Wednesday, April 9, 2025

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా కూడా సేవలందిస్తున్న మన తెలుగు జర్నలిస్టులకు అవార్డులు

*జర్నలిస్టుల పండుగకు ఆహ్వానం*

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరిగే అతిపెద్ద వేడుక. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి తెలుగు జర్నలిస్టులందరూ ఒకచోట చేరుకునే వేదిక. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా... నిజమైన సారధిగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా కూడా సేవలందిస్తున్న మన తెలుగు జర్నలిస్టులను గుర్తించి గౌరవించాలని *తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం*  ప్రతీ ఏటా ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రదానోత్సవానికి సంకల్పించింది. ఈ ఏడాది విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 12వ తారీఖున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జర్నలిస్టులు అందరూ ఒకచోట కలుసుకునే వేదిక  ప్రత్యేకంగా ఉండదు. కనుక ఈ వేడుకను కుటుంబ సమేతంగా హాజరై *జర్నలిస్టుల పండుగ* లా జరుపుకోవాలని భావిస్తున్నాము. 

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన *మహోన్నత వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు* ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావడం.. మనందరికీ గర్వకారణం. అదేవిధంగా మన *సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు* విశిష్ట అతిథిగా...,  *సమాజానికి మన వంతు ఏదైనా చేయాలని నిత్యం పలు రకాల సేవా కార్యక్రమాలతో కలియుగ దానకర్ణుడుగా కీర్తి పొందిన, ముఖ్యంగా జీతాలు లేని జర్నలిస్టుల గాధలు తెలిసిన నిజమైన సమాజ సేవకులు ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుత రావు గారు* గౌరవ అతిథిగా.., తండ్రికి తగ్గ తనయుడు, వెండితెరపై తన నటనతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంటున్న  *యంగ్ అండ్ డైనమిక్ హీరో కంచర్ల ఉపేంద్ర బాబు* గారు, ప్రపంచంలో ఆకలితో ఏ ఒక్కరూ బాధపడకూడదు అని *కొన్ని దశాబ్దాలుగా నిత్యాన్నదానం* చేస్తున్న సమాజ సేవకులు  ఏఏబిఎస్ టిఏ దర్బార్ –జంపని వ్యవస్థాపకులు అతా ముహమ్మద్ నిజాముద్దీన్ నిజామి షా  తాజ్ ఖాదరీ (*అతా నిజాం బాబా* ) గారు, *ఆత్మహత్యలు లేని ప్రపంచాన్ని చూడాలనుకునే మహోన్నత లక్ష్యం* తో నిత్యం సమాజాన్ని చైతన్యపరిచే ఈదా స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ *శ్రీ శామ్యూల్ రెడ్డి* గారు, సేవే లక్ష్యం – సేవే మార్గం అనే మదర్ థెరిస్సా అడుగు జాడల్లో .. మెగాస్టార్ చిరంజీవి ఆశయ సాధనలో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించే అఖండ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ *విన్నకోట సురేష్ గారు*, పేదలకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వారి విద్యకు, ఆరోగ్యానికి ఆర్థిక చేయూతనందిస్తున్న ఏపీఆర్డి ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ *కుమారి సగం శిల్పా ప్రియాంక* గారు ... ఆత్మీయ అతిథులుగా హాజరవుతున్నారు. *వందమంది అక్షర యోధులకు గౌరవం లభించే ఈ గొప్ప వేడుకకు* సంఘాలకు, వర్గాలకు తావు లేకుండా *మనమంతా తెలుగు జర్నలిస్టులుగా హాజరై అందరూ కలిసి* ఈ వేడుకను పండుగల జరుపుకుందాం. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే వేడుక సాయంత్రం వరకు జరుగుతుంది. ఉదయం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆదర్శవంతమైన జర్నలిస్టుల గురించి ప్రసంగాలు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం యొక్క విధి విధానాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు వంటి అంశాలపై ప్రసంగాలు ఉంటాయి. అనంతరం అతిధుల చేతుల మీదుగా ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు అందజేయబడతాయి. కావున మీరు మీ కుటుంబ సభ్యులతో కలిపి ఈ కార్యక్రమానికి రండి. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి.. మీకు తెలిసిన మన జర్నలిస్టు మిత్రులను కూడా ఆహ్వానించండి. అందరికీ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాము. ఉదయం టిఫిన్ దగ్గర నుండి మధ్యాహ్నం మంచి విందు... తోపాటు సాయంత్రం టీ/ కాఫీలు ఉంటాయి. కాబట్టి అందరూ ఎక్కువమంది వచ్చేలా మీ వంతుగా ప్రయత్నం చేయండి. 

ధన్యవాదాలతో....
*మేడవరపు రంగనాయకులు*
వ్యవస్థాపక అధ్యక్షులు
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం.
9866444489, 7036602022.

మరియు రాష్ట్ర కార్యవర్గం,  ఆహ్వాన కమిటీ.


*గమనిక* : 
స్టేజ్ పైన ఎల్ఈడి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నాం. జర్నలిస్టులకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే వీడియో లు తీసుకుని రండి. అందరికీ చూపిద్దాం.

No comments:

Post a Comment