Tuesday, October 6, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 07/10/2020

*తెలంగాణ లో కొత్తగా 2,154 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 54,277 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,04,748కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1189కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,239 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,77,008కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,551 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 21,864 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 33,46,472కి చేరింది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Monday, October 5, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 06/10/2020

*తెలంగాణ లో కొత్తగా 1,983 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 50,598 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,983 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,02,594కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1181కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,381 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,74,769కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,644 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 21,784 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 32,92,195కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

ప్రజా ప్రతినిధులు రెవిన్యూ సిబ్బంది మీద దురుసుగా మాట్లాడిన తీరుకు అధికారుల స్పందన

https://youtu.be/pm_D7QV_wqQ

*నిన్న కుతుబుల్లాపూర్ MLA గారు రెవిన్యూ సిబ్బంది మీద దురుసుగా (బూతులు) మాట్లాడడం తొలివెలుగు మీడియా ద్వారా ప్రజా సంకల్పం కు తెలియగానే తక్షణమే తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ గారికి మరియు  రెవిన్యూ అధికారుల సంఘం ప్రతినిధి గౌతమ్ కుమార్ MRO గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి అధికారులు స్పందించడం అభినందిస్తున్నాము **
05/10/2020

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు పోలీస్ ఉన్నతాధికారులతో బేటీ 7 వ తేదీన

హైదరాబాద్ : 05/10/2020

*పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కానున్న కేసీఆర్*
ఈ నెల 7న పోలీసు ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ కానున్నారు.ఈ సమావేశానికి హోంశాఖ, అటవీశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణతోపాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మహిళల భద్రతపై విస్తృతంగా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై కేసీఆర్‌ విస్తృతంగా చర్చించే అవకాశముంది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

గ్రేటర్ ట్రాఫిక్ వింగ్ లో సిబ్బంది కొరత

https://twitter.com/Praja_Snklpm/status/1312968983704813569?s=08
05/10/2020 

*తెలంగాణ DGP మహేందర్ రెడ్డి సర్ గారికి నమస్కారం 🙏*
సర్ మూడు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది శాతం చాలా తక్కువ  వుంది.దయచేసి కొత్తగా నియామకాలు చేపట్టాలని *ప్రజా సంకల్పం & link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. 

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, October 4, 2020

తెలంగాణ పట్టభద్రుల MLC ఎన్నికల అప్లికేషన్ link

https://ceotserms1.telangana.gov.in/mlc/form18.aspx

తెలంగాణ పట్టభద్రుల MLC ఎన్నికలు - ఓటరు నమోదు

హైదరాబాద్ : 04/10/2020

*ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే సరైనా నాయకత్వం అధికారంలోకి వస్తుంది*.
పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.

*చదువుకున్న వారి కోసం గతంలో  నిర్వహించిన  ఎన్నికల్లో ఎక్కడా నూరు శాతం ఓట్లు నమోదు కాకపోవటం విచిత్రం*.

*Voter turnout in graduate constituencies very low*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/