Friday, February 25, 2022

20 ఏళ్ళ నుండి వ్లాదిమిర్ పుతిన్ కంటున్న కల!

20 ఏళ్ళ నుండి వ్లాదిమిర్ పుతిన్ కంటున్న కల!

శక్తివంతమయిన రష్యా కోసం తపన పడ్డాడు వ్లాదిమిర్ పుతిన్!తన కలని వాస్తవరూపంలోకి తీసుకురావడానికి చాల కష్ట పడ్డాడు! అమెరికా,యూరోపు దేశాలు ఆంక్షలు విధించినా సహనంతో తగిన సమయం కోసం వేచి చూశాడు. ఆ సమయం రానే వచ్చింది జో బిడెన్,కమలా హారిస్ రూపంలో !
24-02-2022 గురువారం ఉదయం 6 గంటలకి రష్యా ప్రజలని ఉద్దేశించి టెలివిజన్ లో సుదీర్ఘంగా మాట్లాడాడు. తనకి తన రష్యా ప్రజల సంక్షేమమే ముఖ్యమని దానికోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. 6.30 లకి తన సైన్యానికి పిలుపు ఇచ్చాడు ఉక్రెయిన్ మీద దాడి చేయమని. మరో వైపు ఇతర దేశాలకి తీవ్ర హెచ్చరిక చేశాడు : మా విషయంలో ఏ దేశమన్నా కలుగచేసుకుంటే మాత్రం ఇప్పటివరకు మీరు ఊహించని పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ! పరోక్షంగా అణు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చేసిన హెచ్చరిక అది!


అమెరికా కి మరియు యూరోపియన్ యూనియన్ కి తెలుసు పుతిన్ ఎలాంటి వాడో ! ప్రత్యక్షంగా కనుక ఉక్రెయిన్ రష్యా ల మధ్య దూరి కలుగచేసుకుంటే కలిగే తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు కాబట్టి కేవలం ఆయుధాలు ఇచ్చి ఉక్రెయిన్ కి సహకరిస్తామని మాత్రమె అనగలగాయి. యాంటీ టాంక్ గైడెడ్ మిసైల్స్ [జావేలిన్ ?] తో పాటు మాన్ పోర్టబుల్ యాంటి ఎయిర్ మిసైల్స్ ని ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇచ్చింది అమెరికా ఉక్రెయిన్ కి. కానీ ప్రపంచమ్ లోనే అతి పెద్ద రెండవ సైన్యం కలిగి ఉన్న రష్యాని ఎదుర్కోవడానికి ఇవేవీ చాలవు. ఈ విషయం అటు అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలకీ తెలుసు.
ఇక యుద్ధంలో రష్యా ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయింది ? ఎన్ని యుద్ధ టాంకులు నష్టపోయింది లాంటి వివరాలు ఇప్పటికిప్పుడే నిజ వార్తలు తెలియవు. అక్కడ నుండి రిపోర్ట్ చేసే పశ్చిమ దేశాల మీడియాలు చెప్పేవన్నీ 60% పైగా అబద్ధాలే ఉంటాయి. యుద్ధం ముగిశాక మాత్రమె అసలు నిజాలు వాటి సంఖ్యలు తెలుస్తాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ వార్తలని ప్రస్తావించడం అవివేకం!
అసలు ఎందుకు పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు ? పుతిన్ కన్న కల ఏమిటీ ?

