Thursday, June 20, 2024

_# సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న వార్తకు అక్షర రూపం_

*_రజనీకాంత్.. రచ్చ రంభోల_*
_# బుక్  చేసిన స్పెషల్ ఫ్లైట్_
_# ఎన్ని ప్లాట్లో..._
_# సజ్జలతో సయ్యాటలు_
_# సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న వార్తకు అక్షర రూపం_
_# అంతా అబద్దం: రజనీకాంత్_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు)_

*_రవిప్రకాశ్ నీడన ఎదిగి.. ఛాన్స్ దొరకగానే ఆయన గొంతు చటుక్కున కొరికి... ఓ బాస్ గా మారాడు. ఏకంగా ఓ ప్రైవేట్ ఫ్లైట్ బుక్ చేసుకునేంత ఎ'దిగాడు'. జర్నలిస్ట్ ముసుగులో దందాలకు తెగబడ్డాడని ఆరోపణలు. అలా.ఇలా.. సరదాగా కోట్లు పోగేశాడని, ఆయనకు ఆదాయపన్ను శాఖ తాఖీదులు ఇచ్చిందని బుధవారం సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేసింది. దానికి అక్షర రూపమే ఈ కథనం. ఆయన ఈ విషయాలను ఖండిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు._*

*_ఇలా మొదలెట్టి..:_*
ఇన్నాళ్లు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజినీకాంత్ కు ఐటీ శాఖ నోటీసులు పంపింది.. కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డుల్లోకి ఎక్కిన రజినీకాంత్ ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు. ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి.. ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

*_ఏం కొనేశాడు రా బాబూ..:_*
మరోవైపు ఇటీవలే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో 11కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఫ్లాట్, మోకిలాలో రూ.8కోట్లతో కొన్న విల్లా, మియాపూర్ లో కొన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వీటన్నింటిపైనా ఆరా తీస్తున్నారు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు.. వీటితో పాటు బెంగళూరులో రజినీకాంత్ కు సంబంధించిన ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కంపెనీపైనా ఇటీవలే ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. నెల్లూరు చెందిన కిషోర్ అనే వ్యక్తితో కలిసి గత ఎనిమిదేళ్లుగా ప్రీమియర్ ఇన్ ఫ్రా కంపెనీని నడుపుతున్న రజినీకాంత్.. ఈ సంస్థ బెంగళూరు శివార్లలో అనేక వెంచర్లు వేసింది. అయితే కంపెనీలో ఎక్కడా తన పేరు రాకుండా బినామీలతో నడుపుతున్నాడు రజినీకాంత్. అటు అమరావతిలో చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రజినీకాంత్ భూముల రేట్లు అమాంతం పెరిగాయి. గతంలో అమరావతిలోని కృష్ణాయపాలెంలో కొనుగోలు చేసిన 18ఎకరాల భూమికి సంబంధించి సీఆర్డీయే నుంచి తిరిగి రావాల్సిన ఫ్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ అసలు విషయం బయటపడింది.

*_ఈ పబ్బు కూడా..:_*
సీఆర్డీయే నుంచి సమాచారం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు చేరినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ రోడ్ నంబర్ 36లో నడుస్తున్న పబ్బులోనూ రజినీకాంత్ కు వాటా ఉంది. జగన్ ప్రభుత్వం దిగిపోయేముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్ లో మరో పబ్బు స్టార్ట్ చేశాడు.. అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన కోట్లాదిరూపాయలను క్యాష్ రూపంలోనే తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు రజినీకాంత్.

*_సజ్జలతో సయ్యాటలు:_*
మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా ఇన్ చార్జ్ సజ్జలభార్గవ్ రెడ్డితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలను వైసీపీకి అనుకూలంగా పని చేసేలా కాంటాక్ట్ కుదుర్చింది రజినీకాంత్. అయితే ఆ డిజిటల్ ఛానెల్స్, పత్రికలన్నింటికీ పేమెంట్ ఇంకా పెండింగ్ ఉంది. పార్టీ ఓడిపోయింది కాబట్టి పెండింగ్ ఎమౌంట్ ఏదీ ఇప్పించలేనంటూ చేతులెత్తేశాడు రజినీకాంత్. అటు సజ్జల భార్గవ్ రెడ్డి అటు ఐప్యాక్ సిబ్బందికి, సోషల్ మీడియా సిబ్బందికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఆపేశాడు. రజినీకాంత్, సజ్జల భార్గవ్ రెడ్డి కలిసి తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కాజేశారని డిజిటల్ ఛానెల్స్ వాళ్లు ఆరోపిస్తున్నారు.

*_ఎన్నికల్లో ఎంత వాటానో..:_*
మరోవైపు అటు తెలంగాణ ఎన్నికల్లో ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల ఇంటర్ వ్యూల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేశాడు రజినీకాంత్. ఒక్కో లీడర్ నుంచి పదిలక్షల నుంచి పాతికలక్షల వరకూ మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో కోట్లాదిరూపాయలు వసూలు చేశాడు. వాస్తవానికి ఛానెల్ మార్కెటింగ్ టీమ్ తరఫున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్లతో డైరెక్టుగా మాట్లాడి మొత్తం నొక్కేశాడు. ఇందుకు తన బినామీ అయిన ధర్మారెడ్డి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగాయి. ధర్నారెడ్డి, రజినీకాంత్ ఇద్దరూ కలిసి కాజేసిన మొత్తం మీద అటు మైహోమ్ యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది. కంపెనీకి యాడ్ రెవెన్యూ ఎందుకు రాలేదని మార్కెటింగ్ హెడ్. విచారణ జరిపితే ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో ఈ విషయాన్ని మేనేజ్ మెంట్ కు తెలిసింది. రజినీ మెడకు మరో తల నొప్పి చుట్టుకుందట. మొత్తం మీద ఒక్క పార్టీ అధికారంలో కోల్పోవడంతో రజినీకాంత్ కు కష్టాలు చుట్టముట్టాయి. రవిప్రకాశ్ పాపం తగిలింది.

*_అంతా అబద్దం: రజనీకాంత్_*
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ తప్పని, రజనీకాంత్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

No comments:

Post a Comment