Sunday, June 30, 2024

_# ఫేక్ ప్రచారంపై ఫిర్యాదు: టిజేఎస్ఎస్_

*_R Tvపై కుట్రలు ఎందుకు ర్రా.!_*
_# ఏం నీచపు బతుకుల్రా మీవి.!_
_# ఎలాంటి దాడులు లేవు_
_# నిబద్దతతో ముందుకు వెళుతున్నాం_
_# అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టిన యాజమాన్యం_
_# ఫేక్ ప్రచారంపై ఫిర్యాదు: టిజేఎస్ఎస్_
_# తీవ్రంగా ఖండించిన ఏఐడబ్ల్యూజెఎఫ్ కె.కోటేశ్వర్ రావు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు మ, 9440000009)_

*_సుప్రబాతం, అవుట్ లుక్ పత్రికలతో సుమారు  40 ఏళ్ళ క్రితం పాత్రికేయ ప్రస్థానం మొదలెట్టిన ఓ తెలుగు నవ యువకుడు దేశ డిజిటల్ మీడియా రంగాన్ని శాసించే స్థాయికి వెళ్ళాడు. టివి9 వ్యవస్థాపక సిఈఓ గా విశ్వరూపాన్ని చూపిన రవిప్రకాశ్ పై జరగని కుట్ర దాడులు లేవు. మెగా రూపంలో టివి9ని కబళించిన హస్తాలే మళ్ళీ రవిప్రకాశ్ పై కొత్త కుట్రలకు 'తెర' లేపాయి. ఏం నీచపు బతుకుల్రా మీవి._* 

*_సన్నాసుల పని:_*
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా 'ఆర్ టివి' పేరుతో ఒక్క ఉదుటున సంచలనాలకు తెరలేపింది. ఈ ప్రగతిని ఊహించని 'సన్నాసి' నాయాళ్ళు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రవిప్రకాశ్ స్థాపించిన మరో డిజిటల్ మీడియా ఆర్ టీవీపై దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఈ విషయాన్ని ఆర్ టివి యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.

*_అసలేం జరిగింది.?:_*
ఆర్ టివి అనే డిజిటల్ మీడియా ఛానల్ ఏర్పాటు చేసిన రవి ప్రకాష్.. ఇప్పుడిప్పుడే ఆ ఛానల్ ప్రజల్లోకి బలంగా దూసుకెళుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూటమి అధికారంలోకి రాబోతుందని సుధీర్ఘ కసరత్తుల అనంతరం చెప్పారు రవి ప్రకాష్. అప్పట్లోనే ఆయనపై ముప్పేట విమర్శలు ప్రారంభమయ్యాయి. కానీ ఆయన చెప్పినట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆర్ టి.వి ఫేమ్ ఒక్కసారిగా పెరిగింది.

*_ఇదో అబద్దపు ప్రచారం:_*
అయితే ఉన్నట్టుండి ఆర్ టివి కార్యాలయంపై ఈడీ దాడి చేసినట్లు ఓ ఫేక్  ప్రచారానికి కొందరు తెర లేపారు. ఇదంతా ఒట్టిదేనని తేలింది. ఇదే విషయం ఆ యాజమాన్యం కూడా స్పష్టం చేసింది. తమ సంస్థ నిజాయితీ, నిబద్దలతో ముందుకు వెళుతుందని, కొద్ది నెలలలోనే డిజిటల్ మీడియా రంగంలో మొదటి స్థానంతో పాటు, సురక్షితమైన స్థానంలో ఉన్నట్లు వారు తెలిపారు.

*_ఫేక్ ప్రచారంపై ఫిర్యాదు: టిజేఎస్ఎస్_*
డిజిటల్ మీడియా రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న ఆర్ టివి పై జరుగుతున్న ఫేక్ ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీవ్రంగా స్పందించింది. అబద్దపు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైం పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆ సంఘ ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ తెలిపారు.

*_తీవ్రంగా ఖండించిన ఏఐడబ్ల్యూజెఎఫ్ కె.కోటేశ్వర్ రావు_*
రవిప్రకాశ్ ఆద్వర్యంలో నిజాయితీగా నిర్వహిస్తున్న ఆర్ టివి డిజిటల్ మీడియాపై వస్తున్న ఫేక్ ప్రచారంపై ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు కే.కోటేశ్వర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ విషంయంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు వెనుకాడబోమని ఆయన తీవ్ర స్వరంతో చెప్పారు.

No comments:

Post a Comment