ఈ విషయాలు తెలియాలంటే కనీసం 200 వందల ఏళ్ళ వెనక్కి వెళ్లి చరిత్ర తెలుసుకోవాలి. 16 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం వరకు రష్యన్ సామ్రాజ్యం యూరోపు తో పాటు మంగోలియా వరకు విస్తరించి ఉంది. నిజానికి అప్పట్లో విశాల భూభాగం ఉండేది కానీ జనాభా తక్కువ. అక్కడక్కడా వివిధ జాతుల ప్రజలు నివాసం ఉండేవారు. జార్ చక్రవర్తుల కాలం నాడు ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించారు కానీ భారత్ ని కూడా స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది అప్పటి జార్ ప్రభుత్వం కానీ అప్పటికే భారత్ లో బ్రిటన్ తిష్ట వేసి ఉండడం అంత పెద్ద భూభాగం ని ఎక్కువ కాలం తమ అదుపులో ఉంచుకోవడం కష్టం అని భావించి వెనక్కి వెళ్ళిపోయారు. తరువాతి కాలంలో ప్రవాసం లో ఉన్న లెనిన్ జెర్మనీ తో లోపాయకారీగా ఒప్పందం చేసుకొని భారత్ ని బ్రిటన్ నుండి విడిపించి తమ అధీనంలోకి తీసుకోవాలనే మంతనాలు చేసాడని అంటారు. అయితే చివరి రష్యన్ జార్ చక్రవర్తిని దించేసి కమ్మ్యూనిస్తులు రష్యాని తమ అధీనలోకి తీసుకోవడం తో బిజీ అయిపోయి భారత్ గురుంచి పట్టించుకోలేదు. ఇదంతా 16 వ శతాబ్దం నుండి 1920 వరకు జరిగిన చరిత్ర.1920 తరువాత రష్యా అధీనంలో ఉన్న భూభాగం మొత్తం కలిపి USSR [Union of Soviyat Socialist Repablic ] గా ఏర్పడింది. ఇప్పటి ఉక్రెయిన్,ఉబ్జేకిస్తాన్,ఖజకిస్తాన్,బెలారస్,జార్జియా.లాత్వియా,ఎస్టోనియా,ఇలా అన్నీ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేవి.
1954 లో అప్పటి సోవియట్ యూనియన్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అప్పటి సోవియట్ అధ్యక్షుడు లియోనిద్ కృశ్చెవ్ ఇప్పుడు ఉక్రెయిన్ లో ఉన్న క్రిమియా ద్వీప కల్పాన్ని రష్యా నుండి విడదీసి ఉక్రెయిన్ లో కలిపాడు. ఇది కేవలం అప్పట్లో పాలనా సౌలభ్యం కోసం చేసిన పని. మన దేశంలో రాష్ట్రాల విభజన జరిగినట్లుగా అన్నమాట !
ఉక్రెయిన్ లో ప్రధానంగా నాలుగు భాగాలు ఉన్నాయి.1. క్రిమియా[Crimea] 2.డాన్బాస్ [Donbas]3.ఖార్కివ్ [Kharkiv]4.ఒడెస్సా [Odessa]. వీటిలో క్రిమియా లో అధిక శాతం రష్యన్లు ఉన్నారు మొదటి నుండి ఎందుకంటే ఒకప్పుడు ఇది రష్యలో భాగంగా ఉండేది కనుక. ఈ క్రిమియాని 2014 లో రష్యా పెద్దగా ప్రతిఘటన లేకుండానే స్వాధీనం చేసుకుంది అదీ రిఫరెండం పెట్టి [అధిక శాతం వోట్లు రష్యాలో కలవాలని పడ్డాయి ]. క్రిమియా కి నల్ల సముద్ర తీరం ఉంది. ఇక డాన్ బాస్ లో రష్యాకి అనుకూలంగా ఉన్న తిరుగుబాటు దారుల చేతిలో ఉంది 2014 నుండి. వీళ్ళకి రష్యా అండదండలు ఉన్నాయి. ఇక ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతం ఖార్కివ్ [Kharkiv ] లో. ఇక నాలుగవది ఒడెస్సా రష్యా కి చాలా దూరంలో ఉంది.


