Saturday, April 12, 2025

జర్నలిజంకు వన్నె తెచ్చిన బాపట్ల కృష్ణమోహన్


*_సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ చేతుల మీదుగా  ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ను అందుకున్న బాపట్ల కృష్ణమోహన్ (ప్రజా సంకల్పం) పుష్పలత తో ఈ అవార్డును తీసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ జర్నలిస్టు అవార్డును తీసుకోవడంతో నాపై ఇంకా బాధ్యత పెరిగిందని సమాజంలో ఉన్నది ఉన్నట్టుగా జర్నలిస్టు మాట్లాడిన దినపత్రికల్లో రాసిన కొంతమందికి నచ్చడం లేదని అయినా కూడా సమాజ శ్రేయస్సు కై జర్నలిస్టు పాత్ర కఠినమైన, ఉన్నది ఉన్నట్టుగానే రాయడం మాట్లాడడం జర్నలిస్టు యొక్క నైజం అని ఈ సందర్భంగా అన్నారు._*

***-----***-----***-----***-----***-----***-----***
PRESS NOTE:

నిజాయితీ, నిష్పాక్షికంగా వార్తలు రాయాలి

+ బాధ్యతతో కూడిన జర్నలిజం చేయాలి 

+ నమ్మకం పోతే గౌరవం సమాజంలో ఉండదు

+ జర్నలిస్ట్ లు సంఘటితం కావాలి

సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ 

విజయవాడలో ఉత్తమ జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారాల ప్రధానం

ఏ వార్త అయినా నిజాయితీతో రాయాలని, వార్త నిష్పాక్షికంగా ఉండాలని, విలేకరులు 
బాధ్యతతో కూడిన జర్నలిజం చేయాలని 
సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మల పల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో జరిగిన జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారాల ప్రధాన కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 
మాట్లాడుతూ ఏ వృత్తి,  ఉద్యోగం అయినా గౌరవం ఉండాలన్నారు. వృత్తి పట్ల ఎంత నిబంధ్దతతో పని చేస్తున్నామో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. విలేకరులు సమాజ హితం కోసం ఉపయోగ పడే వార్తలు రాయాలని సూచించారు. నిజం లేని వార్తలు రాస్తే  సమాజంలో గుర్తింపు ఉండదన్నారు. హక్కుల గురించి అడిగే టపుడు బాధ్యతలు గుర్తించాలలని ఉద్బోధించారు. విలేకరులు వార్తలో వాడే భాష గౌరవంగా, హుందా తనంగా ఉండాలని చెప్పారు. తెలుగు జర్నలిస్ట్ లు అందరికీ అర్థం అయ్యేలా భాష వాడకన్నారు. టీ వీ చానల్స్ వచ్చాక ఊహా జనిత వార్తలు ఎక్కువ వస్తున్నాయన్నారు. ఇది మంచి పద్దతి కాదనీ,  క్వాలిటీ వార్త లు  రాసే జర్నలిస్ట్ లు పెరగాలన్నారు. ఆయా రంగాల జర్నలిస్ట్ లు సంబంధిత అంశాలపై  సంపూర్ణ అవగాహన పెంచుకున్నా తర్వాతే రంగంలో దిగాలన్నారు. 

99 శాతం మంది జర్నలిస్ట్ లు ఉండేందుకు ఇల్లు లేక పిల్లల్ని చదివించ లేక ఇబ్బంది పడుతున్నారన్నారు.
కొద్ది మంది జర్నలిస్ట్ లకు ఎక్కువ సంఘాలు అవసరం లేదన్నారు.  సంఘటిత శక్తి గా ఉంటేనే హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. 
జర్నలిస్ట్ సంఖ్య ను నియంత్రించాల్సి అవసరం ఉందనీ,  వృత్తి నైపుణ్యం పెంచేందుకు జర్నలిస్ట్ లకు ప్రతి ఏటా శిక్షణ అవసరం అన్నారు.  వినోదం, విజ్ఞానం, అందించాల్సి జర్నలిస్ట్ ల సంఖ్య ఎంత పెరిగిందో... విమర్శలు కూడా అంతే పెరిగాయన్నారు. 

నేను జర్నలిస్టునే 

తాను కూడా న్యాయవాద వృత్తిలోకి రాకముందు 
మొదట ఉద్యోగం జర్నలిస్ట్ గానే పని చేశాననీ సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. తాను వార్త పత్రికలకు వ్యాసాలు రాసేవాడిననీ ఆ క్రమంలో ఈనాడు లో సబ్ ఎడిటర్ గా పని చేయాలని ఆఫీస్ కు వెళ్ళానని చెప్పారు. ఇంటర్వ్యూ కు అటెండ్ అయితే  వ్యాసాలు నువ్వే రాశావా? అని అడిగారని, తానే రాశానని చెబితే...  డెస్క్ లో కాకుండా రిపోర్టింగ్ అవకాశం ఇచ్చారన్నారు. కొంతకాలం  విజయవాడ సిటీ లో జర్నలిస్ట్ గా పని చేశాననిగుర్తు చేశారు. అప్పట్లో కొద్ది మంది మాత్రమే జర్నలిస్ట్ లు ఉండేవారు. ఇపుడు చాలా పెరిగారన్నారు. అప్పట్లో ఎక్కడికి వెళ్లినా చాలా మర్యాద చేసేవారని, చాలా గొప్పగా గర్వంగా ఉండేదన్నారు. ప్రముఖ  సంఘ సేవకులు ఆదం నిజాం బాబా మాట్లాడుతూ సమాజంలో రియల్ హీరో లు జర్నలిస్టు లు, వారిని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి చేతుల మీదుగా గౌరవించడం గొప్పవిషయమన్నారు. 
స్పందన ఈద ఫౌండేషన్  ఇంటర్నేషనల్ చైర్మెన్ ఈద శ్యామ్యూల్ రెడ్డి  మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో  జర్నలిస్ట్ ల మీద గురుతర బాధ్యత ఉంది. టీ జే ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు మాట్లాడుతూ 
జర్నలిస్ట్ కార్పొరేషన్ , 
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో  తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://www.facebook.com/share/p/1BN26fbQog/ 

No comments:

Post a Comment