Tuesday, March 5, 2024

చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంటిలిజెన్స్ అధికారి సస్పెండ్

*కలవర పెడుతున్న ఎస్ఐబీ డిఎస్పీ Praneeth రావు వ్యవహారం.*
*చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంటిలిజెన్స్ అధికారి సస్పెండ్*.
*బీఆర్ఎస్ ప్రభుత్వంలో మావోయిస్ట్స్ అంటూ  ప్రతిపక్షాల ఫోన్స్ టాప్ చేసిన ప్రవీణ్ రావు*. 
*అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అదేశాలతోనే చట్టవిరుద్ద పనులు*.
*టెర్రరిస్టుల లిస్టులో  ఆయా నెంబర్స్  చేర్చడం పై సిరియస్* . ?
*2015లో ఫోన్ టాపింగ్ పై హైకోర్టులో విచారణ*
*కేసీఆర్ నీచమైన వ్యవహారాల పై కాంగ్రెస్ ఫోకస్*.
*కుటుంబ సభ్యులతో  ఫర్సనల్ గా మాట్లాడినా తెలుసుకున్నారు*.
*ఏ చాటింగ్ యాప్ లో చాట్ చేసినా అన్ని విషయాలు ఎస్ఐబీ చేతిలోనే* ?
*సెంట్రల్ హోం శాఖను తప్పుదారి పట్టించిన ప్రభాకర్ రావు అండ్ టీం*
*ఆ చట్టం మిస్ యూజ్ చేస్తే కఠిన శిక్షలు*. 
*నిజాం రాజును మించిన నిర్బందం కొనసాగించిన కేసీఆర్.*? 
*విచ్చల విడి ప్రచ్ఛండ ప్రభాకర్ రావు పై*
*ల్యాండ్స్ అండ్ రికార్డ్స్  స్పెషల్ స్టోరీ*. 

బీఆర్ఎస్ పాలనలో చట్టానికి విరుద్దంగా ఎలాంటి పనులైనా చిటికలో చేశారు. ఆనాటి ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా, ఏ ఆప్ లో చాట్ చేసినా ఇట్లే ఫోన్ టాప్ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారు. వారి వీక్ నెస్ తెలుసుకుని పార్టీలోకి వలసల పర్వం కొనసాగించారు. ఇదంతా అప్పటి ఇంటలిజెన్స్ ఐజీ, రిటైర్డ్ ఆఫీసర్ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అధ్వర్యంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరి అరాచకాలు ఒక్కొక్కటి భయటపడుతున్నాయి. 

ప్రయివేట్ సైన్యం నడిపించారు. 

బీహార్ రాష్ట్రంలో అనాధికార వ్యవహారాలు నడిపించినట్లు.. బీహార్ కి చెందిన అల్ ఇండియా  అధికారులు, బీఆర్ఎస్ పార్టీని నడిపించారని అరోపణలు ఉన్నాయి. అందుకు అప్పటి  సీఎం కి చెందిన సామాజిక వర్గాన్ని గ్రిప్ లో ఉంచుకున్నారు. సీఎంఓలో పని చేసే వారితో పాటు ఇంటలిజెన్స్ లో పని చేసేవారు ఉన్నారు . అందుకు ప్రభాకర్ రావు పదవి కాలం ముగిసినా కొనసాగించి అత్యంత కీలకమైన ఎస్ఐబీ అప్పగించారు. ఇది మావోయిస్టుల కదలికల పై దృష్టి పెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ . కాని ఈ పేరుతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతల ఫోన్స్ టాప్ చేశారు. నిజాం రాజు కంటే అత్యంత కఠినంగా నిర్బయించారు. రాత్రికి రాత్రి తలుపు బద్దలు కొట్టి తీసుకెళ్లారు. అదే కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయివేట్ చాట్ కూడా తెలుసుకున్నారు. చట్టం వారి చుట్టంగా మలుచుకుని ఇష్టానుసారంగా వ్యవహారించారు. అయితే ఈ ఫోన్ టాపింగ్ నే నమ్ముకున్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆరాచాకాలకు తెర లేపింది. సెంట్రల్ యాక్ట్ కి విరుద్దంగా వ్యవహారించారు. ప్రతిపక్షాల ఫోన్ నెంబర్స్  మావోయిస్టుల అనుచరుల పోన్ నెంబర్స్ గా చేర్చి మరి ఫోన్ టాపింగ్ చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు, ఆనాటి ప్రభాకర్ రావు ఇరుకున పడే అవకాశాలు ఉన్నాయి. అందుకు మొదటి అడుగే పోలీస్ చరిత్రలో ఓ ఇంటలిజెన్స్ అధికారి సస్పెండ్‌ వ్యవహారం.   

Courtesy / Source By :
Devender Reddy 
*9848070809*
https://www.landsandrecords.com/news-details.php?nid=76

No comments:

Post a Comment