Saturday, October 3, 2020

ఆ అధికారి రాసిన ఆ పదాలు... అందరిని ఆలోచింపజేస్తున్న వైనం!!

హైదరాబాద్ : 03/10/2020

*ఆ అధికారి రాసిన ఆ పదాలు... అందరిని ఆలోచింపజేస్తున్న వైనం!!*

ఆడపిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాల గురించి ఆ అధికారి రాసిన పదాలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. ఆ అధికారి మరెవరో కాదు *మహిళా భద్రత విభాగం డిఐజి సుమతి IPS*

దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచార నేరాల గురించి ఆమె రాస్తూ సమాజంలో పౌరచైతన్యంతోనే ఇది సాధ్యమవుతుందని, ఆడపిల్లల పట్ల అతి కర్కోటక ఘటనలకు అవగాహనా చైతన్యంతోనే అంతం అవుతాయని అన్నారు.
మహిళా భద్రత విభాగంలో ఇప్పటికే అడిషనల్ డిజిపి స్వాతి లక్రా తో కలిసి సుమతి మహిళల సమస్యల పట్ల వారి రక్షణ పట్ల ఎన్నో విధానాలు తీసుకొస్తూ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన విషయం విదితమే!! ఆలాగే సోషల్ మీడియాలో కొన్ని అవగాహాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
దానిలో భాగంగానే ఈ  మధ్య సైబర్ ఫర్ హర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించే అందరితో ప్రశంశలు అందుకొని ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న ఆడవాళ్లకు నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు.
మహిళా భద్రతా విభాగం అధికారి సుమతి IPS మేడం  ఏవైనా మాటలు చెప్తే మన ఇంట్లో మన సొంత సోదరి చెప్పిన విధంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ప్రశంశలు కురిపిస్తున్నారు.
ఆడపిల్లల పట్ల జరుగుతున్న సైబర్ సంఘటనలు కానీ, ఇంకా ఇతర ఘటనలు కానీ ఆ అకృత్యాలపై అవగాహన లో భాగంగానే సుమతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహిళలు నిత్యం అప్రమత్తంగా ఉండేలా చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
అందులో భాగంగా గాంధీ జయంతి సందర్బంగా అందరిని ఆలోచింపజేసేలా కొన్ని పదాలు ఆమె రాసిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు ఆమె రాసిన కొన్ని పోస్టులు అందరిని ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. గాంధీ చూపిన బాటలో ఆడవాళ్లను గౌరవించి నారిమణులపై పడే నల్లటిమరకలపై సమాజంలో  పౌరచైత్యంతోనే పరిష్కారంగా మారుతుందని తెలిపారు.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

http://prajasankalpam1

Friday, October 2, 2020

GHMC ఎన్నికలు - స్థానిక MLA హామీలు

https://twitter.com/Praja_Snklpm/status/1312257852296228864?s=08

*మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ బాగాయత్ భూములను క్రమబద్దీకరణ విషయం అయి ట్విట్టర్ ద్వారా తెలంగాణ CMO ఆఫీస్ కు, యువమంత్రివర్యులు కేటీఆర్ గారికి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ సర్ గారికి,GHMC కమీషనర్ గారికి, MP రేవంత్ రెడ్డి గారికి,MLA సుభాష్ రెడ్డి గారికి, మాజీ MLA NVSS ప్రభాకర్ గారికి, Lb నగర్ జోనల్ కమీషనర్ గారికి, ఉప్పల్ DC మేడం గారికి.... ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలకోసం పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్తలు విజయ్ & ఉమేష్ గారికి, ప్రముఖ జర్నలిస్ట్ లకు తెలియపరచడం జరిగింది.*

*ఈ ట్విట్టర్ విశ్లేషణ రికార్డ్ అయింది. ఎందుకంటే రేపు ఎవరైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే చట్టప్రకారం వెళ్లడానికి వెనుకాడేది లేదు*
03/10/2020

బాపట్ల కృష్ణమోహన్ 
prajasankalpam1@gmail.com

http://prajasankalpam1.blogspot.com

భారత దేశంలో మహిళలకు భద్రత లేదా??

హైదరాబాద్ : 02/10/2020

*ఈ దుర్ఘటనకు కారణం ఎవరు  ??? **

*ఎందుకు చట్టాలు మహిళలకు రక్షణ కల్పించడం లేదు  ???*

*భారత ఉన్నత న్యాయస్థానం మహిళలకు ఎందుకు  భరోసా ఇవ్వడం లేదు  ??*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Thursday, October 1, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 02/10/2020

*తెలంగాణ లో కొత్తగా 2,009 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 54,098 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,009 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,95,609కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1145కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,437 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,65,884కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 28,620 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,372 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 31,04,542కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

Misusing office n glorifying political party

హైదరాబాద్ : 02/10/2020

*చివరికి కూర్చునే చైర్లు కూడా పార్టీ రంగేన?? మరి టూ మచ్ అనిపిస్థలే మీకు?* @TelanganaCMO @IPRTelangana,  *Respected Mam @DrTamilisaiGuv*
90% of Bureaucrats in d State are misusing office n glorifying political party by using public money, plz direct officials to stop ths Criminal Act.

