Thursday, February 4, 2021

టెన్త్‌తో తపాలా ఉద్యోగం

హైదరాబాద్ : 05/02/2021

*టెన్త్‌తో తపాలా ఉద్యోగం*
మీ ప్రాంతంలో పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధించారా? అయితే.. కేంద్రప్రభుత్వ కొలువు పొందే అవకాశం మీకున్నట్టే! రాతపరీక్ష రాయనక్కర్లేదు. ఇంటర్వ్యూకూ హాజరు కానవసరం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 3446 గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.  

తాజా ప్రకటన ద్వారా బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఏపీలో 2296, తెలంగాణలో 1150 పోస్టులున్నాయి.ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌ జండర్లు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 26. https:appost.in/gdsonline/Home.aspx వయసు: జనవరి 27, 2021 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాం గులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.బేసిక్‌ కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

*తీన్మార్ మల్లన్న Q న్యూస్*

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, February 3, 2021

తెలంగణా ఆడపడుచు తో ఉద్యోగం కోసం కాళ్లు మొక్కించుకోనె సంస్కృతి మన నాయకులది

హైదరాబాద్ : 04/02/2021

*నీళ్ళు, నిదులు,నియామకాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ    తెలంగాణా ప్రభుత్వం పరిస్తితి ఇ లా ఉంది ఒక తెలంగణా ఆడపడుచు తో ఉద్యోగం కోసం కాళ్లు మొక్కించుకోనె సంస్కృతి మన నాయకులది, 1200 మంది ఆత్మ బలిదానాలతో ప్రభుత్వంను ఎర్పరిచి అదే నిరుద్యోగులతో కాళ్లు  మొక్కించుకొవడమెన తెలంగాణ ఆత్మ గౌరవం. గత 14 సంవత్సరాలు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేయడం జరిగింది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించడం జరిగింది మళ్లీ మమ్మల్ని ఉద్యోగం లోకి తీసుకోవాలని  ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ లా చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పొయింది ఈరోజు టి ఆర్ ఎస్  ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ మాకు ఉద్యోగం ఇవ్వాలి అని మా కుటుంబాలను ఆదుకోవాలని తన కాళ్ళు పట్టుకుని వేడుకుంటుంది మాకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదు అని కంట తడి పెట్టింది*

"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""'""""'""
*పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను నిలువునా ముంచి అనురాగ్ యూనివర్సిటీ ని సొంతంగా మొదలు పెట్టబోతున్నాడు. ఇలాంటి ద్రోహులకు  MLC టికెట్ ఇచ్చిన వారికి తెలివిలేదు. దయచేసి పట్టభద్రులారా రాబోయే MLC ఎన్నికలలో ఈ తెలంగాణ ద్రోహులకు ఓటు వేయకూడదు 🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

కేటీఆర్‌ సార్ కు సీఎం పదవిపై ప్రజాభిప్రాయం ఇదే!

హైదరాబాద్ : 03/02/2021

*కేటీఆర్‌కు సీఎం పదవిపై ప్రజాభిప్రాయం ఇదే!*

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోతున్నారని మీడియాలో వస్తున్న వార్తలు, దాన్ని బలపర్చేలా ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేస్తున్న వరుస వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల తారక రామారావు పట్ల సాధారణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే అంశంపై *ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్, టెలివిజన్ మీడియాలలో* విస్తృతస్థాయిలో ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ పోల్ ప్రక్రియ మొత్తం శాస్త్రీయపద్ధతిలో.. అత్యంత పారదర్శకంగా జరిగింది. కేటీఆర్ పట్టాభిషేకం ఊహాగానాలపై మీరేమనుకుంటున్నారు..? అని అడిగిన ప్రశ్నకు *54% మంది ప్రజలు ఇదే సరైన సమయమని బదులిచ్చారు. 45% మంది మాత్రం ఇప్పుడు సమయం కాదని తమ అభిప్రాయాల్ని చెప్పారు.* ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్ధుడా..? అని ఏబీఎన్ అడిగిన మరో ప్రశ్నకు సరైన వ్యక్తి అని *54% మంది ప్రజలు క్లారిటీగా చెప్పారు. 45% మంది ప్రజలు మాత్రం అంత అనుభవం లేదని తేల్చారు*. ఓవరాల్‌గా కేటీఆర్‌కు తెలంగాణ ప్రజానీకం మద్ధతు అయితే మెండుగా కనిపిస్తోంది.

