్రాయం

*మోదీ మరో 20 ఏళ్లపాటు పాలన అందించాలి.... కార్యవర్గ భేటీలో  నేతల అభిప్రాయం*

హైదరాబాద్‌: హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియాకు వెల్లడించారు.దేశంలో పేదల అభ్యున్నతి, మహిళా సాధికారిత, స్వతంత్రతను మన స్వాతంత్ర్య సమరయోధులు ఆశించారని.. ఇవాళ భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇలాంటి అంశాలపైనే చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాజిక భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలపై చర్చించిన కార్యవర్గం.. ప్రజల ఆర్థిక స్వావలంభన దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు నడ్డా గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రపంచానికి, దేశ ప్రజలకు భారత్‌ అందించిన సేవలు అసమానమైనవని ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ.. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మూను ఎంపిక చేయడం పార్టీ తీసుకున్న మరో కీలక నిర్ణయమన్నారు.

విపక్ష పార్టీలు అవినీతి అక్రమాల్లో మునిగి ఉంటే.. సమాజ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుపై గట్టిగా నిలబడిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు నడ్డా తన ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు. రెండు కళ్ల విధానాలు దేశంలో చెల్లవని కార్యవర్గ సమావేశంలో చర్చించారు. బెంగాల్‌, కేరళలో కార్యకర్తలను చంపుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కార్యవర్గం.. వారి సేవలను జ్ఞప్తికి తెచ్చుకుని నివాళులర్పించింది. దేశ వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై కృషిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతిపక్షాలు మోదీపై ఉన్న వ్యతిరేకతను దేశ ప్రజలకు నష్టం కలిగించేలా ఉపయోగించుకుంటున్నాయని కార్యవర్గం అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్రమోదీ 8ఏళ్ల పాటు కాదు.. మరో 20ఏళ్ల పాటు పాలన అందించాలని కోరుకుంటున్నామని పలువురు నేతలు అభిప్రాయపడ్డారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ''ప్రధానిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించకుండా కేసీఆర్‌ రాజకీయ మర్యాదను మర్చిపోయారు. రాజ్యాంగ పరంగా, రాజకీయంగా, సంస్కృతి పరంగా ఆయన ఉల్లంఘించారు. కేసీఆర్ వ్యక్తిని అవమానించలేదు... ప్రధాని పదవిని అవమానించారు'' స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.

link Media ప్రజల పక్షం🖋️

Friday, July 1, 2022

removal of all encroachments and dredging of landfills inside the two dam-reservoirs

Notice served by: Adv Palle Pradeep Kumar Reddy
Petitioned by: Dr Lubna Sarwath, WICCI State President, Water Resources Council, Telangana-Hyderabad

Hyderabad 1 July 2022

NOTICE(as attached) has been served to the following, under Dam Safety Act 2021 to take immediate 'remedial measures'(Sec. 4(v)) in order to remove the 'distress condition'(Sec. 4(i)) as duly applicable for safety and health of Osman Sagar Dam-Reservoir on Moosa river and Himayath Sagar Dam-Reservoir on Esa river(tributary to Moosa river):
1- National Committee on Dam Safety/Central Water Commission, 3rd Floor (South) , Sewa Bhawan ,
R.K. Puram, Sector-1, New Delhi – 110066


2- The Managing Director, Hyderabad Metropolitan Water and Sewerage Board, Administrative Office Building Khairatabad, Hyderabad – 500004

3- The Chief Secretary, Government of Telangana, Telangana Secretariat 5th Floor, Burgula Rama Krishna Rao Bhavan, NH 44, Hill Fort, Adarsh Nagar, Hyderabad, 500063

Notice for action on representation of 30 june 2022 for:

1- restoration of GO Ms 111 dated 8.3.1996 under which industries and constructions were prohibited in 10kms buffer zone , as also ordered by Supreme Court in Supreme Court vide its orders dated 27.1.1999 and 22.12.2000, in CASE NOs: Appeal (civil) 368-371 of 1999 Appeal (civil) 372 of 1999 Appeal (civil) 373 of 1999; and,

2- removal of all encroachments and dredging of landfills inside the two dam-reservoirs viz., Osman Sagar and Himayath Sagar;
best

Dr Lubna Sarwath, WICCI State President, Water Resources Council, Telangana-Hyderabad

mobile: 9963002403; email: sarwath.lubna@gmail.com

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

‪On Thu, Jun 30, 2022 at 6:16 PM Lubna Sarwath لبنى ثروة లుబ్న సర్వత్ लुब्ना सर्वत <sarwath.lubna@gmail.com> wrote:‬
secy-cwc@nic.in, grievance-cwc@nic.in, egovhelpdesk-cwc@nic.in , memberdr-cwc@nic.in  cedams@nic.in  dir-drip-cwc@nic.in

Hyderabad 30 June 2022

To

The Chairperson/Chairman

National Committee on Dam Safety/Central Water Commission

3rd Floor (South) , Sewa Bhawan ,
R.K. Puram, Sector-1
New Delhi – 110066

Dear Chairperson, National Committee on Dam Safety,

Sub: Osman Sagar Dam-Reservoir & Himayath Sagar Dam-Reservoir, Rajendranagar, RR District, Hyderabad-Telangana

Please find enclosed the following:

Enclosure 1- Representation to the National Committee on Dam Safety dated 30 june 2022;

Enclosure 2- Map 1:Osman Sagar FTL map dated 4.12.2019;

Enclosure 3- Map 2: Osman Sagar FTL map dated 8.6.2013;

Enclosure 4- Map 3: Osman Sagar FTL map dated 18.9.2020;

Enclosure 5- Map 4: Himayath Sagar FTL map dated 18.6.2013;

Enclosure 6-Map 5: Himayath Sagar FTL map dated 18.9.2020;

Enclosure 7- Representation to MD,Hyderabad Metropolitan Water andSewerage Board dated 28.7.2021;

We submit that any further information or documents that we may have pertaining to this matter can be promptly produced to the Committee.

best

Dr Lubna Sarwath

WICCI State President-Telangana
Hyderabad
mobile: 9963002403
email: sarwath.lubna@gmail.com
Dr Lubna Sarwath, PhD(Indonesia), i-WIL(IIM-B)
former Visiting Lecturer, Trisakti University, Jakarta, Indonesia