Friday, February 23, 2024

హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయి.

హెచ్ఎండీఏ కార్యాల‌యంలో వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీహెచ్ఎంసీపై ముఖ్య‌మంత్రి శ్రీ @Revanth_Anumula స‌మీక్ష‌ నిర్వహించారు.

➧ @GHMCOnline, @HMDA_Gov ప‌రిధిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్స్ ఫైల్స్ క్లియ‌ర్‌గా ఉండాలి
➧ చాలా బిల్డింగ్స్ అనుమ‌తుల‌కు సంబంధించిన ఫైల్స్ క‌నిపించ‌డం లేదు. ఆన్‌లైన్ లేకుండా ఇష్టారీతిగా ప‌ర్మిష‌న్లు ఇచ్చారు.
➧ 15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయి. ఇష్టానుసారంగా  వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇంటికిపోతారు.
➧ ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేయాల్సిందే..
➧ హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోంది..
➧ 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందే..
➧ చెరువులు ఆక్ర‌మ‌ణ‌కు గురికాకుండా వాటి వ‌ద్ద త‌క్ష‌ణ‌మే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

పుర‌పాల‌క ప‌రిపాల‌న శాఖ‌పై సీఎం స‌మీక్ష‌:
➧ హైద‌రాబాద్ న‌గ‌రంలో పిల్ల‌ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి
➧ కొత్త‌గా ఏర్ప‌డిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆశ్చ‌ర్యం..
➧ ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ రామ‌కృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి
➧ గ్రూప్ 1 అధికారులు క‌మిష‌న‌ర్‌లుగా ఉండేలా చూడాల‌ని ఆదేశం...
➧ కొత్త కార్పొరేష‌న్ల‌కు ఐఏఎస్‌ల‌ను క‌మిష‌న‌ర్‌లుగా నియ‌మించాల‌ని సూచ‌న‌
➧ మున్సిపాలిటీల్లో ప‌ని చేసే మున్సిప‌ల్ వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌మాద బీమా క‌ల్పించ‌డంపై అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశాలు...
➧ జీహెచ్ ఎంసీలో వ‌య‌స్సుపైబ‌డిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచ‌న‌
➧ ఆస్తి ప‌న్ను మ‌దింపు కోసం డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించేందుకు అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం ఆదేశాలు
➧ హైద‌రాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచ‌న‌
➧ జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి హెచ్చ‌రిక...  ఉద‌య‌మే లేచి కాల‌నీల్లో ప‌ర్య‌టించని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఇంటికి వెళ్లిపోవ‌చ్చ‌న్న ముఖ్య‌మంత్రి
➧ కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే ఇస్తామ‌ని వ్యాఖ్య‌
➧ హైద‌రాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హాలో వీడియో ప్ర‌క‌ట‌న‌ల బోర్డు ఏర్పాటు చేయాల‌ని సూచ‌న‌
➧ మ‌ల్టీ యుటిలిటీ ట‌వ‌ర్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు
➧ వీధి దీపాలు మెరుగుద‌ల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌

వాట‌ర్ వ‌ర్క్స్ స‌మీక్ష‌లో  సీఎం..
➧ హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశాలు
➧ స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని సూచ‌న‌
➧ మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌ని ఆదేశం...
➧ ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించాల‌ని సూచ‌న‌
➧ వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని అధికారుల‌కు సూచించిన సీఎం
➧ హైద‌రాబాద్‌లో విలువైన ప్ర‌భుత్వ ఆస్తుల జాబితాను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం
➧ హైద‌రాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్స‌వాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాల‌ని అధికారుల‌కు సీఎం సూచ‌న‌
➧ మెట్రో కొత్త మార్గాల‌కు త్వ‌ర‌లో శంకుస్థాప‌న
➧ నాలుగు గంట‌ల‌కుపైగా సాగిన స‌మీక్ష

ఈ స‌మీక్ష‌లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఉన్న‌తాధికారులు శ్రీ దాన కిషోర్‌, శ్రీమతి ఆమ్ర‌పాలి త‌దిత‌రులు.

Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1761082058711969817?t=y2xIYxcajAFBuIQ0sOVZAw&s=19

No comments:

Post a Comment