Tuesday, March 12, 2024

మహిళల భద్రత కోసం..T-SAFE

మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే T-SAFE ను ముఖ్యమంత్రి @revanth_anumula  మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. T-SAFE పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో T-SAFE యాప్‌ రూపొందించినట్టు పోలీసులు వివరించారు.
@mpponguleti @Tummala_INC @seethakkaMLA @KMuraliSurekha  @TelanganaCS @TelanganaDGP @Shikhagoel_IPS
#TelanganaPolice #WomenSafetyWing #TSAFE

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1767504890136498385?t=ZHtn7fcwPMEujNagqARg7g&s=19

No comments:

Post a Comment