Saturday, June 22, 2024

#తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం చెరువులను పరిరక్షిస్తుందా?

గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం 282 చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయని రిమోట్ సెన్సింగ్ డేటాను బట్టి వెల్లడైంది. మరో 209 చెరువులు, కుంటలు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయని తేలింది. గ్రేటర్, ఔట‌‌ర్ ప‌‌రిధిలోని చెరువులు, కుంట‌‌ల‌‌పై సంబంధిత అధికారుల‌‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డాక్టర్ అంబేద్కర్ స‌‌చివాల‌‌యంలో శుక్రవారం రివ్యూ చేశారు. 

2014 నుంచి 2023 వ‌‌ర‌‌కూ ఆక్రమ‌‌ణ‌‌ల‌‌కు గురైన చెరువులు, కుంట‌‌లకు సంబంధించి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌‌న్ సెంట‌‌ర్ (టీజీఆర్ఏసీ) ఇచ్చిన నివేదికపై సమావేశంలో విశ్లేషించారు. దీంతో గ్రేట‌‌ర్ హైద‌‌రాబాద్ ప‌‌రిధిలో 2014కు ముందు 417 చెరువులు, కుంట‌‌లు ఉండగా.. వాటిలో182 చెరువులు, కుంట‌‌లు పూర్తిగా ఆక్రమణలకు గురైనట్లు వెల్లడైంది. మ‌‌రో 76 చెరువులు, కుంట‌‌లు పాక్షికంగా కబ్జాలకు గురైన‌‌ట్లు టీజీఆర్ఏసీ త‌‌న నివేదికలో స్పష్టం చేసింది. 

గ్రేట‌‌ర్ నుంచి ఔట‌‌ర్ రింగ్ రోడ్ ప‌‌రిధిలో మొత్తంగా 503 చెరువులు, కుంట‌‌లు ఉండ‌‌గా.. వాటిలో 62 చెరువులు పూర్తిగా ఆక్రమ‌‌ణ‌‌ల‌‌కు గుర‌‌య్యాయి. మ‌‌రో 102 చెరువులు, కుంట‌‌లు పాక్షికంగా కబ్జాల‌‌కు గుర‌‌య్యాయి. అలాగే 2014 నుంచి 2023 వ‌‌ర‌‌కూ గ్రేట‌‌ర్ లోని 417 చెరువుల‌‌కు గాను 11 చెరువులు పూర్తిగా, మ‌‌రో 7 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గుర‌‌య్యాయి. ఇక గ్రేట‌‌ర్ నుంచి ఔట‌‌ర్ ప‌‌రిధిలో గల 503  చెరువులలో  27  చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురికాగా మ‌‌రో 24 చెరువులు పాక్షికంగా కబ్జా అయినట్లు తేలింది.

 ఇలా గ్రేట‌‌ర్, ఔట‌‌ర్ ప‌‌రిధిలో మొత్తం 920  చెరువులు, కుంటలకుగాను 282 పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. మ‌‌రో 209 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయినట్లు ఆయా సంవత్సరాల శాటిలైట్ ఇమేజెస్, సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ లు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా తేలింది. కాగా, చెరువులు, కుంట‌‌లు ఆక్రమ‌‌ణల‌‌కు సంబంధించిన టోపోషీట్ ల‌‌ను, శాటిలై  ట్ ఇమేజెస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప‌‌రిశీలించారు. ఈ ఆక్రమ‌‌ణ‌‌ల‌‌పై స‌‌మగ్ర క్షేత్ర స్థాయి సర్వే నిర్వహిస్తామని, చెరువులను పూర్వ స్థితికి పునరుద్ధరించడానికి చర్యలు చేపడతామని చెప్పారు.

Courtesy / Source by : V6 వెలుగు మీడియా 

No comments:

Post a Comment