1991 లో సోవియట్ విచ్చిన్నం తరువాత రష్యా ఉక్రెయిన్ లోని క్రిమియా మీద తమకే హక్కులు ఉన్నాయని వాదించింది. మళ్ళీ వెనక్కి వెళితే లియోనిద్ కృశ్చెవ్ 1954 లో రష్యా నుండి విడదీసి ఉక్రెయిన్ కలిపిన సంగతి గుర్తు చేస్తూ వివాదానికి తెర తీసింది అయితే అప్పట్లో మెమొరాండం ఆఫ్ బుడాపెస్ట్ పేరుతొ జరిగిన ఒప్పందం లో క్రిమియా మీద వివాదం అలానే ఉండిపోయింది. సోవియట్ విచ్చిన్నం జరిగినప్పుడు రష్యా చాల బలహీన స్థితిలో ఉంది ఆర్ధికంగా. ఎంతగా అంటే రెండు బ్రెడ్డు ముక్కల కోసం ప్రజలు షాపుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూ లోనిలబడి రావాల్సిన స్థితి. ధనవంతులు అయితే బ్లాక్ లో డాలర్లు కొని నేరుగా షాపులోకి వెళ్లి డాలరు తో బ్రెడ్డు కొనుక్కునేవారు. ఎంత దరిద్రం తాండవించింది అంటే అప్పట్లో రష్యా తో పాటు అప్పటి రిపబ్లిక్ దేశాల మహిళలు తమ కుటుంబ పోషణార్ధం భారత్ వచ్చి వ్యభిచారం చేసి తమ దేశాలకి డబ్బు పంపేవారు. అయితే దీనంతటకి తమ స్వంత తప్పుల తో పాటు పశ్చిమ దేశాల కుట్ర కూడా ఉంది. మరీ ముఖ్యంగా అమెరికా CIA పాత్రని ఎవరూ కాదనలేరు.
అప్పటికే KGB కూడా మూత పడడంతో వ్లాదిమిర్ పుతిన్ నేరుగా రాజకీయాలలో ప్రవేశించాడు. పుతిన్ కి తమ గత తప్పులతో పాటు పశ్చిమ దేశాల కుట్ర మీద చాల కోపంగా ఉండేవాడు. క్రమంగా [అక్రమంగా కూడా ] ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి రష్యాకి అధ్యక్షుడు అయ్యాడు. క్రమంగా రష్యాని ఆర్ధికంగా,పారిశ్రామికంగా పటిష్టమయిన స్థితిలోకి తీసుకొచ్చాడు గత 20 ఏళ్ళలో. 1995 లో బుడాపెస్ట్ మెమొరాండం ప్రకారం ఉక్రెయిన్ క్రిమియా కి అటానమస్ అంటే స్వతంత్ర హోదా ని తీసేసింది. దీనికోసం రాజ్యాంగాన్ని సవరించింది ఉక్రెయిన్. 1995 లో అప్పటి ఉక్రెయిన్ పాలకులు అమెరికా, యూరోపు కీలుబొమ్మలుగా వ్యవరిహించారు. మరి మొదట ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఉక్రెయిన్ కాదా ? అదీ అమెరికా ,యూరోప్ దేశాల కోరిక మేరకే ఉక్రెయిన్ ఈ పని చేసింది. అంటే క్రిమియా కి అటానమస్ హోదా తీసేస్తే అది పూర్తిగా ఉక్రెయిన్ భూభాగం కిందకి వస్తుంది అప్పుడు నల్ల సముద్రం మీద ఉక్రెయిన్ కి పూర్తీ హక్కులు ఉంటాయి దాంతో అమెరికా ,యూరోపు దేశాలు కలిసి నల్ల సముద్రం ని బ్లాక్ చేసి రష్యా కి అడ్డంకులు సృష్టించాలి అనే పన్నాగం ఇది. ఇప్పుడు సౌత్ చైనా సముద్రం లో చైనా కృత్రిమ దీవులని కట్టి అక్కడ యుద్ధ నౌకాశ్రయం తో పాటు మిలటరీ ఎయిర్ బేస్ లని కట్టడం వెనుక ఉక్రెయిన్,క్రిమియా నల్ల సముద్రం మీద అమెరికా ,యూరోపు ఎలా అయితే ఆధిపత్యం వహించాలని చూసాయో అదే పని చైనా కూడా చేసింది. అఫ్కోర్స్ రష్యా,చైనాలు చాల ముందస్తు వ్యూహంలో భాగంగా నే ఇదంతా జరిగింది.
మరీ ముఖ్యంగా బరాక్ ఒబామా హయాంలో ఉక్రెయిన్ లో అమెరికా జోక్యం తారాస్థాయికి వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే 2014 లో ఉక్రెయిన్ అధ్యక్షుడు తమ దేశాన్ని నాటో లో భాగంగా చేర్చుకోండి అంటూ అధికారికంగా అభ్యర్ధించాడు అంటే ఇది ఎవరి పని అయి ఉంటుందో ఊహించవచ్చు. అంటే ఉక్రెయిన్ ని నాటో ల్ భాగంగా చేసుకొని రష్యాని బెదిరించే పని కాదా ?
అసలు కారణం బరాక్ ఒబామా మరియు అప్పటి వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ లు !
డోనాల్డ్ ట్రంఫ్ అధికారంలోకి రాగానే ఉక్రెయిన్ లో అమెరికా జోక్యం లేకుండా చేశాడు. అసలు నాటో దేశాల రక్షణ బాధ్యత అమెరికా ఎందుకు తీసుకోవాలి అంటూ సంచలన ప్రకటన చేశాడు. డోనాల్డ్ ట్రంఫ్ అధికారంలో ఉన్న నాలుగేళ్ళు రష్యాతో మంచి సంబంధాలనే కొనసాగించాడు. ట్రంఫ్ కి యుద్ధం చేసి డబ్బులు ఖర్చు పెట్టడం లాంటి వాటి మీద అసలు ఇష్టం లేదు కనుకనే ప్రశాంతంగా ఉంది. అసలు జో బిడెన్ పుత్ర రత్నం ఉక్రెయిన్ లోని క్రూడ్,నాచురల్ గాస్ లలో బినామీ పెట్టుబడుల మీద సమాచారం ఇచ్చింది పుతిన్ అంటారు.
డోనాల్డ్ ట్రంఫ్ అధికారం కోల్పోగానే జో బిడెన్ అధ్యక్షుడు అయిన తరువాత అమెరికా ఆర్ధిక,సైనిక వ్యవహారాల మీద పట్టు లేకపోవడం ఒక కారణం అయితే అమెరికా తీవ్ర ఆర్ధిక సంక్షోభం లోకి వెళ్ళిపోయింది. ఇదే వ్లాదిమిర్ పుతిన్ కి మంచి సమయం అనిపించింది. అమెరికా అధ్యక్షులు మారినప్పుడల్లా ఉక్రెయిన్ లో తనకి వ్యతిరేకంగా కుట్రలు జరగడం అనేదే పుతిన్ కి నచ్చలేదు. వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ తన అదుపులో ఉంటేనే మంచిది అనుకున్నాడు దాడికి ఆదేశాలు ఇచ్చాడు.
అసలు అమెరికా ఉక్రెయిన్ మీద దృష్టి పెట్టడానికి కారణం అక్కడి ఆయిల్ నిక్షేపాలు,నాచురల్ గాస్ నిక్షేపాలు కారణం. ఇప్పుడు ఉక్రెయిన్ మీద దాడి చేసి ఆయిల్,నాచురల్ గాస్ క్షేత్రాలు తన అధీనంలో ఉంచుకొని అక్కడ తనకి అనుకూలంగా ఉండే అధ్యక్షుడిని కూర్చోపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలని ప్లాన్ ! ఎటూ దొంబాస్,ఖర్ఖీవ్,క్రిమియాలని రష్యాలో కలిపేసుకుంటాడు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కాకపోతే యుద్ధం ఎన్ని రోజుల్లో ముగిస్తాడా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న ! ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెర్మనీ పారిపోయి అక్కడ నుండి దేశాన్ని నడిపిస్తున్నాడు ఖర్మ !
మన దేశానికి సన్ ఫ్లవర్ ఆయిల్ కి కావాల్సిన పొద్దు తిరుగుడు గింజలు 80% ఉక్రెయిన్,రష్యాల నుండి దిగుమతి అవుతాయి. కోవిడ్ వల్ల సరఫరా ఆగిపోవడం వల్ల ఇప్పటికే సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు రెండు రెట్లు పెరిగాయి ఇప్పుడు ఒక లీటర్ 300/- అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