*Q న్యూస్ సౌజన్యంతో*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, February 2, 2021

మెట్రోరైలు అధికారులకు కేటీఆర్ సారు అభినందనలు తెలిపారు .....!

*మెట్రోరైలు అధికారులకు కేటీఆర్ అభినందనలు.....!*

హైదరాబాద్‌: గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి గుండె తరలింపునకు సహకరించిన మెట్రో అధికారులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన అవయవదాత నర్సిరెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మెట్రోరైలులో నాగోల్‌ నుంచి జూబ్లిహిల్స్‌కు మెట్రోలో గుండె తరలించిన విషయం తెలిసిందే.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డిది పేదకుటుంబం. బోరు డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆదివారం మోత్కూరులో పెట్రోలు బంకుకు వెళ్లిన నర్సిరెడ్డి హైబీపీతో పడిపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఈయన్ను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు మెదడులో రక్త స్రావమైందని చెప్పారు. సోమవారం ఆయన బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు ధ్రువీకరించారు. జీవన్‌దాన్‌ ట్రస్టుకు సమాచారం అందడంతో వారు అవయవదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. 'మీ భర్త ప్రాణాలు తిరిగి రాకపోయినా.. మరికొందరిని రక్షించవచ్చని' వారు చెప్పడంతో నర్సిరెడ్డి భార్య నిర్మల ఇందుకు అంగీకరించారు. ఆయన నుంచి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం సేకరించారు. గుండెను ప్రత్యేకంగా మెట్రో రైలులో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతున్న ఓ 44 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చాలని నిర్ణయించారు. మిగతా అవయవాలను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఇతర ఆసుపత్రులకు తరలించిన విషయం తెలిసిందే.

*link Media*

బాపట్ల కృష్ణమోహన్

prajasankalpam1@gmail.com

@Praja_Snklpm (ట్విట్టర్)

prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)

prajasankalpam1 (యూట్యూబ్)


https://prajasankalpam1.blogspot.com/

We are Proud of you... @IPS_Association

Hyderabad : 02/02/2021

The khaki is here to serve. We salute SI Kotturu Sirisha of Srikakulam Police , AP for the excellent humane gesture. We are proud of you. #khaki
@IPS_Association 

https://t.co/A44fEY3vts

హైదరాబాద్ లో తొలిసారిగా గ్రీన్ ఛానల్

హైదరాబాద్ : 02/02/2021

*హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.....!*

*తొలిసారిగా గ్రీన్‌ ఛానల్‌..*

హైదరాబాద్‌ మెట్రో తొలిసారిగా ఓ గుండెమార్పిడి శస్త్రచికిత్సలో తన వంతు సాయం చేయనుంది. నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌ నేపథ్యంలో గుండె తరలింపునకు వైద్యులు హైదరాబాద్‌ను మెట్రోను ఎంచుకున్నారు. దీంతో నగరంలో మొదటిసారిగా మెట్రోతో గ్రీన్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్‌ గోకులే నేతృత్వంలో ఈ శస్త్ర చికిత్స జరగనుంది. దీంతో తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి సిబ్బంది మెట్రో రైలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలు అధికారులు అప్రమత్తమయ్యారు.
*నాగోల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు నాన్‌స్టాప్‌..*
ఎల్బీనగర్‌ కామినేని నుంచి జూబ్లీహిల్స్‌ అపోలోకు గుండెను ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం నాగోలు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకూ మెట్రో సర్వీస్‌ను నాన్‌స్టాప్‌గా నడపనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకు కూడా రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించనున్నారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు వైద్యులు మెట్రోను ఎంచుకున్నారు.

*link Media 🖋️*

https://prajasankalpam1.blogspot.com/

Monday, February 1, 2021

పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించిన లక్కీ

హైదరాబాద్ : 01/02/2021

*పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించిన లక్కీ*

*అది ఒక శునకం.... శిక్షణ పొందిన సుశిక్షతమైన శునకం.... అందుకే పోలీసులతో సమానంగా ఎన్నో కేసులను చేధించడంలో కీలకంగా పని చేసి నల్లగొండ జిల్లా పోలీసుల కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటి ఉన్నతాధికారులతో *శభాష్*అనిపించుకుంది*

*ఈరోజు ఈ లోకం నుండి దూరంగా వెళ్ళిపోయిన సందర్బంగా😔*

@నల్లగొండ పోలీస్

https://prajasankalpam1.blogspot.com/