Friday, November 4, 2022
విద్యాశాఖలో ‘స్మార్ట్ క్లాస్’ స్కాం
మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
*సోమవారానికి వాయిదా వేసిన హైకోర్ట్*
మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.హైదరాబాద్: మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రిప్లై ఇచ్చేందుకు ప్రతివాదులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టుకు సమర్పించిన వీడియో క్లిప్పింగ్స్‌ను అనుమతించాలని హైకోర్టు రిజిస్ట్రీకి న్యాయస్థానం ఆదేశించింది.
*సుజీవన్ వావిలాల🖋️*
Thursday, November 3, 2022
మునుగోడు ఎన్నికలు - ఎలక్షన్ అధికారులు
Wednesday, November 2, 2022
అతి మంచితనమే అతగాడి బలహీనత
టెన్త్ పరీక్షల్లో కీలక మార్పులు.. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు
*టెన్త్ పరీక్షల్లో కీలక మార్పులు.. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు*
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యా శాఖ కీలక మార్పులు చేసింది. పది వార్షిక పరీక్షలను ఇకపై ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీదేవసేన వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరు పేపర్ల నిబంధన అమల్లోకి వస్తుందని.. ఈ మేరకు జిల్లాల డీఈవోలు, విద్యా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్‌మెంట్-2(ఎస్‌ఏ-2) పరీక్షలు కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇప్పటివరకు పదో తరగతిలో 11పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. ద్వితీయ భాష మినహా ప్రథమ, తృతీయ భాష, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలు రెండు పేపర్లుగా విద్యార్థులు రాస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి బోధన జరగకపోవడంతో గతేడాది ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. 11 పేపర్లు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని.. 6 పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్‌సీఈఆర్‌టీ) విద్యా శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఎస్‌సీఈఆర్‌టీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన విద్యా శాఖ ఆరు పేపర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
ఓ తెలంగాణ తల్లి కానరాని లోకాలకు తరలిపోయింది.
Tuesday, November 1, 2022
ర్యాగింగ్ పేరుతో సీనియర్ల నరకం....34మంది విద్యార్థుల సస్పెన్షన్
*ర్యాగింగ్ పేరుతో సీనియర్ల నరకం....34మంది విద్యార్థుల సస్పెన్షన్*
హైదరాబాద్: ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించి ఎన్నో కొంగొత్త ఆశలతో పశువైద్య డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్ విద్యార్థులకు సీనియర్లు ర్యాగింగ్ పేరుతో నరకం చూపించారు.ఈ వేధింపులకు పాల్పడిన 34 మంది విద్యార్థులను తరగతులు, హాస్టళ్ల నుంచి పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం తాజాగా సస్పెండ్ చేసింది. వీరిలో 25 మందిని తరగతులు, హాస్టళ్ల నుంచి... మరో 9 మందిని హాస్టళ్ల నుంచి, వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధించింది.
రాజేంద్రనగర్‌లోని వర్సిటీ క్యాంపస్ కాలేజీలో పశువైద్య డిగ్రీ(బీవీఎస్సీ) కోర్సు రెండో, నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ 34 మంది ఇటీవల కొత్తగా చేరిన జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో నానా రకాలుగా హింసించినట్లు బాధితులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ వేసి విచారణ జరిపారు. ర్యాగింగ్, హింసించిన తీరును బాధితులు వివరించడంతో బాధ్యులను రెండు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు సోమవారం వర్సిటీ ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి విచారణ జరిపిన తరవాత తదుపరి చర్యలుంటాయని వివరించింది.
*సుజీవన్ వావిలాల*🖋️