Courtesy :- Parthasarathy Potluri

MyIndMedia Twitter 

ఉక్రెయిన్‌‌కు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తే.. ఖర్చులు భరిస్తాం: మంత్రి కేటీఆర్

*ఉక్రెయిన్‌‌కు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తే.. ఖర్చులు భరిస్తాం: మంత్రి కేటీఆర్*

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వారిని త్వరితగతిన భారత్‌కు రప్పించాలంటూ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు  ట్విట్టర్ ద్వారా మంత్రి విజ్ఙప్తి చేశారు. ఉక్రెయిన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తే ఖర్చులు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇందుకోసం తక్షణమే ఏర్పాట్లు చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని మంత్రి కేటీఆర్ కోరారు. 

*రెండో రోజు యుద్ధం...తెలుగు విద్యార్థుల ఆవేదన*

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం రెండో రోజు కొనసాగుతోంది. యుద్ధంలో అనేక మంది సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపుఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు  యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమ బిడ్డలను స్వదేశానికి తీసుకురావాల్సింది భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

link Media ప్రజల పక్షం 

Thursday, February 24, 2022

Submitted application to Government of Telangana for Nominated Member to Telangana state Waqf Board

*Submitted application to Government of Telangana for Nominated Member to Telangana state Waqf Board thru email on 19 February 2022 and hard copy on 23 and 24 February 2022.* 
*Application was submitted under three categories of Islamic theology, social work and women as per Waqf Act. - Dr Lubna Sarwath, Wellbeing Economist , social and environmental activist*

ఏప్రిల్ 17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!

*ఏప్రిల్ 17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!*

హైదరాబాద్: డా.బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదట, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్,మేలో నిర్వహించనున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారుడిగ్రీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు, మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, అలాగే మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ మే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు.

ఆన్ లైన్ లో రిజిస్ర్టేషన్ చివరి తేదీ మార్చ్ 20వ తేదీగా పేర్కొన్నారు. ఎగ్జామ్ సమయం మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయి. ఎగ్జామ్ కు హాజరు కాగోరు విద్యార్ధులు యూనివర్శిటీ పోర్టల్ లో నమోదుచేసుకోవాలి. అనంతరం ఫీజును టీఎస్, ఏపీ ఆన్ లైన్ సెంటర్ల ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్ధులు వారి సంబంధిత అధ్యయనకేంద్రంలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.

*link Media ప్రజల పక్షం🖋️*

Tuesday, February 22, 2022

ts_bpass తెలంగాణ రాష్ట్రం – బి పాస్

ts_bpass తెలంగాణ రాష్ట్రం – బి పాస్ కు స్వాగతం

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి విభాగం

పౌరుల చట్టాలకు లోబడి ఉండటానికి, అధికారులలో జవాబుదారీతనం పెంచడానికి, అవినీతి పద్ధతులను తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మునిసిపాలిటీ చట్టం “తెలంగాణ మునిసిపాలిటీ చట్టం 2019” ను అమలు చేసింది. భారత రాజ్యాంగంలోని IX-A భాగం ప్రకారం మునిసిపాలిటీల రాజ్యాంగాన్ని అందించడం. ఈ చట్టం యాదృచ్ఛిక ఆడిట్లను కూడా తీసుకుంటుంది మరియు నిబంధనల నుండి తప్పుకునే ఏ పౌరుడు లేదా అధికారికి జరిమానా విధించబడుతుంది.

తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019 కు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం టిఎస్-బిపిఎఎస్‌ను ప్రారంభించింది / ప్రవేశపెట్టింది, స్వీయ-ధృవీకరణ వ్యవస్థ ద్వారా భూమి అభివృద్ధి మరియు భవనాల నిర్మాణ సమయంలో అవసరమైన వివిధ అనుమతులను ప్రాసెస్ చేయడానికి ఒకే సమగ్ర వేదిక. ఇది నిర్ణీత కాలపరిమితిలో సేవలను అందించడానికి కూడా రూపొందించబడింది.

విశిష్ట లక్షణాలు

  • 75 చదరపు గజాల వరకు ప్లాట్లు పరిమాణం మరియు గ్రౌండ్ లేదా గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ (రెసిడెన్షియల్) నిర్మాణం కోసం భవనం అనుమతి మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అవసరం లేదు. దరఖాస్తుదారుడు రూ .1 టోకెన్‌తో నమోదు చేసుకోవాలి.
  • ప్లాట్ పరిమాణం 500 చదరపు మీటర్లు మరియు 10 మీటర్ల ఎత్తు (నివాస) ఆన్‌లైన్ స్వీయ ధృవీకరణ ద్వారా తక్షణ భవనం అనుమతి అనుమతి కోసం.
  • ప్లాట్ పరిమాణం 500 చదరపు మీటర్లు మరియు 10 మీటర్ల ఎత్తు (రెసిడెన్షియల్ & నాన్-రెసిడెన్షియల్) కోసం కామన్ అప్లికేషన్ ఫారం మరియు ఆన్‌లైన్ స్వీయ ధృవీకరణ ద్వారా ఆమోదం ఉపయోగించి బహుళ ఎన్‌ఓసిలను పొందటానికి ఒకే విండో సిస్టమ్ ఉంది.
  • ఆన్‌లైన్ స్వీయ ధృవీకరణ ద్వారా తాత్కాలిక లేఅవుట్ ఆమోదం దరఖాస్తుల ప్రాసెసింగ్.
  • 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ మరియు 500 చదరపు మీటర్ల కన్నా తక్కువ ప్లాట్లలో నిర్మించిన ఎత్తైన భవనాల కోసం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ యొక్క ప్రాసెసింగ్ మరియు ఆన్‌లైన్ స్వీయ ధృవీకరణ ద్వారా 500 చదరపు మీటర్ల ప్లాట్లలో నిర్మించిన ఎత్తైన భవనాలు మరియు భవనాల కోసం.
  • భూ వినియోగ ధృవీకరణ పత్రాలు మరియు భూ మార్పిడి ధృవీకరణ పత్రాల ప్రాసెసింగ్.
  • జారీ చేసిన అనుమతుల పోస్ట్ ధృవీకరణ

విశిష్ట లక్షణాలు

ఆన్‌లైన్ దరఖాస్తు

పౌరులు అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపి సమర్పించవచ్చు.

సరళీకృత ప్రక్రియ

సింగిల్ కామన్ అప్లికేషన్ ఫారమ్ ఉపయోగించి పౌరులు అన్ని లైన్ విభాగాల నుండి ఎన్ఓసి పొందవచ్చు.

సురక్షితం & భద్రత

వెబ్‌సైట్‌లో చేసిన అన్ని లావాదేవీలు గుప్తీకరించబడతాయి మరియు అందువల్ల సురక్షితం.

3-స్టెప్ ప్రాసెస్

పౌరులు 3 సులభ దశల్లో అనుమతులు పొందవచ్చు - దరఖాస్తు, అప్‌లోడ్ మరియు చెల్లింపు.

దాని రకమైన మొదటిది

టచ్ పాయింట్ లేకుండా పూర్తి ఆన్‌లైన్ సేవలను అందించిన దేశంలో మొదటి ప్రభుత్వం.

మొబైల్ బాధ్యతాయుతంగా

చురుకైన ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా పౌరులు డెస్క్‌టాప్, టాబ్లెట్ మరియు మొబైల్ ద్వారా సేవలను యాక్సెస్ చేయవచ్చు.

