Saturday, March 9, 2024

అన్నదాతలకు శాపంగా మారిన కందుకూరు రెవిన్యూ కార్యాలయం

కందుకూరు మండల కార్యాలయం ఆర్డీవో కార్యాలయం తేదీ 9-3-2024నాడు తాళాలతో దర్శనం.
ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు యంఆర్ఓ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవాలని వచ్చిన రైతులు నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు నేను బి వెంకట్ రెడ్డి కందుకూరు గ్రామం కందుకూరు మండలము కందుకూరు విశ్రాంత ఉపాధ్యాయుడిని హైదరాబాద్ నుండి వెళ్ళి తాళాలు చూసి నిరాశగా వెనుదిరి వెళ్లుచుండగా కార్యాలయం వెనుకాల నుండి ఇద్దరు సిబ్బంది రావడం గమనించి అటువైపు వెళ్ళి చూడగా చిన్న తలుపు తెరిచి ఉంది లోపలికి వెల్లడానికి ప్రయత్నించగా యం ఆర్ ఓ గారి డ్రైవర్ ఈరోజు రెండవ శనివారము ఆఫీస్ లేదని లోపలికి వెల్లడానికి వీలు లేదని చెప్పారు కాని రూములు తెరిచి ఉండటం గమనించి లోపలికి వెళ్లి చూడగా యంఆర్ఓ గారు ఉన్నారు వారివద్దకు మెల్లగా వెళ్ళాను.నా సమస్య గురించి చెపుతుండగా నిర్లక్ష్యంగా ఇంతకాలం ఏం చేశావు అని అసహనం వ్యక్తం చేసాడు.అసలు సమస్యే తెలుసుకోకుండా ఇంతకాలం ఏం చేశావు అని ఎందుకు అన్నారో నాకు అర్ధం కాలేదు అప్పుడు నేను ఒక్కటే చెప్పాలనుకున్న ప్రభుత్వం మారింది కనుక వచ్చిన అని ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు. ఇలాంటి అధికారుల తీరు అన్నదాతలకు శాపంగా మారుతోంది కనుక ఇలాంటి అధికారుల పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సత్వరం చర్యలు తీసుకోవాలని ఒక రైతుగా మరియు విశ్రాంత ఉపాధ్యాయుడిగా మిమ్మల్ని కోరుతున్నాను.

ఇట్లు :
బి. వెంకటరెడ్డి 

No comments:

Post a Comment