వర్షాకాల నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలి.
👉 మీ వాహనాల టైర్ల గ్రిప్ /థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోండి. టైర్ల గ్రిప్ బాలేకపోతే వెంటనే మార్చుకోండి. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.
👉 వర్షం కురుస్తున్నపుడు పరిమిత వేగంతో ప్రయాణించటం ఎల్లవేళలా మంచిది.
👉 మీ వాహన ఇంజిన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. బ్రేక్స్ పాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయించండి.
👉 ఎప్పుడైనా అవసరం వస్తే మీ వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోండి.
👉 అత్యవసర సమయాల్లో #Dial100 కి కాల్ చేసేలా మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోండి.
మీ మరియు మీ కుటుంబభద్రత దృష్ట్యాఈ సూచనలు ఎంతో మంచివి.
#RoadSafetyTips #Monsoon2024 #Dial100
Courtesy / Source by : https://x.com/TelanganaDGP/status/1800020380037652788?t=7TtVD0_EjSQUCTC5bqCeSA&s=19
No comments:
Post a Comment