గౌ.శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
నమస్కారం...
విషయం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పాత వాసనలు, జర్నలిస్ట్ సంఘం అడ్డుపెట్టుకొని, జర్నలిస్ట్ ల కోసం పని చేయని వారికి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వారికి పెద్ద పీట వేస్తూ పదవులు కట్టబెట్టే విషయం.
మాన్యశ్రీ.
తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులకు వత్తాసు పలుకుతూ ఉలుకు పలుకు లేకుండా జర్నలిస్ట్ లకు, వారి కుటుంబాలకు చేయూత నివ్వకుండా ఏనాడూ కెసిఆర్ ను, ఆయన ప్రభుత్వం చర్యలు ఎండగట్టని వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి IJU గారికి పదవి అప్పగించారు. 9 సంవత్సరాలనుండి జర్నలిస్ట్ లు సచివాలయం, ప్రగతి భవన్ మొఖం చూడలేని స్థితి, జర్నలిస్ట్ లపై దాడులు జరిగితే ఏనాడు మాట్లాడటం చేతకాని వారు, ఎందరో జర్నలిస్ట్ లకు వేతనాలు లేవు మీడియా సంస్థలు మూత పడుతున్న పట్టింపు లేని సంఘం వారు ఎప్పుడు కొత్త రంగు వేసుకొని మీ వద్దకు రాగానే పదవులు ఇస్తున్నారు. సిపిఐ పార్టీ అనుబంధ సంఘం అయినంత మాత్రాన వారికి పదవులు ఇస్తారా... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎందరో జర్నలిస్ట్ లు తమ ఉద్యోగాలు, ప్రాణాలు లెక్క చేయకుండా జైలు పాలై ఉన్న వారేందరో ఉన్నప్పటికి ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి గారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేత, జర్నలిస్ట్ సంఘం పేరుతో గత కొంత కాలంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న కేవలం ఓ... ముగ్గురు నేతలు మాత్రమే ఈ రెండు రాష్ట్రాల్లో పదవులు పొందుతూన్నారు.
జర్నలిస్ట్ జీవితాలు, వారి మనోభావాలు, ఆత్మ గౌరవం దెబ్బ తింటున్న ఆయన వారు ఎప్పుడు, ఏనాడు పట్టించుకోలేదు. కేవలం పెద్ద సంఘం అన్న గొప్ప తప్పా... వీరు చేసింది శూన్యం.. వీరికి అధికారం కోసం అందరు జర్నలిస్ట్ లు కావాలి కానీ వారి పదవులు పొందిన తరువాత జర్నలిస్ట్ లు నాన్ జర్నలిస్ట్ లని విడదీయటం ఆయా సంఘాల పని, కరోనా విపత్తులో ఈయన ఈ సంఘం చేసింది నిల్, జాతీయ జర్నలిస్ట్ నాయకుడని చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడింది శూన్యం... కనీసం రైల్వే పాసులు జర్నలిస్ట్ లకు ఇప్పించేందుకు ప్రయత్నం చేయని శ్రీనివాస్ రెడ్డి ఎలా జాతీయ నాయకులో అర్ధం కావడం లేదు. జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్రాలు కనీస వేతనాలు, విద్య, వైద్యం, పెన్షన్ సౌకర్యం ఇస్తున్నాయి మరి IJU శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ జర్నలిస్ట్ సమాజానికి చేసిన కృషి ఏమిటీ అని నేను ప్రశ్నిస్తున్నాను. హైదరాబాద్ లో ఇంత వరకు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఈయన సహచర మిత్రులు చాలా కాలంగా పదవులు అనుభవించారే తప్ప హైదరాబాద్ లో జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఎందుకు ఇప్పించలేక పోయారు. శ్రీనివాస్ రెడ్డి గారి సహచర మరో సంఘం నేత 9 సంవత్సరాలనుండి అకాడమి చైర్మన్ గా ఉండి ఆయన జర్నలిస్ట్ సమాజానికి ఏమీ చేయకున్నా ఆయనతో జర్నలిస్ట్ ల కోసం పని చేయించింది లేదు. ఆ సంఘం ప్రభుత్వాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు 9 సంవత్సరాల నుండి మ్యాచ్ పిక్స్ అయ్యారు. బీసీ, ఎస్ సి, ఎస్టీ మైనార్టీ బిడ్డలే జర్నలిస్ట్ సమూహంలో ఎక్కువ ఉన్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గం కోసం శ్రీనివాస్ రెడ్డి గారికి పదవి ఇవ్వడం దారుణం అని నేను బావిస్తున్నాను.
