Saturday, March 4, 2023

రేవంత్ రెడ్డి కాన్వాయ్ కీ ప్రమాదం.....!

*రేవంత్ రెడ్డి కాన్వాయ్ కీ ప్రమాదం.....!*

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాన్యాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది.అతివేగంతో అదుపుతప్పి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రేవంత్‌రెడ్డికి చెందిన 4 కార్లతో పాటు 2 న్యూస్‌ ఛానళ్ల కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఒక కారులో ప్రయాణిస్తున్న పలువురు  గాయపడినట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, March 3, 2023

తెలంగాణలో....అమిత్ షా.... మే తర్వాత ఇక్కడే మకాం.....!

*తెలంగాణలో  బీజేపీ గెలుపే లక్షంగా....అమిత్ షా చేతికి బాధ్యతలు.... మే తర్వాత ఇక్కడే మకాం.....!*

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా జాతీయ నేతలు , కేంద్ర మంత్రులు తెలంగాణకు క్యూకట్టనున్నారు.ఈ క్రమంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 12న తెలంగాణకు రానున్నారు. సంగారెడ్డిలో జరగనున్న బీజేపీ మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అంతేకాదు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను స్వయంగా తీసుకున్నారు. అలాగే రాష్ట్ర నేతల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టారు. ఇకపై రెగ్యులర్‌గా ఎవరో ఒక నేత ఇంట్లో సమావేశం కావాలని పార్టీ నేతలను ఆదేశించారు అమిత్ షా. మరోవైపు చేరికల సమన్వయ బాధ్యతలను రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్‌కు అప్పగించారు. కర్ణాటక ఎన్నికలు ముగియగానే తెలంగాణలోనే మకాం వేయాలని అమిత్ షా నిర్ణయించారు.అలాగే ఈ నెలలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యనేతలు తెలంగాణకు రానున్నారు. ఏప్రియల్‌లో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి, ఏప్రియల్‌లో బీజేపీ నేతలు విస్త్రతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అమిత్ షా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి సానుకూల పరిస్ధితులు వున్నా.. ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత వున్నప్పటికీ, రాష్ట్ర బీజేపీ నేతలు దానిని పూర్తిగా వాడుకోవడం లేదనే అభిప్రాయం జాతీయ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన మినీ కోర్ కమిటీ భేటీలోనూ ఈ విషయంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

కళాశాలలో కుప్ప కూలిన విద్యార్థి... మృతి!

కళాశాలలో కుప్ప కూలిన విద్యార్థి!

*గుండె పోటు కారణమని వైద్యుల వెల్లడి ....!*

మేడ్చల్‌: గుండెపోటుతో టీనేజీ యువకులు కూడా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిమ్‌ చేస్తూ కానిస్టేబుల్‌, వివాహ వేడుకలో నృత్యం చేస్తూ యువకుడు గుండె పోటుతో కుప్పకూలిన ఘటనలు మరువక ముందే..తాజాగా బీటెక్‌ విద్యార్థి ఒకరు గుండె పోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ సీఎంఆర్‌ ఈసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్న సచిన్‌ (18) అనే విద్యార్థి రోజు మాదిరిగానే కళాశాలకు వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తరగతులకు హాజరయ్యాడు. 3గంటల సమయంలో కళాశాల వరండాలో నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.

తోటి విద్యార్థులు గమనించి.. వెంటనే సీఎంఆర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సచిన్‌ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి కుటుంబం వృత్తిరీత్యా రాజస్థాన్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌ సుచిత్రలో నివాసం ఉంటున్నారు. విద్యార్థి మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు అప్పగించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Naxalite attack on @BommalaramarmPS in 1999

#CP_Rachakonda Sri DS Chauhan IPS called on Sri Venkat Reddy, who was the main sentry in 7 police personnel who fought bravely &retaliated Naxalite attack on @BommalaramarmPS in 1999 while CP was working as Nalgonda #ASP. CP recollected the incident &praised their heroic efforts

Thursday, March 2, 2023

గవర్నర్ బిల్లులు పెండింగ్ లో పెట్టారు సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన..... తెలంగాణ సర్కార్

*గవర్నర్ బిల్లులు పెండింగ్ లో పెట్టారు సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన..... తెలంగాణ సర్కార్*

దిల్లీ: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది.గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్‌లో పెట్టారని పేర్కొంది. సెప్టెంబరు నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖను చేర్చింది.

తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత, పురపాలక నిబంధనల, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌, ప్రైవేటు విశ్వవిద్యాలయాల, మోటర్‌ వాహనాల పన్ను, పురపాలక, పంచాయతీరాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో వెల్లడించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

నార్సింగి శ్రీ చైతన్య కళాశాల ముందు MP కోమటిరెడ్డి ధర్నా....!

*నార్సింగి శ్రీ చైతన్య కళాశాల ముందు MP కోమటిరెడ్డి ధర్నా....!


హైదరాబాద్‌: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు.సాత్విక్ సూసైట్‌ నోట్‌లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళకు దిగారు. దీంతో పోలీసులు కాలేజీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై హెచ్‌ఆర్‌డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సున్నితమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, March 1, 2023

కంట తడి పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్

*కంట తడి పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్*

అమ్మానాన్నా క్షమించండి అని పేర్కొన్న సాత్విక్; తనని వేధింపులకు గురిచేసిన వారిపై కీలక సమాచారం....

శ్రీచైతన్య విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్యకు కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ బయటపడటంతో అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితులపై పోలీసులు ఓ అంచనాకు వస్తున్నారు. అమ్మా నాన్నా నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్న సాత్విక్, ఎవరినీ బాధపట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. ప్రిన్సిపాల్, కాలేజీ ఇన్ఛార్జ్, లెక్చరర్స్ టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించాడు. కాలేజీ సిబ్బంది కృష్ణా రెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ తనను వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించాడు.

వీరందరూ ఏకమైన హాస్టల్ విద్యార్ధులను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. ఈ వేధింపులకు తాళలేక తాను ఇంత విపరీత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తనని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. స్నేహితులకు తాను వెళ్లిపోతున్నందుకు సారీ చెప్పడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️