Wednesday, April 5, 2023

బండి సంజయ్ భార్య ఆవేదన....!

*చెప్తున్నా వినకుండా కాలర్ పట్టుకొని లాక్కెళ్లారు.... బండి సంజయ్ భార్య ఆవేదన....!*

కరీంనగర్‌: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోపోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం బలవంతంగా పోలీస్ వాహనంలో యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎందుకు అరెస్టు చేశారు, ఏ విషయంలో కేసు నమోదు చేశారనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత లేదు.

తాజాగా సంజయ్‌ను అదుపులోకి తీసుకోవడంపై ఆయన భార్య అపర్ణ స్పందించారు. అసలు కరీంనగర్‌లోని ఇంట్లో మంగళవారం రాత్రి ఏం జరిగిందో ఆమె వివరణ ఇచ్చారు పోలీసులు అకస్మాత్తుగా ఇంటిపై దాడి చేసి తన భర్తను అరెస్ట్ చేయడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపారు. సంజయ్‌ హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపట్లోనే పోలీసులు దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి(అపర్ణ తల్లి) చనిపోయిన బాధలో ఉన్నామని.. చిన్న కర్మకు హాజరయ్యేందుకు వచ్చిన సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని వాపోయారు.

ఆమె మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి డిన్నర్‌ చేస్తున్న సమయంలో ఏసీపీ వచ్చారు. కూర్చొమని చెప్పి.. వెంటనే తిని ఆయన బయటకు వెళ్లారు. చెప్పండి సర్‌ ఇలా వచ్చారు అని అడిగితే.. అరెస్ట​ చేయాలి సర్‌ మిమ్మల్ని.. మాకు ఆర్డర్స్‌ వచ్చాయని తెలిపారు. ఏ విషయంలో అరెస్ట్‌ చేస్తున్నారు, అరెస్ట్‌ వారెంట్‌ ఉందా అని సంజయ్‌ అడిగితే లేదని చెప్పారు. కమిషనర్‌ సర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పడంతో కమిషనర్‌కు ఫోన్‌ చేశారు. ఏ కారణంతోనే నన్ను ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు..

ఆయన మాట్లాడుతుండగానే 40 మంది పోలీసులు వచ్చి సంజయ్‌ను చుట్టుముట్టారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున్న అడ్డుకునేందుకు యత్నించినా.. వినకుండా కాలర్‌ ప్టటుకుని బయటకు లాక్కెళ్లారు. ఇంట్లో ఉన్న సామన్లు, ఫర్నీచర్‌ బయటపడేశారు. ఇంటి దగ్గర దాదాపు గంట సేపు వాగ్వాదం జరిగింది. ఇప్పుడే తిన్నారు. హార్ట్‌ పేషెంట్‌.. మందులు వేసుకోలేదని నేను చెప్తూనే ఉన్నాను. అయినా మాట వినిపించుకోకుండా తీసుకెళ్లారు. ఒక ఎంపీని, ప్రజాప్రతినిధిని ఇంత దారుణంగా అరెస్ట్‌ చేస్తారని అనుకోలేదు. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. మమ్మల్ని బయటకు కూడా రానివ్వకుండా డోర్‌ లాక్‌ చేశారు' అని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, April 4, 2023

బండి సంజయ్ అరెస్ట్ అప్ డేట్

*_బండి సంజయ్ అరెస్ట్ అప్ డేట్_*
*_★ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన భాజపా_*

*_సంజయ్‌ అరెస్ట్‌పై భాజపా హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. అర్ధరాత్రి ఆయన్ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు._*

*_★ మరికొద్ది సేపట్లో న్యాయమూర్తి ఎదుట_*

*_★ బొమ్మలరామారం పీఎస్‌ నుంచి బండి సంజయ్ తరలింపు_*

*_★ టెన్త్ క్లాస్ లీకేజీ కేసులోనే..._*

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ను పోలీసులు బొమ్మలరామరం పోలీస్‌ స్టేషన్‌ నుంచి తరలించారు. కాసేపట్లో జడ్జి ఎదుట బండి సంజయ్‌ను హాజరుపరుచనున్నారు. వరంగల్‌ లో టెన్త్ హిందీ పేపర్ వైరల్ అయిన కేసులో బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. బండిపై కుట్ర కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే బండి సంజయ్‌ను తరలిస్తున్న మార్గంలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ కాన్వాయ్ మధ్య బండి సంజయ్‌ను పోలీసులు తరలించారు. సంజయ్‌ను తరలిస్తుండగా కారును బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే బీజేపీ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు బండి సంజయ్‌ను తరలించారు.

*హైకోర్టులో పిటీషన్..:*
మరోవైపు బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్‌ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో బీజేపీ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోనున్నారు. అటు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు ఎక్కిడికక్కడ బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు. పలువురు ముందుస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అలాగే బండి సంజయ్‌ను పరామర్శించేందుకు బొమ్మలరామరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కాసేపట్లో జడ్జి ఎదుట బండి సంజయ్‌ను హాజరుపర్చనున్నారు.

Monday, April 3, 2023

టెన్త్ పేపర్ లీకేజ్ ఘటన తెలంగాణ సర్కార్ సీరియస్

*టెన్త్ పేపర్ లీకేజ్ ఘటన తెలంగాణ సర్కార్ సీరియస్*

వికారాబాద్‌: తాండూర్‌లో  వ్యవహారంపై తెలంగాణ సర్కార్‌ సీరియస్‌ అయ్యింది.సెల్‌ఫోన్‌ను లోపలికి అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎగ్జామ్‌ సెంటర్‌ సూపరింటెండెంట్‌ను తొలిగిస్తూ చర్యలు చేపట్టింది. క్వశ్చన్‌ పేపర్‌ లీకేజ్‌పై నివేదిక ఇవ్వాలని వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు టెన్త్‌ పేపర్‌ బయటకు పంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే పేపర్‌ ఎక్కడా లీక్‌ కాలేదని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష మొదలైన తర్వాతే పేపర్‌ బయటకు వచ్చిందని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్‌ను మీడియా గ్రూప్‌లో పెట్టిన్నట్లు గుర్తించారు.