Hyderabad Locals plant trees in potholes

Hyderabad Locals plant trees in potholes Courtesy by : Hans News Service   |  2 Dec 2019 

Hyderabad Locals plant trees in potholes Hans News Service   |  2 Dec 2019 12:29 AM IST ADVERTISEMENT Kukatpally: In a bid to highlight the problem of potholes in the city, a group of residents in Pragati Nagar area staged a unique protest by 'planting trees' in large potholes on the roads. After the successful pothole plantation in Peerzadiguda on November 17, this was the second instance where the residents came forward to intimate the civic authorities in a unique way. Prashanth Mamidala, who started the trend of pothole plantation, shared, "The roads have been damaged a lot but the officials seem to be sleeping over the issues. Even the people seem to be least worried. Hope the authorities and people wake to the situation and make the lives better. Around 15 people from all walks of life volunteered for the drive followed by the plantation drive. A certificate of appreciation was given to all the commuters commuting from the stretch which read, "Congratulations for becoming an expert in driving by navigating through difficult terrains on Pragati Nagar roads without any accidents."

https://www.thehansindia.com/news/cities/hyderabad/hyderabad-locals-plant-trees-in-potholes-586317

విశ్వ‌న‌గ‌రంలో విశ్వ‌’జిత్తులు’

విశ్వ‌న‌గ‌రంలో విశ్వ‌’జిత్తులు’

Courtesy by : తొలివెలుగు మీడియా 

- మంత్రి పేరుతో క‌థంతా న‌డిపిస్తున్న ఐపీఎస్?
– నాలుగేళ్లయినా పూర్తిగాని డిప్యుటేష‌న్‌?
– ఒకే ఒర‌లో దొంగ-పోలీస్?
– డీటీఓపీ రూల్స్ అనేవి ప‌ట్ట‌వు!
– ప్ర‌జాప్ర‌తినిధికంటే ఫ‌వ‌ర్ ఫుల్!
– సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణకు డిమాండ్?

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఎన్నో అక్ర‌మాలు వెలుగుచూశాయి. నాయ‌కుల క‌బ్జాలు, కాంట్రాక్ట‌ర్ల మోసాలు, అధికారుల అవినీతి.. ఒక్కోసారి నేత‌లు, కాంట్రాక్ట‌ర్లు, అధికారులు కుమ్మ‌క్క‌యిన బాగోతాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన అధికారులు, నాయ‌కులు క‌లిసి పోయి క్విడ్ ప్రో కో పాల‌సీతో దోచుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొంత‌మంది ఐఏఎస్‌, ఐపీఎస్ లు అయితే గులాబీ గులాంగిరీకే అంకిత‌మ‌య్యారు. హైద‌రాబాద్ ని విశ్వ న‌గ‌రంగా చేస్తామ‌ని చెప్పింది గులాబీ పార్టీ. అయితే.. ఓ ఐపీఎస్ తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. మేయ‌ర్, క‌మిష‌న‌ర్ ని కాద‌ని మంత్రి క‌నుస‌న్న‌ల్లో స‌మాంత‌ర ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నారంటే వ్య‌వ‌స్థ‌ల‌ను ఏ విధంగా తుంగ‌లో తొక్కుతూ రోజురోజుకీ ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా మారుతున్నారో అర్థం చేసుకోండి. ఒక్క డిపార్ట్ మెంట్ కి అధికారిగా వ‌చ్చిన ఆయ‌న‌.. ఇప్పుడు ఏకంగా ఐదింటిని త‌న గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయ‌న ఎవ‌రో కాదు విశ్వ‌జిత్ కంపాటి.

ఎవ‌రీ ఐపీఎస్ విశ్వ‌జిత్ కంపాటి?

2013 బ్యాచ్ కి చెందిన విశ్వ‌జిత్. ఎక్క‌డ డ్యూటీ చేసినా వివాద‌స్ప‌ద‌మే. 2016లో మేడారం జాత‌ర‌లో ములుగు ఏఎస్పీగా ఉన్నారు. ఐటీడీఏ డాక్ట‌ర్, జ‌ర్న‌లిస్ట్ పై దాడిచేసి నిర్బంధించినందుకు వార్త‌ల్లోకి ఎక్కారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరిని నిర్బంధించి ఖాకీ జులం ప్ర‌ద‌ర్శించారు.మీరు వైద్యులైతే ఏంటి..? జ‌ర్న‌లిస్టులు అయితే ఏంటి..? తోలు తీస్తా అంటూ వార్నింగులు ఇచ్చారు. అంబులెన్స్ డ్రైవ‌ర్ పై దాడికి సంబంధించి జ‌ర్న‌లిస్ట్ జోక్యం చేసుకుంటే.. నువ్వ‌యితే ఎంట్రా తోలు తీస్తా అంటూ వీర్ర‌విగిపోయారు. లాఠీతో వైద్యుడిని కొట్టడంతో డాక్ట‌ర్స్ అంతా నిర‌స‌న తెలిపారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. మేడారం డ్యూటీ నుంచి దూరంగా ఉంచేంత వ‌ర‌కు ధ‌ర్నా చేశారంటే అత‌ను ఎంత దురుసుగా ప్ర‌వ‌ర్తించారో అర్ధం చేసుకోవ‌చ్చు.ఆ త‌ర్వాత రాజ‌న్న‌ సిరిసిల్ల జిల్లాకు ఎస్పీగా వెళ్లారు. అక్క‌డ ఇసుక మాఫియా చెప్పిన‌ట్లు విని ద‌ళితులపై కేసులు బ‌నాయించార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎస్సీ క‌మిష‌న్ ముందు ఎస్పీని బ‌దిలీ చేయాలనే డిమాండ్లు వినిపించాయి. డీజీపీకి ఫిర్యాదులు వెల్లువ‌లా వ‌చ్చాయి. దీంతో మంత్రి కేటీఆర్ సొంత జిల్లా నుంచి.. త‌న మున్సిప‌ల్ శాఖలో కీల‌క‌మైన‌ గ్రేట‌ర్ హైద‌రాబాద్ కి విశ్వ‌జిత్ ని డిప్యుటేషన్ పై తీసుకొచ్చారు.