@VijayGopal_

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

Wednesday, September 30, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 01/10/2020

*తెలంగాణ లో కొత్తగా 2,214 కరోనా  కేసులు*
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి 8గంటల వరకు 54,443 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,214 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,93,600కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1135కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,63,407కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,058 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,702 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 30,50,444కి చేరింది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

GHMC ఎన్నికలు - బ్యాలెట్ లేదు EVM ???

హైదరాబాద్ : 01/10/2020

*బ్యాలెట్ తోనే  జిహెచ్ఎంసి పోరు!*

*ఈవీఎంలతో ఎన్నికలు సాధ్యం కాదని భావిస్తున్న ఎస్‌ఈసీ*

*రెండు, మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన!*

*బ్యాలెట్‌వైపే టీఆర్‌ఎస్‌ మొగ్గు.. ఈవీఎంలే మేలంటున్న బీజేపీ*

*ముందే నిర్ణయించాక అభిప్రాయాలడిగి ఏం లాభమన్న కాంగ్రెస్‌*
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతోనే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణకు తగిన సంఖ్యలో వీవీప్యాట్‌ మెషీన్లు అందుబాటులో లేనందున వాటితో సాధ్యం కాకపోవచ్చుననే నిర్ధారణకు ఎస్‌ఈసీ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతీ ఈవీఎం మెషీన్‌కు వీవీప్యాట్‌ను జతచేయాలన్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు అనుగుణంగా బ్యాలెట్‌ పేపర్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు ' ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.
వీవీప్యాట్‌లను సరఫరా చేయాలంటూ ఇదివరకే ఈసీఐఎల్, బెల్‌ కంపెనీలను ఎస్‌ఈసీ కోర గా, అవి అనుమతి కోసం ఈసీకి రాశాయి. ఈసీ నుంచి అనుమతి లభించి, ఆ కంపెనీలు ఈ ఎన్నికలకు అవసరమైన సంఖ్యలో వీవీప్యాట్‌ యంత్రాలు తయారు చేసేప్పటికి కాలాతీతమౌతుందనే అభిప్రాయంతో ఎస్‌ఈసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే బ్యా లెట్‌ బాక్స్‌లతోనే ఎన్నికలకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే దీనిపై రెండు, మూడ్రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
ముగిసిన గడువు..
త్వరలోనే ఈసీ, జీహెచ్‌ఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అభిప్రాయాలు కూడా ఎస్‌ఈసీ తీసుకోనుంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు ఏ విధానమైతే సులభంగా ఉంటుందన్న దానిపై స్పష్టతనివ్వాలని కోరినట్టు తెలిసింది. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలను ఎస్‌ఈసీ కోరిన గడువు కూడా బుధవారంతో ముగిసింది. టీఆర్‌ఎస్‌తో పలు పార్టీలు బ్యాలెట్‌ పేపర్ల వైపే మొగ్గుచూపగా, బీజేపీ మాత్రం ఈవీఎంలతోనే నిర్వహించాలని సూచించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మాత్రం ఏ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనమో ఎస్‌ఈసీ చెప్పకుండా, ముందుగానే బ్యాలెట్లతో నిర్వహించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించింది. ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తే ఓటర్లకు రిస్క్‌ తక్కువగా ఉంటుందన్న దానిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఎస్‌ఈసీ చెబితే దానిపై తమ నిర్ణయం చెబుతామంటూ టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్‌ కమిటీ బుధవారం లేఖను పంపింది.
*రెండింటిలోనూ రిస్కే..*

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈవీఎం లేదా బ్యాలెట్‌ పత్రాలు.. ఏ రకంగా ఎన్నికలు నిర్వహించినా రిస్కేనని, ఈ రెండు పద్ధతుల్లోనూ సానుకూల, వ్యతిరేక అంశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఓటర్‌కు కోవిడ్‌ ఉన్నా లక్షణాలు కనిపించని అసింప్టమేటిక్‌గా ఉంటే ఏ విధానంలో నిర్వహించినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతరులకు సోకే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదీగాకుండా కెమికల్స్‌తో ప్రింట్‌ చేసిన న్యూస్‌ పేపర్‌ లేదా బ్యాలెట్‌ పేపర్‌పై వైరస్‌ ఎక్కువ సేపుండే అవకాశాలు తక్కువనేది ఇప్పటికే స్పష్టమైనందున ఆ పద్ధతి వైపే ఎస్‌ఈసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
*ఎన్నికలు ఎప్పుడు..?*

ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా ఎస్‌ఈసీ స్పష్టతనివ్వడం లేదు. ప్రభుత్వం నుంచి వార్డుల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల నివేదిక అందగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన వివిధ ప్రక్రియలను పూర్తి చేయడంలో నిమగ్నమైనట్టు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున వచ్చే ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే వీలుంది. దీన్ని బట్టి నవంబర్‌ 2, 3వ వారం నుంచి డిసెంబర్‌ చివరివరకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. సంక్రాంతి పండుగ ముగిశాక వచ్చే మంచి రోజుల్లో ఎన్నికలు జరపాలనుకుంటే మాత్రం జనవరి 15 నుంచి 25వ తేదీల మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టుగా అంచనా వేస్తున్నారు.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/