ఉదయం 9:30 గంటలకు పదో తరగతి పరీక్ష ప్రారంభమవ్వగా.. 9:37 గంటలకు పేపర్‌ను వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌చేశారని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్‌ హాల్‌నుంచి పేపర్‌ పంపినందుకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా ఆదివారం ఉదయం వాట్సాప్‌ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్‌ పేపర్‌ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్‌ తాండూరులో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. పేపర్ బయటకు లీక్ కావడం, వాట్సప్‌లో వైరల్ కావడంపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసు శాఖతోపాటు విద్యాశాఖ విచారణ ప్రారంభించింది

*సుజీవన్ వావిలాల*🖋️

125 అడుగుల అంబేద్కర్ లోహమూర్తి

*అంబరమంత..... అంబేడ్కర్....!*

*125 అడుగుల లోహమూర్తి*
*ఆయన విగ్రహాల్లో* *దేశంలోనే ఎత్తయినది*
*ఈ నెల 14న* *ప్రారంభానికి సన్నాహాలు*

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాల్లో దేశంలోనే అతి పెద్దది హైదరాబాద్‌లో సిద్ధమవుతోంది.ఆయన 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన 125 అడుగుల భారీ లోహమూర్తి అంతెత్తున ఠీవిగా నిలిచింది. అంబేడ్కర్‌ జయంతి వేళ.. ఈ నెల 14వ తేదీన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కన 11 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు అనేక విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంటోంది. 2016లోనే ఈ ఆలోచన పురుడు పోసుకున్నా.. కార్యరూపంలోకి రావటానికి సుమారు ఏడేళ్లు పట్టింది. ఇంత భారీ విగ్రహ నిర్మాణ సామర్థ్యం దేశీయంగా ఉందా? లేదా? అన్న మీమాంసతో అప్పటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం చైనాలో పర్యటించి వివిధ విగ్రహ తయారీ సంస్థలను సందర్శించింది. తర్వాత కరోనాతోపాటు చైనాతో నెలకొన్న సంబంధాల నేపథ్యంలో విగ్రహాన్ని దేశీయంగానే తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నమూనా రూపకల్పన, నిర్మాణ వ్యవహారాల కోసం టెండర్లు ఆహ్వానించింది. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత రాం వన్‌జీ సుతార్‌, ఆయన కుమారుడు అనిల్‌ సుతార్‌లు కలిసి విగ్రహ నమూనాలు సిద్ధం చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి తయారీ బాధ్యతను వారికి అప్పగించింది. విగ్రహ భాగాలను దిల్లీలో పోత పోసి హైదరాబాద్‌కు తరలించి ప్రతిష్ఠించారు. ప్రముఖ గుత్తేదారు సంస్థ కేపీసీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నిర్మాణ బాధ్యతను చేపట్టింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, April 2, 2023

పార్టీనేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం....!

*సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి.... పార్టీనేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం....!*

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటైందని వెల్లడించారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు కమిటీకి సహకరించాలని కేటీఆర్ సూచించారు. ఈ కమిటీ ద్వారానే కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన అభిప్రాయాలు తీసుకుంటారని వెల్లడించారు.

ఎన్నికల ఏడాదిలో ప్రతి ఎమ్మెల్యే అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ బృందం ద్వారా అటు పార్టీకి ప్రజలకు నిరంతరం సమాచారం అందించడంతోపాటు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలు మరింత బలోపేతం చేసుకోవాలని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు మే వరకు నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరింత విస్తృతంగా, కూలంకషంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.
*సమాచార సైనికులుగా పార్టీ కార్యకర్తలు...!*ప్రతి ఆత్మీయ సమ్మేళనం కచ్చితంగా సీఎం కేసీఆర్‌ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలని కేటీఆర్‌ సూచించారు. సీఎం ఆత్మీయ సందేశం ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాల వంటి మెటీరియల్స్ సిద్ధం చేసి విస్తృతంగా పంపిణీ చేసుకోవాలన్నారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పదవుల్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో హాజరయ్యేలా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు అవకాశం లభిస్తుందన్నారు. తెలంగాణ సాధించిన అభివృద్ధిపైన విస్తృతంగా మాట్లాడేందుకు ప్రజాప్రతినిధులు, వక్తలను ప్రత్యేకంగా ఇందుకు ఉపయోగించుకోవాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అందివచ్చిన సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారు చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని కేటీఆర్ పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, April 1, 2023

పాత్రికేయులకు న్యాయం చేయాలి

బండి సంజయ్ రేవంత్ రెడ్డి లకు ఫోన్ చేసిన షర్మిల కలసి పోరాడుదాం

*బండి సంజయ్ రేవంత్ రెడ్డి లకు ఫోన్ చేసిన షర్మిల కలసి పోరాడుదాం....అని పిలుపు...!*

హైదరాబాద్‌ : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదామని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని.. ప్రగతి భవన్‌కు మార్చ్ పిలుపునిద్దామని సూచించారు. 'కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి.కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరు' అని షర్మిల అన్నారు.

ఉమ్మడిగా పోరాటం చేసేందుకు షర్మిలకు బండి సంజయ్‌ మద్దతు తెలిపి.. త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️