Monday, June 24, 2024

స్వరూపానంద 'హవా' 'సాము'లోరి చూపు 'ఒడిశా'పై సరదాగా అక్కడ ఓ 'కర్చీఫ్'

*_'ఒడిశా'లో శారదా కన్ను_*
_◆ భూములపై 'స్వరూప' ఆపేక్ష_
_◆ నాటి ఒడిశా మంత్రితో ముచ్చట్లు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శారదాపీఠం. స్వరూపానంద స్వామి కష్టంతో 'ఫ్రీ'గా వస్తున్న 'ఆర్థిక' వేగంతో.. దూకుడుగా నాడు వేగంగా దూసుకెళ్ళింది. నాడు తెలుగు రాష్ట్రాల్లో స్వరూపానంద 'హవా' నడిచింది. ఇక ఆ 'సాము'లోరి చూపు పక్కనే ఉన్న 'ఒడిశా'పై పడింది. సరదాగా అక్కడ ఓ 'కర్చీఫ్' ముందుగానే వేశారు. నాటి ఒడిశా మంత్రి శారదా పీఠానికి 'అత్యంత రహస్యం'గా విచ్చేశారు. అక్కడ ఏం జరిగింది.? ఆ రహస్య భేటీలో ఎవరు..? ఏం మాట్లాడుకున్నారు..?అత్యంత రహస్యంగా జరిగిన ఆ భేటీలో ఏం జరిగింది..? 'దీక్ష' పాఠకుల కోసం అందిస్తున్న సంచలన పరిశోధన కథనం._*

*ఒడిశా 'భూ కథ' నిజమే..!:*
రాబోయే రోజుల్లో ఒడిశాలో శారదాపీఠం సేవలు విస్తరించేందుకు 'స్థలం' కోసం నాటి ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబా కిశోర్‌దాస్‌ తో శారదాపీఠం అధిపతి భేటీ అయ్యారు. ఒడిశాలో శారదాపీఠం ఆధ్యాత్మిక సేవలు, హైందవ ప్రచారాన్ని విస్తృతంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా అక్కడి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది . బట్ 'వర్కవుట్' కాలేదు. అందుకోసం శారదా పీఠాధిపతులు నాటి ఒడిశా మంత్రులతో గత కొద్దిరోజులు సంప్రదింపులు జరిపారు.

*నాటి ఇద్దరు సీఎంల భక్తిని... పిండుకునే పనిలో స్వరూపానంద..!? ఇదో లొల్లి:*
మనసొస్తే మల్లి, లేకపోతే ఎల్లి..! కేసీఆర్, జగన్ లు అంతే. ఆ క్షణాన 'ప్రేమ' పుడితే అలుముకుంటారు. ఎక్కడో 'సందేహం' తలెత్తితే ఆమడల దూరం పెట్టేసి.. నెట్టేస్తారు. పక్కా ఉద్వేగ ఆధారితం. అంతే తప్ప ఏ లెక్కాపత్రం ఉండదు. ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు పరిపూర్ణానంద ఇంటికి వెళ్లి, కాళ్ల మీద పడి, ఆశీస్సులు తీసుకుని, అవసరమైతే 'భూమి సాయం చేస్తాను' అని హామీ ఇచ్చాడు అప్పట్లో కేసీఆర్. తరువాత అతనిపైనే బోలెడంత కోపం వచ్చింది, ఓ దశలో ఏకంగా నగరబహిష్కారం.! మరీ అవసరమైతే అరదండాలు కూడా వేయించటానికి రెడీ…! మరి తన కాళ్ల మీద పడినప్పుడు ‘నేను ఎలాంటి వ్యక్తి కాళ్లు మొక్కుతున్నాను’ అని ఎందుకు ఆలోచించలేదు..? సేమ్, చినజియ్యర్… తననైతే నెత్తి మీదే పెట్టుకున్నాడు. యాదాద్రి అప్పగించాడు. వందల కోట్ల రామానుజ ఆశ్రమానికి సపోర్ట్ చేశాడు. చినజియ్యర్ ఏది చెబితే అది… అలాంటిది చినజియ్యర్‌ తో కొంతకాలంగా అంతంతమాత్రమే సంబంధాలు… ఆ విధేయత, ఆ భక్తి, ఆ గురి ఇప్పుడు విశాఖ స్వరూపానందపై కుదిరింది… ఎందుకు..? తెలియదు..!