టీఆర్ఎస్ లో కంపాటి ప్ర‌కంప‌న‌లు?

2018లో జీహెచ్ఎంసీలో డైరెక్ట‌ర్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్, డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ డైరెక్ట‌ర్ గా విశ్వ‌జిత్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మ‌ద‌ర్ డిపార్ట్ మెంట్ నుంచి ఎక్క‌డికి డిప్యుటేష‌న్ పై వెళ్లినా.. డీఓపీటీ నిబంధ‌న‌ల ప్ర‌కారం మూడేళ్ల‌కంటే ఎక్కువ‌గా ఉండ‌రాదు. కానీ మంత్రి అండ‌దండ‌ల‌తో మూడేళ్లు దాటినా.. మ‌రిన్ని డిపార్ట్ మెంట్ల‌ను త‌న చేతిలోకి తీసుకుని మేయ‌ర్, క‌మిష‌న‌ర్ కంటే ఎక్కువ‌గా అధికారం చ‌లాయిస్తున్నార‌ని టీఆర్ఎస్ నేత‌లే వాపోతున్నారు. 2021లో కొత్త మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అన్ని డిపార్ట్ మెంట్ల‌లో వేలు పెడుతున్నార‌ని త‌న‌కు ఏ విష‌యం తెలియ‌కుండానే అన్ని ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఆమె స‌న్నిహితుల ముందు ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.

ఒకే ఓర‌లో దొంగ‌-పోలీస్

టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌జాప్ర‌తినిధి కంటే ఎక్కువ‌గా ఈ అధికారి ప‌నిచేయ‌డంతో మ‌రిన్ని శాఖ‌ల‌ను అంట‌గ‌ట్టింది ప్ర‌భుత్వం. ట్రాన్స్ ఫోర్ట్, అడ్వ‌టైజింగ్, మూసీ రివ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ తో పాటు స్ట్రాట‌జిక‌ల్ నాలా డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాం డైరెక్ట‌ర్ గా మ‌రో నాలుగు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్పించింది. ఇక్క‌డ వాహ‌నాల‌కు టెండ‌ర్ వేసేది ఈ విశ్వ‌జిత్తే. ఆ త‌ర్వాత అక్ర‌మాలు జ‌రిగాయ‌ని తెలుసుకోవాలంటే విజిలెన్స్ చీఫ్ గా ఇదే ఐపీఎస్ అధికారి ఉండ‌టంతో పోలీస్ దొంగ‌ను ప‌ట్టుకుంటారు.. లేదా అత‌నే దొంగ అయితే పోలీస్ డ్యూటీ ఎలా చేస్తార‌ని విమ‌ర్శ‌లు తావిస్తున్నాయి. మూసీ రివ‌ర్ ఫండ్స్ లో అక్ర‌మాలు జ‌రిగితే ఎవ‌రు విచార‌ణ చేప‌ట్టాలి. నాలా విస్త‌ర‌ణ‌లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను ప‌సిగ‌ట్టే గుణం ఈ ఆరు డిపార్ట్ మెంట్ల డైరెక్ట‌ర్ కి ఉంటుందా? లేక.. క్లీనింగ్ లో భారీగా డ‌బ్బులు దుర్వినియోగం అయితే.. ఈయ‌న వెస్టేజ్ మెనెజ్ మెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్నందున ఆ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్ట‌గ‌లుగుతారా? అనే అనుమానాలు తావిస్తున్నాయి. వీట‌న్నింటి బాధ్య‌త‌ల‌తో విజిలెన్స్ డ్యూటీ ఏలా చేస్తార‌ని హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

