ఉద్యోగుల డీఏ చెల్లింపుతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి @revanth_anumula తెలిపారు. ఆదివారం ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. "మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. నిర్భంధాలతో పాలన కొనసాగిస్తామనుకోవడం భ్రమ, మా ప్రజా ప్రభుత్వం చర్చలు, సంప్రదంపులకు అవకాశం కల్పిస్తుంది. మీలో విశ్వాసం కల్పించడానికే చర్చలు జరిపాం" అని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం ఆయా సంఘాలతో చర్చలు, సంప్రదింపుల తర్వాతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ కార్మిక సంఘాల పోరాటాలతోనే సిద్దించింది. తామే సాధించామని ఏ ఒక్క రాజకీయ పార్టీ చెప్పుకున్నా అది అసంబద్ధమే అవుతుంది. మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు చెల్లించినా ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదు. వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం. 11 వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసాం. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం. 95 శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. @Min_SridharBabu #TelanganaGovernment #EmployeeUnions
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1766895472499953958?t=qqw1rrMRS6nk9pDG8w4PBw&s=19
No comments:
Post a Comment