*స్వయంగా పట్టా చేత పట్టుకొని మరీ..:*
తన చుట్టూ తిరుగుతూ, తన క్షేమాన్ని కాంక్షిస్తూ, కొన్నేళ్లుగా తనతో ఉన్న తెలంగాణ స్వాములు, ఆశ్రమాలు తనకు పట్టవు. పరప్రాంత స్వాములయితే ఎనలేని భక్తి, గురి, ప్రేమ… స్వాములకు ప్రాంతీయ బేధాలేమిటి..? ఉండొద్దు… కానీ ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 'రెండు ఎకరాల అత్యంత విలువైన భూమిని' ఉత్త పుణ్యానికి ఓ స్వామికి ఇస్తూ, తనే స్వయంగా పట్టాకాగితాల్ని తీసుకుపోయి అప్పగించడం అనూహ్యం… అసాధారణం… వైపరీత్యం… మరి కేసీఆర్‌ కు సదరు స్వామి చేసింది ఏముంది..? ఏమీ లేదు…! ఏమీ ఉండలేదు కూడా…! 'రాజశ్యామల యాగం' అని పైకి ఓ సాకు… ఆ పూజను ఓ సాధారణ పూజారి కూడా చేయించగలడు… అంతకుమించిన పెద్ద పూజలు, హోమాలు ఈ స్వరూపానందుడి వల్ల అయ్యే పనికాదు… ఏ అయుత చండీయాగమో చేయాలంటే ఈ పరిపూర్ణుడి పీఠానికి చేతకాదు, మళ్లీ శృంగేరీ వంటి పీఠం సహకరించాల్సిందే…! పోనీ, ఈయన పీఠానికి ఏమైనా సుదీర్ఘ, చారిత్రక గురుపరంపర ఉందా..? లేదు..! మరి ఈ రెండెకరాలూ ఎందుకు రాసిచ్చేసినట్టు… అంతే మరి… కేసీఆర్ ప్రేమలోని తిక్కకు చాలాసార్లు లెక్కే ఉండదు… (ఇప్పుడు ఈ భూకేటాయింపుపై కేసు ఒకటి హైకోర్టులో ఉంది…) 

*ఇది మరీ ఎక్స్‌ట్రీమ్… :*
అసలు స్వాములు ఎవరినీ తమను తాకనివ్వరు. ఈయన ఏకంగా జగన్‌ను పట్టుకుని, కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకుని, నానా హంగామా క్రియేట్ చేశాడు. పైగా జగన్ అంటే తనకు పిచ్చి ప్రేమ అనీ, తన అధికారపీఠం కోసం బోలెడు పూజలు చేశాననీ ఓ డొల్ల ప్రకటన జారీ చేశాడు. ఈ సర్వసంగ పరిత్యాగ స్వాములకు హైప్రొఫైల్ నాయకులు, వ్యాపారులపైన మాత్రమే ఆ 'ప్రేమ' దేనికట.! అయినా జగన్ జైలుకు వెళ్లినప్పుడు, జగన్ 2014లో అధికారసాధనలో ఫ్లాపయినప్పుడు ఈ పూజలు పునస్కారాలు ఫలించలేదు దేనికో మరి..? ఆశ్రమంలో నిర్దిష్ట తంతు ద్వారా జరగాల్సిన తన ఉత్తరాధికారి వారస ప్రకటనను అమరావతిలో ఎంత ఆడంబరంగా, అట్టహాసంగా నిర్వహించాడో గతంలో చూశాం కదా…!

*నాడు 'బంగారు చిలక' బయటకు ఎలా వచ్చింది:*
ఈ సాములోరికి టీటీడీ ఎంత దాసోహం అంటున్నదీ అంటే…? తిరుమలలో ధనుర్మాసం తిరుప్పావై పాశురాలు ఉంటయ్. మూలవిరాట్టు శంఖం ఎడమచేయి వద్ద ప్రతిరోజూ గోదాదేవి స్మారకంగా ఓ ధనుర్మాస బంగారు చిలుకను అలంకరిస్తారు. ఆకులతో చేస్తారు… దాన్ని గర్భగుడి దాటించి, ఏడు కొండలూ దింపి, అలిపిరి దాకా తీసుకొచ్చి మరీ స్వరూపుడికి ఇచ్చారు. అంతా వాళ్ల ఇష్టం… అవసరమైతే ఉత్సవమూర్తినే అలిపిరి దాకా తీసుకొచ్చి స్వాగతం పలికించినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.

*చివరిగా..*
వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలో చెప్పిందే..
"ధర్మో రక్షతి రక్షితః" జరుగుతుంది.

*_కొసమెరుపు:_*
ఈ ఒడిశా భూముల విషయం కూడా త్రిశంఖు స్వర్గంలో ఉంది. మధ్యలో చంద్రబాబు రావడంతో ఈ స్వామీజీ నాలుక మడతపడింది.

No comments:

Post a Comment