హోర్డింగుల‌తో హోరెత్తించారు

న‌గ‌రంలో అక్ర‌మ అడ్వ‌టైజింగ్ హోర్డింగులు ఉన్నాయ‌ని వాటిని తొల‌గించారు. అందుకు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా, గ‌ట్టి పునాదుల‌తో ప్రెస్ క్ల‌బ్ లో ఉండే హోర్డింగులు మొద‌లుకుని.. సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే పంజాగుట్ట స్మ‌శాన వాటిక‌లో ఉండే వాటిని సైతం పూర్తిగా తొల‌గించారు. వీట‌న్నింటిని తీసేసి.. కార్పొరేట్ సంస్థ‌ల‌కు దొచిపెట్టార‌నే అప‌వాదు ఉంది. మెట్రోతో పాటు మంత్రి క్లాస్ మేట్ కి ఉప‌యోగ‌ప‌డేలా అడ్వ‌టైజింగ్ బోర్డులకు ప్లానింగ్ చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఫైన్స్ తో భారీ ల‌బ్ది!

ఫ్లెక్సీల‌తో పొల్యూష‌న్ అవుతుంది. ఎక్క‌డా ఉండ‌వ‌ద్దు అంటూ నిబంధ‌న‌లు పెట్టారు. ఇంటికి టూ లెట్ అని రాస్తేనే వెయ్యి రూపాయ‌ల ఫైన్ విధిస్తున్నారు. ఇలా 2020 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 350 కోట్ల రూపాయ‌లు సామాన్యుల నుంచి ముక్కు పిండి వ‌సూలు చేశారు. క‌రోనా స‌మ‌యంలో కూడా ఫైన్ లు ఆగ‌లేదు. గోడ‌లపై పేర్లు రాసినా.. 5 వేల రుసుం చెల్లించాల్సిందే. ఇలా ప్ర‌త్యేక అకౌంట్ తీసి ఎన్ని డ‌బ్బులు వ‌సూలు చేశామో ట్రాఫిక్ పోలీసుల‌తో పోటీ ప‌డి మ‌రి లెక్క‌లు చూపిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ అకౌంట్ ఇల్లీగ‌ల్ అనే వాద‌న కూడా ఉంది. ఇక టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మయంలో ఆ పార్టీకి జీ హుజూర్ అయ్యారు. ఈవీడీఎం సిస్ట‌మ్ ని షట్ డౌన్ చేసి దుబాయ్ వెళ్లార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్లీన‌రీ స‌మయంలో న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా ఇష్టం వ‌చ్చిన‌ట్లు హోర్డింగ్స్, బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు, దండ‌లు క‌నిపించాయి.

విశ్వ‌జిత్‌ తీరుకే రిట‌న్ గిఫ్ట్ ఇచ్చారా?

రెండోసారి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఈస్ట్ అండ్ సౌత్ లో భారీగా సీట్ల‌ను కోల్పోయింది. విశ్వ‌జిత్‌ వ్య‌వ‌హారం, అధికారులు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం, వ‌ర‌దల స‌మ‌యంలో స‌రిగ్గా ప‌ని చేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అందుకే టీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు రిట‌న్ గిఫ్ట్‌ ఇచ్చార‌ని రాజ‌కీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

విశ్వ‌జిత్ అక్ర‌మాలు ఎలా బ‌య‌ట‌ప‌డాలి?

జీహెచ్ఎంసీలో జ‌రుగుతున్న అవినీతి, అక్ర‌మాలు ఎలా బ‌య‌ట‌ప‌డాలి. పాల‌న‌కు పార‌ద‌ర్శ‌క‌త ఉండాలంటే ఒక డిప్యుటేష‌న్ మీద వ‌చ్చిన అధికారికి అన్ని ముఖ్య‌మైన శాఖ‌లు అప్ప‌గించ‌డం.. అత్యంత కీల‌క‌మైన విజిలెన్స్ డైరెక్ట‌ర్ గా అత‌న్నే కొన‌సాగించ‌డంపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌న‌కు అనుకూలంగా ఉన్నవారికి మేలు చేసేలా టెండ‌ర్ల ప‌క్రియ ఉంటుంది. వాహ‌నాల కొనుగోళ్ల‌లో గోల్ మాల్ వ్య‌వ‌హారం, ఫైన్స్ విధించ‌డంలో వివ‌క్ష‌లు చూపించి దొచుకుంటున్నార‌నే మ‌ర‌క‌లు ఉన్నాయి. వీట‌న్నింటి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. హైకోర్టు రిటైర్డ్ జ‌డ్జితో లేదా యాక్టింగ్ జిల్లా జ‌డ్జితో విచార‌ణ చేప‌డితేనే తెలుస్తుందని జీహెచ్ఎంసీ గురించి తెలిసిన నాయ‌కులు, ఉద్యోగులు, పౌరులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.