Monday, April 21, 2025

లగచర్ల గిరిజన రైతులను హింసించిన రేవంత్ సర్కార్..

లగచర్ల గిరిజన రైతులను హింసించిన రేవంత్ సర్కార్.. స్పష్టం చేసిన మానవ హక్కుల కమీషన్ రిపోర్ట్.

లగచర్ల గిరిజనులను పోలీస్ స్టేషన్‌లో రేవంత్ సర్కార్ హింసించిందని జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC) ఇచ్చిన రిపోర్ట్‌లో స్పష్టమయ్యింది.

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన రైతులపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసింది.

పోలీసులు గిరిజనుల ఇళ్ళల్లోకి చొరబడి మరీ దౌర్జన్యం చేసి అరెస్టులు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో.. లగచర్ల ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన నిజమేనని కమీషన్ తాజాగా తన నివేదికలో తెలిపింది.

ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు రాజకీయ కక్షతో వ్యవహరించారని కూడా కమీషన్ పేర్కొంది.

ఏ కాంగ్రెస్ కార్యకర్తపై కేసు నమోదు కాలేదు, అరెస్టులు కూడా జరగలేదని తెలిపింది.

పోలీసులు తమను వేధించారని లగచర్ల గిరిజన మహిళలు మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం కమీషన్ ఒక బృందాన్ని పంపింది.

రాత్రిపూట అరెస్ట్ చేసిన లగచర్ల గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్‌లో చితకబాది, మేజిస్ట్రేట్ ముందు వాటి గురించి మాట్లాడవద్దని బెదిరించారని నివేదికలో స్పష్టం చేసింది.

అరెస్టు చేసిన గ్రామస్తులను పోలీస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నప్పటికి, జనరల్ డైరీలో ఈ విషయం ప్రస్తావించబడలేదు అని పేర్కొంది.

నిరసన స్థలంలో లేని అనేక మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని కూడా దర్యాప్తులో వెల్లడైంది.

లగచర్ల గిరిజన రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది.

లగచర్ల రైతులకు మద్దతుగా నిలిచిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని సుమారు 40 రోజుల పాటు రేవంత్ సర్కార్ జైల్లో వేసింది.

కేటీఆర్‌తో పాటు లగచర్ల బాధిత మహిళలు ఢిల్లీ వరకు వెళ్లి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్, మానవ హక్కుల కమీషన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.

భూములు కాపాడుకోవడానికి పోరాడుతున్న తమ కుటుంబసభ్యులను ఏ విధంగా చితహింసలు పెట్టి జైల్లో వేశారో వారు కమీషన్ సభ్యులకు వివరించారు.

కాంగ్రెస్ సర్కార్ దమనకాండకు వ్యతిరేకంగా కొట్లాడి గెలిచిన లగచర్ల గిరిజన రైతుల పోరాటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. భవిష్యత్ పోరాటాలకు స్పూర్తిదాయకంగా నిలిచింది.

Courtesy / Source by : @MissionTG 

No comments:

Post a Comment