BRS ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మరో బిగ్ షాక్.. అక్రమ కట్టడాల కూల్చివేత (వీడియో) BRS ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మరో బిగ్ షాక్.. అక్రమ కట్టడాల కూల్చివేత (వీడియో) by Disha Web Desk 4 7 Mar 2024 9:37 AM దిశ, కుత్బుల్లాపూర్/ దుండిగల్ : మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమాలపై కలెక్టర్ కొరడా ఝలిపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారం అండ చూసుకుని చెరువును పూడ్చి కళాశాల కోసం అప్పటి మంత్రి మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ బిల్డింగ్ నిర్మించారు. ఈ విషయంపై పౌర ఫిర్యాదుల మేరకు ‘దిశ’లో పలు మార్లు పత్రిక కథనాలు సైతం వెలువడ్డాయి. పత్రిక కథనాలు, ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలపై కన్నెర్ర చేశారు. దుండిగల్‌లోని చిన్న దామెర చెరువును కబ్జా చేస్తూ నిర్మించిన ఇంజనీరింగ్ కళాశాల భవనంను కూల్చివేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోత్రు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. Also Read - BRSకు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి! దీంతో గురువారం తెల్లవారుజామునుండే ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు రంగంలోకి దిగి నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భారీ భవంతిని నేలమట్టం చేస్తున్నారు. కళాశాల భవనం కూల్చివేతల సందర్బంగా దుండిగల్ ఎస్‌హెచ్‌ఓ శంకరయ్య ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రతను కల్పించారు. మీడియా ప్రతినిధులు, ఇతరులు ఎవ్వరు పోలీస్ వలయంలోకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుని అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను దుండిగల్ తహసీల్దార్ సయ్యద్ తమర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. Also Read - కాంగ్రెస్‌లో చేరుతా.. కుండబద్ధలు కొట్టిన BRS మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చిన్నదామెర చెరువు చెరకు మోక్షం... దుండిగల్ గండిమైసమ్మ మండలం దుండిగల్ గ్రామ సర్వే నంబర్స్ 405,482,484,485,488,492,506 లలో చెరువు మొత్తం విస్తీర్ణం ఎకరాలు 123.5 గుంటలు లో చెరువు ఉండేది. ఆ చెరువు లోని ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ స్థలాలను ఆక్రమించి అధికారం మాదే కదా మమ్మల్ని అడిగే వాడెవ్వడు అనే ధీమాతో మాజీ మంత్రి అల్లుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్జాగా చెరువును చెరబట్టి ఐదు అంతస్తుల భారీ భవంతిని నిర్మించాడు. ప్రస్తుతం చెరువు కబ్జాల కట్టడాలను అధికారులు తొలగిస్తుండడంతో ఈ చెరువు చెరకు మోక్షం లభిస్తుంది. కళాశాల విద్యార్థులతో భవనం కూల్చివేతను అడ్డుకునేందుకు కుటిలయత్నం... Also Read - ఆ విషయం తేల్చి చెప్పాలని.. కేసీఆర్‌కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల లేఖ పోలీస్‌లతో కళాశాల ప్రిన్సిపాల్ వాగ్వివాదం చెరువును కబ్జా చేస్తూ నిర్మించిన భవనం కూల్చివేతలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాశాల విద్యార్థులను ఉసిగొల్పి అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు కళాశాల యాజమాన్యం తీవ్ర ప్రయత్నం చేసింది. కూల్చివేతల సందర్బంగా భద్రత కల్పిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో కళాశాల ప్రిన్సిపాల్ వాగ్వివాదానికి దిగి అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసులు ప్రిన్సిపాల్‌ను, కళాశాల సిబ్బందిని అదుపులోకి తీసుకొని కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు
Courtesy / Source by :
https://www.dishadaily.com/telangana/another-big-shock-for-brs-mla-marri-rajasekhar-reddy-demolition-of-illegal-buildings-video-306056
No comments:
Post a Comment