సీనియర్ జర్నలిస్ట్ నాయకులు అనే క్వాలిపికేషన్ తప్ప ఆయనను ఏ క్రింద స్థాయి జర్నలిస్ట్ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శ్రీనివాస్ రెడ్డి గారి అర్హతను ప్రమోట్ చేసింది లేదు. మెజారిటీ ఉన్న బహుజన జర్నలిస్ట్ బిడ్డలు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుచడం లేదు. గడిచిన ఎన్నికల్లో స్వతాహగా అయన కొందరు ఎమ్మెల్యేలను గెలిపించింది లేదు. పార్టీ కోసం కష్టపడ్డది లేదు, విలువైన సలహాలు మీకు, పార్టీకి ఇచ్చింది లేదు. కనీసం గడిచిన ఎన్నికల్లో ఆయన సంఘం జిల్లా అధ్యక్షులు, నాయకులు కెసిఆర్ నాయకత్వంలో బి. ఆర్. ఎస్ తో కలిసి పనిచేశారు. మరి ప్రస్తుతం ప్రెస్ అకాడమి పదవిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఆ పదవిని శ్రీనివాస్ రెడ్డి గారికి కట్ట బెట్టడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ ల ఎన్నో సమస్యలు ఉన్నాయని మీకు తెలుసు వాటిని మీ ముందు గతంలో ఉంచాము. ప్రస్తుతం ఒక నూతన జర్నలిస్ట్ సంఘంగా మీకు నా అభ్యర్థన జర్నలిస్ట్ సమస్యలు అన్ని ప్రభుత్వ పరంగా మీతో చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము. లేదంటే కొన్ని సమస్యలు చట్టపరమైన హక్కుల ద్వారా సాధిస్తాం అనే నమ్మకం ఉంది. ప్రస్తుత చైర్మన్ కేవలం అకాడమి వరకు వర్తించేలా చూడండి. ఈ సమస్యలు ప్రెస్ అకాడమీతో తీరవు కావున తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ ల సంక్షేమ బోర్డు వేసి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించండి. సంక్షేమ బోర్డులోనే ప్రెస్ అకాడమీని కొనసాగించండి. సత్తా గల జర్నలిస్ట్ సంఘాల నాయకత్వం సలహాల కోసం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికలు నిర్వహించండి. ఇందు కోసం తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ మీ నాయకత్వంలో పని చేస్తుంది.
ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి జర్నలిస్ట్ సమస్యల గురించి మేము తీసుకెళ్ళాం వారు రెండు నెలలు సమయం ఇచ్చి రమ్మని అన్నారు. మీతో రెండు నెలలు ఆగి అన్ని విషయాలు చర్చ పెట్టాలని అనుకున్నాం. కాని ఈ లోపు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రెస్ అకాడమి చైర్మన్ పదవి ఇచ్చి పాత పాలేగాల్లనే కొత్తగా ఈ ప్రభుత్వం నియమించడం బాధ కలిగిస్తుంది. కావున ఈ విషయంలో పునరాలోచన చేయాలని మిమ్ములను కోరుతున్నాను.
ఇట్లు
మీ విశ్వాసపాత్రుడు
*(డి. వై. గిరి)*
తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
సెల్ : 7013667743
No comments:
Post a Comment