Wednesday, June 26, 2024

*నాణ్యమైన డిగ్రీ విద్యకు షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి*

*నాణ్యమైన డిగ్రీ విద్యకు షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి*  

 *షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్ రెడ్డి* 

బాలానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సపాల్ అంజన్ కుమార్ తో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అందిస్తున్న విద్యా వివరాల పోస్టర్ ఆవిష్కరణ.

విద్యతో పాటు అన్ని రకాల నైపుణ్యాలు అందించేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్ రెడ్డి.

ప్రభుత్వ విద్యాలయాలు పటిష్టమైన , స్థిరమైన మేధస్సుకు కేంద్రాలు బాలానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సపాల్ అంజన్ కుమార్, ఈ సంవత్సరం డిగ్రీ లో చేరడానికి దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈరోజు షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రవీందర్ రెడ్డి బాలానగర్ లోని ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులను కళాశాలలో ప్రిన్సిపాల్ అంజన్ కుమార్ తో కలిసి సెకండ్ యియర్ ఐపోయిన విద్యార్థులతో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి చెప్పడం జరిగింది.  అక్కడ అధ్యాపకులతో కలిసి డిగ్రీ కళాశాలకు సంబంధించిన వివరాలతో కూడి ఉన్న కరపత్రం తో  ప్రచారం నిర్వహించారు. అలాగే ఔట్ గోయింగ్ విద్యార్ధుల ఇంటికి వెళ్లి డిగ్రీ కళాశాల గురించి చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల  గురించి చెప్తూ ఈ సంవత్సరం ఆధునిక సౌకర్యాలు కలిగిన సొంత భవనంలోడిగ్రీ కళాశాల పూర్తి స్థాయిలో నడుస్తుందని అలాగే ఈ సంవత్సరం జనవరిలో నాక్ బి ప్లస్ గ్రేడ్ సాధించిందని, అత్యాధునిక  కంప్యూటర్ ల్యాబ్ తో పాటు ప్రొజెక్టర్ల తో బోధన కొనసాగుతుందని, లైవ్ పాఠాలు చెప్పడానికి టీవీల సౌకర్యం కూడా కళాశాలలో ఉందని వివిధ సబ్జెక్టులలో ఎంఫిల్ ,పిహెచ్ డి లాంటి అత్యున్నత విద్యార్హతలు కలిగిన లెక్చరర్లు షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నారని తెలిపారు. పాఠాలతో పాటు పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులను ప్రిపేర్ చేసే బోధన సాగుతుందని ఈ నేపథ్యంలోనే కళాశాల నుండి ఎంతోమంది ఆర్మీలో, పోలీసు ఉద్యోగాలు సాధించారని, ఎన్ .ఎస్. ఎస్ ద్వారా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో క్యాంపులకు, పోటీలకు ఈ కళాశాల నుంచి వెళ్తున్నారని తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ లలో ప్రవేశాలు జరుగుతున్నాయని, మూడవ ఫేస్ దోస్తు నోటిఫికేషన్ అందుబాటులో ఉన్న సందర్భంగా విద్యార్థులు షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యాన్ని ఇచ్చి ఎంచుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ  కార్యక్రమంలో బాలానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు చంద్రకాంత్, వినోద్ కుమార్ తో పాటు ఇతర అధ్యాపకులు,  ఔట్ గోయింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Courtesy / Source by :
ప్రజల పక్షం 

No comments:

Post a Comment